Monday 7 October 2013

ఇక నుంచి రాజకీయ పార్టీలు పోరాటం చేస్తాయి : ఆనం

ఇక నుంచి రాజకీయ పార్టీలు పోరాటం చేస్తాయి : ఆనం

Published at: 07-10-2013 17:03 PM
 New  0  0 
 
 

హైదరాబాద్, అక్టోబర్ 7 : సమైక్యం కోసం ఇంతకాలం ఉద్యోగులు ఉద్యమం చేశారు. ఇక నుంచి రాజకీయ పార్టీలు పోరాటం చేస్తాయని, ఉద్యోగులు సమ్మె విరమించాలని కోరామని మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి పేర్కొన్నారు. సోమవారం రాష్ట్ర మంత్రి వర్గ సబ్ కమిటీ ఏపీఎన్జీవోలతో చర్చలు జరిపామని, అలాగే ఆర్టీసీ, ఉపాధ్యాయులు, విద్యుత్ జేఏసీ నేతలతో చర్చలు జరిపామని, స్పష్టమైన హామీ కావాలని కోరారని అన్నారు.
సోమవారం ఏపీ ఎన్జీవోలతో చర్చలు జరిగిన అనంతరం మంత్రి ఆనం మీడియాతో మాట్లాడుతూ బుధవారం మ«ధ్యాహ్నం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డితో ఏపీ ఎన్జీవోలు చర్చలు జరగనున్నాయి అన్నారు. శాంతియుతంగా జరుగుతున్న ఉద్యమం రెండు రోజులుగా ఉద్రిక్తంగా మారిందని, అసాంఘిక శక్తులు ఉద్యమంలోకి ప్రవేశిస్తున్నాయని ఆయన అన్నారు.
రాష్ట విభజనపై అసెంబ్లీకి తీర్మానాం వస్తే సీఎం నేతృత్వంలో తిరస్కరించాలని నిర్ణయించామని మంత్రి ఆనం తెలిపారు. రాజమండ్రి, విజయనగరంలలో జరుగుతున్న ఘటనలు దురదృష్టకరమని, ఒక వ్యక్తిని టార్గెట్ చేయడాన్ని ఖండిస్తున్నట్లు ఆయన చెప్పారు. విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కించాలని విద్యుత్ ఉద్యోగులను కోరామని అన్నారు. ఆర్టీసీ సమ్మె వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, తిరుమల బ్రహ్మోత్సవాలకు ఆటంకం కలుగుతోందని మంత్రి అన్నారు. సమ్మెపై పునరాలోచించాలని ఉద్యోగులను కోరినట్లు మంత్రి ఆనం పేర్కొన్నారు.
- See more at: http://www.andhrajyothy.com/node/8268#sthash.WRS8UIPv.dpuf

No comments:

Post a Comment