లగడపాటి సీమలో 'దగ్గుబాటి' దౌత్యం
బెజవాడలో పురందేశ్వరి కీలక మంతనాలు
జేఏసీల నేతలు, పలు వర్గాల ప్రతినిధులతో భేటీ
విభజన అనివార్యమైతే ఏం చేయాలని చర్చ
సమైక్యంగా ఉండాల్సిందేనన్న మెజారిటీ నేతలు
సీమాంధ్రలో అభివృద్ధి ఎక్కడని ప్రశ్న
రోడ్‌మ్యాప్ ఇచ్చి చర్చకు పెట్టాలని డిమాండ్
పురందేశ్వరి తీరును తప్పుబట్టిన ఉద్యోగులు
లగడపాటి వర్గీయులు, టీడీపీ మండిపాటు
జేఏసీల నేతలు, పలు వర్గాల ప్రతినిధులతో భేటీ
విభజన అనివార్యమైతే ఏం చేయాలని చర్చ
సమైక్యంగా ఉండాల్సిందేనన్న మెజారిటీ నేతలు
సీమాంధ్రలో అభివృద్ధి ఎక్కడని ప్రశ్న
రోడ్‌మ్యాప్ ఇచ్చి చర్చకు పెట్టాలని డిమాండ్
పురందేశ్వరి తీరును తప్పుబట్టిన ఉద్యోగులు
లగడపాటి వర్గీయులు, టీడీపీ మండిపాటు
విజయవాడ, అక్టోబర్ 16: సీమాంధ్ర వర్గాలతో దగ్గుబాటి దంపతులు చేపట్టిన రహస్య దౌత్యం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి, ఆమె భర్త వెంకటేశ్వరరావు బుధవారం విజయవాడ నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా ఇక్కడి ప్రముఖ హోటల్‌లో వారు ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటున్న పలు జేఏసీల ప్రతిని«ధులు, పురప్రముఖులు ఇందులో పాల్గొన్నారు. పలువురు వ్యాపార వేత్తలు, వైద్యులు, కాంట్రాక్టర్లు, ఇతర సంఘాల నేతలు కూడా దీనికి హాజరయ్యారు. ప్రధానంగా విభజన అనివార్యమైతే సీమాంధ్ర ప్రయోజనాల కోసం ఏమేం కోరాలన్న అంశంపైనా, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి రోడ్ మ్యాప్ రూపొందించేందుకు అవసరమైన సూచనలపైనా ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. సమావేశానికి హాజరైన ప్రతినిధులలో కొందరు విభజన విషయంలో కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుపై గట్టిగా మాట్లాడారు. రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోను సమైక్యంగా ఉంచాల్సిందేనని, సీమాంధ్రలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, విభజిస్తే కష్టాలు తప్పవని తేల్చి చె ప్పారు. సీమాంధ్రులకు ఏం కావాలో ఇక్కడి ప్రజలను అడిగి తెలుసుకున్నారా? అని ప్రశ్నించినట్లు తెలిసింది. విడిపోతే ఒనగూరే ప్రయోజనాల గురించి ఒక్క మాటైనా చెప్పలేదని, అసలు రోడ్‌మ్యాప్ అంటూ లేకుండా, ప్రజలతో చర్చించకుండా విభజనను చేపట్టారని పలువురు ఆవేదన వ్యక్తంచేశారు. సీమాంధ్ర ప్రాంతంలో ప్రభుత్వ రంగంలో ఒక్క సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కూడా లేదని వైద్యులు ప్రస్తావించారు. నీటి సమస్యలకు పరిష్కారం చూపాకే విభజన జరగాలని, శ్రీశైలం బ్యాక్ వాటర్, నదీ జలాల వివాదాలను పరిష్కరించకుండా ఎలా విభజిస్తారని మరికొందరు ప్రశ్నించారు. అయితే అన్ని సమస్యలను పరిగణనలోకి తీసుకుంటామని, మంత్రులంతా వారి వారి పరిధిలో పనిచేస్తున్నారని, అందరం మూకుమ్మడిగా ఓ నిర్ణయాన్ని తీసుకుని, జీవోఎం దృష్టికి తీసుకు వెళతామని ఈ సందర్భంగా పురందేశ్వరి వివరణ ఇచ్చారు. తమకు తెలియకుండా కేబినెట్ నోట్‌ని తీసుకువచ్చారని ఆమె తెలిపారు. దీనిపై స్పందించే తాము రాజీనామాలు చేశామని, అయితే పదవిలో ఉంటేనే అన్ని సమస్యలపైనా కేంద్రంతో మాట్లాడటానికి వీలుంటుందని చెప్పారు. సమైక్యంగా ఉండే వీలు లేకపోతే, విడిపోతే తీసుకోవాల్సిన చర్యలు, సీమాంధ్ర ప్రయోజనాలను కాపాడే విషయంలో తాము గట్టిగా నిలబడతామని