విభజనపై కాంగ్రెస్ విధానం అభ్యంతరకరం : చంద్రబాబు
న్యూఢిల్లీ, అక్టోబర్ 13 : తెలుగు ప్రజల మధ్య విద్వేషం రగిలించిన కాంగ్రెస్ తీరుకు నిరసనగా నిరవధిక నిరాహార దీక్ష చేశానని, రాష్ట్రం అన్ని రంగాల్లో నాశనమైపోయిందని, విభజనపై కాంగ్రెస్ విధానం అభ్యంతరకరమని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ శుక్రవారం పోలీసులు తన దీక్షను భగ్నం చేసి ఆస్పత్రికి తరలించారని, ఆస్పత్రిలో కూడా తన దీక్ష కొనసాగించానని ఆయన తెలిపారు. దీక్ష కొనసాగిస్తే ఆరోగ్యానికి ప్రమాదమని డాక్టరు చెబుతూ, బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించారని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
ప్రజలు, నేతలతో సంప్రదించకుండా రాజకీయ లబ్ధికోసం కాంగ్రెస్ పార్టీ ఇష్టం వచ్చినట్లు విభజన నిర్ణయం తీసుకుందని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. టీఆర్ఎస్, వైసీపీ పార్టీలతో కుమ్మక్కయై, ఆ రెండు పార్టీలు కాంగ్రెస్‌లో విలీనం అవుతాయని ధీమాతో ఈ నిర్ణయం తీసుకుందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాజకీయ పార్టీల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని బాబు ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌ను అందరం అభివృద్ధి చేశామని. సాగునీరు, ఉద్యోగాలు, విద్య, హైదరాబాద్‌పై సీమాంధ్రుల్లో భయాందోళనలు నెలకొన్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. ఈవన్నీ ఆలోచించకుండా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకందని ఆమర విమర్శించారు. అందుకే సీమాంధ్రలో రాజకీయాలకు అతీతంగా ప్రజా ఉద్యమం జరుగుతున్నదని ఆయన అన్నారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే, రాష్ట్ర వ్యవహరాల ఇన్చార్జ్ గులాంనబీ అజాద్‌లు రోజుకో విధంగా ప్రకటనలు చేస్తున్నారని, దీంతో సీమాం«ద్రుల్లో భయాందోళనలు నెలకొన్నాయని ఆయన అన్నారు.
కాంగ్రెస్, వైసీపీ, టీఆర్ఎస్ పార్టీలు కలిసి రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేశాయని చంద్రబాబు విమర్శించారు. విభజన అనేది జాతీయ సమస్య అని, పరిష్కారం చూపాలని అన్ని జాతీయ పార్టీలను కోరామని ఆయన అన్నారు. ఈ విషయమై కాంగ్రెస్‌పై ఒత్తిడి తేచ్చేందుకు తాను దీక్ష చేపట్టానని బాబు స్పష్టం చేశారు. రెండు ప్రాంతాలకు సమన్యాయం జరగాలని, సమ న్యాయం చేసిన తర్వాతే విభజనపై ముందుకు వెళ్లాలని, న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తన దీక్షకు సంఘీభావం తెలిపిన వారందరికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం చంద్రబాబు హైదరాబాద్‌కు బయలుదేరారు
No comments:
Post a Comment