మా ఉద్యమంలోకి పార్టీలు చొరబడ్డాయి
వాళ్లే ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటున్నారు
దాడులకు, ఉద్యోగులకు సంబంధం లేదు
ఉద్యోగులపై హర్షకుమార్ తనయుల దాడి దారుణం
బాధితులకు వారు వ్యక్తిగంతా క్షమాపణ చెప్పాలి
రెచ్చగొడితే అంతర్యుద్ధమే
నేతలకు అశోక్‌బాబు హెచ్చరిక
షిండే వ్యాఖ్యలు బాధ్యతారహితమని విమర్శ
దాడులకు, ఉద్యోగులకు సంబంధం లేదు
ఉద్యోగులపై హర్షకుమార్ తనయుల దాడి దారుణం
బాధితులకు వారు వ్యక్తిగంతా క్షమాపణ చెప్పాలి
రెచ్చగొడితే అంతర్యుద్ధమే
నేతలకు అశోక్‌బాబు హెచ్చరిక
షిండే వ్యాఖ్యలు బాధ్యతారహితమని విమర్శ
హైదరాబాద్, అక్టోబర్ 5 : "రాయలసీమ ప్రాంతాల్లో సమైక్య ఉద్యమంలో భాగంగా చోటుచేసుకున్న కొన్ని హింసాత్మక ఘటనలకు, ఉద్యోగులకు సంబంధం లేదు. కొన్ని రాజకీయ పార్టీలు ఉద్యమంలోకి వచ్చాయి. వాటి నేతలు ఒకరికి వ్యతిరేకంగా మరొకరు దాడులు చేసుకున్నారు. బంద్ పేరిట కొన్ని పార్టీలు హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నాయి. '' అని ఏపీఎన్జీవో సంఘాల అధ్యక్షుడు పరుచూరి అశోక్ బాబు స్పష్టం చేశారు. కడప, అనంతపురం, విజయనగరం, విజయవాడ తదితర ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై ఆందోళన వ్యక్తం చేశారు. విజయనగరంలో మంత్రి బొత్స ఇంటి వద్ద జరిగిన ఘటనలను రాజకీయపరమైన దాడులుగా అభివర్ణించారు. విజయనగరం ముట్టడి వార్తలు నిజం కాదని చెప్పారు. రాజకీయ పార్టీలు పాల్గొంటే ఆయా ఆందోళన కార్యక్రమాల నుంచి బయటకు రావాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఏపీఎన్జీవో హోంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
"రాష్ట్ర విభజన ప్రక్రియ నేపథ్యంలో ప్రజల మానసిక పరిస్థితిని అర్థం చేసుకోండి. ఉద్యోగులు దాడులు చేస్తున్నారన్న ఆరోపణలతో రాజకీయ నాయకులు ఎదురు దాడులకు పాల్పడితే ప్రజలే బుద్ధి చెబుతారు. ప్రజలకు ఊరట కల్పించాల్సిన బాధ్యత నాయకులదే. రెచ్చగొడితే సివిల్ వార్ (అంతర్యుద్ధం) వస్తుంది'' అని హెచ్చరించారు. ఉద్యోగులపై దాడులు చేస్తే ఊరుకోబోమని రాజకీయ నాయకులను హెచ్చరించారు. రాజమండ్రిలో ఉద్యోగులపై ఎంపీ హర్షకుమార్ తనయులు చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. "మీ మీద ప్రజల అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోండి'' అని రాజకీయ నాయకులకు హితవు పలికారు. రాజమండ్రిలో జరిగిన దాడి నేపథ్యంలో బాధితులకు ఎంపీ హర్షకుమార్ తనయుడు వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న హర్షకుమార్ ఇలా దాడులు చేయించడం తగదని హితవు పలికారు. సమైక్య ఉద్యమానికి తూట్లు పొడిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
"ఉద్యమంలోకి రావాలని కానీ, ఉద్యమానికి సహకరించాలని కానీ ఏ రాజకీయ పార్టీని మేం అడగలేదు. రాజకీయ నాయకులకు చిత్తశుద్ధే ఉంటే శాసనసభలో విభజన తీర్మానాన్ని వ్యతిరేకించాలి. తీర్మానానికి వ్యతిరేకంగా సీమాంధ్రకు చెందిన 159 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయాలి. ఆ రోజు శాసనసభకు రాకపోయినా, పార్టీ విధేయులమని చెప్పి తప్పించుకున్నా వారి రాజకీయ జీవితానికి శుభం కార్డు పడుతుంది. '' అని