Sunday 6 October 2013

సమైక్యాంధ్ర అవగాహన కల్పించాను : లగడపాటి

సమైక్యాంధ్ర అవగాహన కల్పించాను : లగడపాటి 

సొంతవాళ్లనే ముంచింది : లగడపాటి
Published at: 05-10-2013 05:42 AM

 New  0  0 

 



పరాయివాళ్లతో అధికారానికి రావాలనుకుంటోంది
మూడు రోజుల కిందటి భేటీ పరిణామమే నోట్ రాక
సప్రీం కోర్టుకె ళ్తాం.. రాష్ట్రపతిని కలుస్తాం
జెండాలు పక్కనపెట్టి కలిసి రండి 
: లగడపాటి
హైదరాబాద్, అక్టోబర్ 4 : కాంగ్రెస్ పార్టీ సొంత వాళ్లను ముంచి పరాయి వాళ్ల భుజస్కందాలపై అధికారానికి రావాలని కోరుకుంటున్నదని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. సొంత వాళ్లను కాదనుకుంటున్న పార్టీ వైఖరిపై ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధపడుతున్నారని తెలిపారు. శుక్రవారం ఇక్కడ ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సొంత పార్టీ దగా చేసిందని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, లక్షలాది మంది కార్యకర్తలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. ఇలాంటి పరిస్థితిలోనే సీమాంధ్ర ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు రాజీనామాలు చేశారన్నారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలను విభజించకుండా ఆంధ్రప్రదేశ్‌ను మాత్రమే విభజించడం అప్రజాస్వామ్యమని లగడపాటి వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థపై తనకు నమ్మకముందని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని, సీమాంధ్ర ప్రాంతంలోని నేతలందరూ జెండాలను పక్కనబెట్టి ముందుకు రావాలన్నారు. మిగతా రాష్ట్రాలు కూడా మన అభ్యర్థనకు మద్దతిస్తాయన్నారు.
రాజకీయ నాయకులుగా విఫలమయ్యామని, ఇక సుప్రీంకోర్టుకు వెళ్లాలని, దీనికి ఏపీఎన్జీవోలు చొరవ తీసుకోవాలన్నారు. ఇంకొంత కాలం తాత్సారం చేస్తే ఎన్నికలు వస్తాయని, అప్పుడు ప్రజలే దాని భారం చూసుకుంటారన్నారు. 3న, 10న కేబినెట్ రాదన్న తన అంచనాలు తొలిసారి తలకిందులయ్యాయన్నారు. మూడు రోజుల కిందట రాష్ట్రంలో జరిగిన కీలక సమావేశానికి సంబంధించిన పేపర్ క్లిప్పింగ్‌లను ఒక ముఖ్యనేత సోనియా గాంధీకి మాండ్యా సభలో అందజేస్తూ హైకమాండ్‌కు మంత్రులందరూ అనుకూలంగా ఉన్నారని చెప్పారని, దీంతో రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకుని కేంద్రం కేబినెట్ నోట్‌ను హడావుడిగా పెట్టిందన్నారు. ఆ నేత ఎవరో ప్రజలందరికీ తెలుసన్నారు. తాను రెండు నెలల నుంచి పార్టీని వెనకేసుకురావడం మానుకున్నానని తెలిపారు. నాలుగేళ్లుగా సమైక్యాంధ్ర అనలేని వారు ఇప్పుడు ప్రజలు చేస్తున్న దీక్షను రాజకీయం చేయాలనుకోవడం బాగా లేదని జగన్‌ను ఉద్దేశించి అన్నారు. ప్రజలు రాజకీయ పార్టీల మీద ద్వేషంతో రగిలిపోతున్నారని, అన్ని పార్టీలు తప్పు చేశాయన్నారు.

సమైక్యాంధ్రపై అవగాహన లేనప్పుడు తాను నిరాహారదీక్ష చేశానని, అవగాహన కల్పించానన్నారు.

రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఉద్యోగులు తమ వంతు కృషి చేస్తున్నారని, అలాంటి వారికి నచ్చచెప్పాల్సిన కాంగ్రెస్ హైకమాండ్ ఆ ప్రయత్నం చేయకుండా, ఎలాంటి సమాచారం లేకుండా టేబుల్ ఐటంగా కేబినెట్ నోట్ పెట్టడం దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. రాజీనామాలపై తాము వెనక్కు తగ్గేది లేదని ముఖ్యమ్రంతికి లగడపాటి స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి క్యాంపు కార్యాలయలో సీఎం కిరణ్‌తో ఎంపీ లగడపాటి, మంత్రులు కోండ్రు మురళీ, శైలజానా«థ్, టీజీ వెంకటేశ్, మాజీమంత్రి జేసీ దివాకరరెడ్డి, ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి తదితరులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాజీనామాల అంశంపై చర్చ జరిగింది.
- See more at: http://www.andhrajyothy.com/node/7307#sthash.YDa3DOuz.dpuf

No comments:

Post a Comment