పేర్కొన్నారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికే అందుబాటులో ఉన్నవారితో సమావేశం నిర్వహించామని చెప్పారు. సమావేశంలో తెలుసుకున్న అంశాల సారాంశాన్ని మంత్రుల బృందం దృష్టికి తీసుకు వెళతామని చెప్పారు. విభజన బిల్లు పెట్టే ముందు సీమాంధ్రులకు రోడ్ మ్యాప్ ప్రకటించి, సమస్యలు పరిష్కరించిన తర్వాతే ముందుకు వెళ్లాలని సూచిస్తామన్నారు. తామంతా కేంద్రంలో ఉండడం వల్లే ఏదైనా అడిగేందుకు వీలుంటుందని చెప్పారు. కాగా, ఈ సమావేశ నిర్వహణలో దగ్గుబాటి దంపతుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లగడపాటి ప్రాతినిధ్యం వహిస్తున్న విజయవాడలో ఈ భేటీ జరపడం, పైగా విభజన అనివార్యమైతే సీమాంధ్ర హక్కుల కోసం ఏం కోరాలనే విషయమై చర్చించడం వివాదాస్పదమైంది. ఢిల్లీలో కూర్చుని విభజన ప్రక్రియ చేస్తున్న మంత్రుల బృందానికి సీమాం«ధలో ఉన్న డిమాండ్లు తెలియజేయడానికే ఈ సమావేశం ఏర్పాటు చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించిన పురందేశ్వరి ఏ హోదాలో ఈ సమావేశం నిర్వహించారని ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆమె కేంద్రం తరఫున ఇక్కడ లాబీయింగ్ చేస్తున్నట్లు కనిపిస్తోందని వారు విమర్శిస్తున్నారు. ఓవైపు ఉద్యోగులు ఆందోళన చేస్తుంటే, అభివృద్ధి వికేంద్రీకరణ గురించి సమావేశాలు నిర్వహించడం ఏమిటని టీడీపీ నేతలు ప్రశ్నించారు. ఇటు లగడపాటి వర్గీయులు కూడా దీనిపై మండిపడుతున్నారు.
ప్రధానికిచ్చిన బ్లూ ప్రింట్ బయటపెట్టాలి : దేవినేని
హైదరాబాద్, అక్టోబర్ 17 : ముఖ్యమంత్రి పదవి కోసమే పురంధేశ్వరి విభజన రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ నేత దేవినేని ఉమా ఆరోపించారు. ప్రధానికిచ్చిన బ్లూప్రింట్‌ను పురంధేశ్వరి బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఉద్యోగం కోసం...తమ పిల్లల ఉద్యోగాలు పోగొడతారా అని మండిపడ్డారు. సీఎం పదవి కోసమే పురంధేశ్వరి కొత్త స్వరం వినిపిస్తున్నారని, దగ్గుబాటి దంపతుల మాటలు నమ్మేందుకు సీమాంధ్ర ప్రజలు సిద్ధంగా లేరని ఉమా అన్నారు. దగ్గుబాటి దంపతులు శకుని పాత్ర పోషిస్తున్నారన్నారు.
కాంగ్రెస్ ఎంపీలు దద్దమ్మలని, రాష్ట్రాన్ని నాశనం చేశారని ఉమా వ్యాఖ్యానించారు. రాజీనామాల విషయంలో ఎంపీ లగడపాటి డ్రామాలు కట్టిపెట్టాలన్నారు. ఉద్యోగ సంఘాలపై ఒత్తిడి తెచ్చి సమ్మె విరమింపజేయాలని సీఎం కిరణ్ కుట్ర పన్నారని, సోనియా డైరెక్షన్‌లోనే సీఎం పనిచేస్తున్నారని ఆరోపించారు. డీసెంబర్ 9 నాటికి విభజన ప్రక్రియ పూర్తి చేసి సోనియా బర్త్‌డే కానుకగా ఇవ్వాలని చూస్తున్నారని ఆయన అన్నారు. నవంబర్‌లో కొత్తపార్టీ ముసుగులో కిరణ్ ప్రజల ముందుకొస్తారని దేవినేని ఉమా పేర్కొన్నారు
దగ్గుబాటి కుటుంబం సీమాంధ్రుల మనోభావాలను దెబ్బతీస్తోంది : మోదుగుల
గుంటూరు, అక్టోబర్ 17 : విభజన విషయంలో పురంధేశ్వరి వ్యాఖ్యలపై టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాజ్యసభ సీటుకు కక్కుర్తిపడి దగ్గుబాటి కుటుంబం సీమాం«ద్రుల మనోభావాలను దెబ్బతీస్తోందని విమర్శించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం విడిపోతే ప్రభుత్వ కార్యాలయాలకు టోల్‌ప్లేట్లు పెడతారని ఆయన అన్నారు. సమైక్య రాష్ట్రం కోసం శీతాకాల సమావేశాల్లో పల్నాటి పౌరుషం చూపుతామని ఎంపీ మోదుగుల వెల్లడించారు.
No comments:
Post a Comment