డిమాండ్ చేశారు. తల్లిని అమ్ముకునే నేతలుండడం మన దురదృష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. రాజీనామాలు చేయకుండా ఉద్యమం చేస్తామని ఎంపీలు చెప్పే మాటలను ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు. సీమాంధ్ర ఎంపీలు, కేంద్ర మంత్రులు రాజీనామా డ్రామాలను ఆపాలని, ప్రధానిని కలిసి రాజీనామా లేఖలను అందించాలని, వాటిని మీడియాకు కూడా చూపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సమైక్యత డిమాండ్‌తో ఢిల్లీలో వారం రోజులపాటు పెద్దఎత్తున ధర్నాలను నిర్వహించనున్నట్లు అశోక్‌బాబు చెప్పారు.
ఆందోళనలు సహజమేనంటూ కేంద్ర మంత్రి షిండే వ్యాఖ్యానించడం దురదృష్టకరమని, ఆయన బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని, తెలంగాణ ఉద్యమం సందర్భంగా కూడా ఆందోళనలు సహజమేనని అనుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని వ్యాఖ్యానించారు. ఈనెల 10న భీమవరంలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. సీమాంధ్ర దళిత ఎంపీలు, మంత్రులు పదవులకు రాజీనామాలు చేసి, ప్రజా ఉద్యమంలో పాల్గొనాలని మాలమహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ డిమాండ్ చేశారు.
ఏపీఎన్జీవో జేఏసీ భేటీ నేడు
రాష్ట్ర సమైక్యతను కోరుతూ ఇప్పటి వరకు చేసిన ఉద్యమాన్ని సమీక్షించుకోవడంతోపాటు భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించుకోవడానికి ఏపీఎన్జీవోలు, ఉపాధ్యాయులు, కార్మికుల జేఏసీ ఆదివారం మధ్యాహ్నం సమావేశం కానుంది. ఆర్టీసీ సహా 150 వరకూ ఉన్న భాగస్వామ్య సంఘాలు ఇందులో పాల్గొననున్నాయి. అంతకుముందు ఏపీఎన్జీవోల రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. తెలంగాణపై కేబినెట్ నోట్ ఆమోదంపై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. సమ్మె కొనసాగింపు, కొనసాగిస్తే మరింత ఉద్ధృతంగా ఎలా చేయాలి? ఇందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి? తదితర అంశాలపై చర్చించనున్నారు
- See more at: http://www.andhrajyothy.com/node/7690#sthash.9S6XgEgz.dpuf'సీమాంధ్ర ప్రజలను మోసం చేసిన కేంద్ర మంత్రలు, ఎంపీలు'
హైదరాబాద్, అక్టోబర్ 6 : రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, కేంద్రమంత్రులు సీమాంధ్ర ప్రజలను మోసం చేశారని ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు చంద్రశేఖరరెడ్డి, సత్యనారాయణలు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆదివారం వారు మీడియాతో మాట్లాడుతూ సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీలు ప్యాకేజీలకు అమ్ముడుపోయి ప్రజలను నట్టేట ముంచారని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని వారు హెచ్చరించారు. యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రతి పుట్టిన రోజున ఓ రాష్ట్రాన్ని విభజిస్తారా అని వారు ప్రశ్నించారు. రాజీనామా విషయంలో కేంద్రమంత్రులు నాటాకాలు అడుతున్నారని ఎద్దేవా చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా తమ భవిష్యత్తు కార్యాచరణ ఈ సాయంత్రం ప్రకటిస్తామని చెప్పారు.
No comments:
Post a Comment