విభజనతో మళ్లీ నిజాం పాలనే!
హిందువులకు శాశ్వత నష్టం
తెలంగాణలో ముస్లింలు..సీమాంధ్రలో క్రైస్తవుల బలిమి
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో ఎంఐఎంకే లాభం
స్వామి కమలానంద భారతి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో ముస్లింలు..సీమాంధ్రలో క్రైస్తవుల బలిమి
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో ఎంఐఎంకే లాభం
స్వామి కమలానంద భారతి సంచలన వ్యాఖ్యలు
తిరుపతి, అక్టోబర్ 22 : రాష్ట్ర విభజన నిర్ణయం వల్ల తెలంగాణలో మళ్లీ నిజాం ప్రభువుల పాలన వస్తుందని.. రాబోయే 10-20 సంవత్సరాల్లో హిందూ సమా జం శాశ్వతంగా నష్టపోతుందని ఆలయాల పరిరక్షణ సమితి అధ్యక్షుడు కమలానంద భారతి స్వామి వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన తిరుపతిలో 'ఏబీఎన్- ఆంధ్రజ్యోతి'కి ప్ర త్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ ఆరాటపడుతోందని దుయ్యబట్టారు. హైదరాబాద్‌లోని సీమాంధ్రుల ఓట్లకోసం ఆ పార్టీ ఎత్తుగడులు వేస్తోందన్నారు. "అఖండ భార త్ వర్థిల్లాలి.. ఆంధ్రప్రదేశ్ ముక్కలైపోవాలి'' అనే ఆలోచనతోనే బీజేపీ ముందుకుపోతోందని ఆయన విమర్శించారు. అటు కాం గ్రెస్‌కు, ఇటు బీజేపీకీ జాతీయ దృక్పథం లేదని ధ్వజమెత్తారు. అదే ఉంటే రాష్ట్ర విభజనపై వారి రోడ్ మ్యాప్ ఏంటో ప్రకటించాలన్నారు.
"ఈరోజుకైనా బీజేపీ సీమాంధ్ర ప్రాంతానికి రాజధాని ఎక్కడ పెట్టాలో చెప్పిందా?'' అని కమలానంద ప్రశ్నించారు. విభజన నిర్ణయంతో హిందువులకు ఎలా నష్టం వాటిల్లుతుందని ప్రశ్నించగా.. సీమాం«ద్రుల రక్షణకు కట్టుబడి ఉన్నామని చెప్ప డం ద్వారా హైదరాబాద్‌లో ఉన్న సీమాం«ద్రుల ఓట్లను కొల్లగొట్టడంలో ఎంఐఎం పార్టీ వ్యూహాత్మకంగా అన్ని పార్టీల కంటే ఒక అడుగు ముందు ఉందని, గ్రేటర్ హైదరాబాద్‌లోని 35 నియోజకవర్గాల్లో అందులో 28 నియోజకవర్గాల్లో కీలకమైన సీమాంధ్రుల ఓట్లను ఒడిసిపట్టే పరిస్థితి కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
దీనివల్ల తెలంగాణను తిరిగి నిజాం ప్రభువులే పరిపాలిస్తారని అన్నా రు. "అప్పట్లో ఇచ్చినట్లే గోచార భూములిస్తారు. దేవాలయాలకు మాన్యాలిస్తారు. చెరువులు తవ్విస్తారు. భద్రాచలానికి ము త్యాలు పంపిస్తారు. మళ్లీ ఒక 'ఆదర్శవంతమైన' ముస్లిం ప్రభు త్వం తెలంగాణలో రాబోతోందని మేం అభిప్రాయపడుతు న్నాం'' అని వ్యాఖ్యానించారు. ఆ పార్టీ హైదరాబాద్ నగరంలో సీట్లతో పాటు, తెలంగాణ జిల్లాల్లో కామారెడ్డి, బోధన్, ముధోల్, ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నారాయణ్ ఖేడ్, నల్గొండ టౌన్.. ఇలా పది, పదిహేను సీట్లు గెలుచుకుంటుందని వివరించారు. "తెలంగాణలోని 119 అసెంబ్లీ సీట్లలో 20 నుంచి 30 సీట్లు ఎంఐఎంకు ఉంటాయి. శాశ్వతంగా ఎంఐఎం వారు ఉ పముఖ్యమంత్రిగా ఉంటారు'' అని కమలానంద విశ్లేషించారు. కోస్తా జిల్లాల్లో ప్రకాశం, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో క్రైస్తవుల ఓట్లు కీలకంగా ఉంటాయి కాబట్టి ఇటు క్రైస్తవుల ప్రాబల్యం పెరుగుతుందని తెలిపారు.
No comments:
Post a Comment