Wednesday, 2 October 2013

భేరి మోగినా.. అపశ్రుతుల మోతే!

భేరి మోగినా.. అపశ్రుతుల మోతే!

Published at: 02-10-2013 07:14 AM

 New  0  0 

 



జేఏసీ ముఖ్యుల పోస్టుమార్టం
సదస్సు సక్సెస్.. కానీ పొరపాట్లు జరిగాయి
వైద్య, టీచర్ జేఏసీలకూ అవకాశం ఇవ్వలేదు
సమావేశం నిర్ధారణ
హైదరాబాద్, అక్టోబర్ 1 : హైదరాబాద్ నిజాం మైదానంలో సెప్టెంబర్ 29న నిర్వహించిన సకల జన భేరి సదస్సుపై తెలంగాణ జేఏసీ భాగస్వామ్యపక్షాల ముఖ్యులు పోస్టుమార్టమ్ జరిపారు. జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం అధ్యక్షతన సమావేశమైన వారు..సదస్సు అనుకున్న రీతిన విజయవంతమైనా కొన్ని పొరపాట్లు జరిగినట్లు గుర్తించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం..వేదిక నుంచి ఒకరిద్దరు విద్యార్థి నేతలతో పాటు, వైద్యుల జేఏసీ, ఉపాధ్యాయ సంఘాల బాధ్యులతోనూ మాట్లాడించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవటంపై జేఏసీ భాగస్వామ్య టీఆర్‌టీయూ అధ్యక్షుడు మణిపాల్‌రెడ్డి ఈ సందర్భంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అయితే వేదిక నిర్వహణలో కొంత సమన్వయ లోపం జరిగిందని, మాట్లాడే వారి పేర్లను విద్యార్థి నేతలు ఇవ్వకపోవటం కూడా అందుకు ఒక కారణమని విశ్లేషించారు.
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగం, సమయాభావం వల్ల కొందరికి మాట్లాడే అవకాశం దక్కలేదని భావించారు. అయితే సదస్సు ద్వారా ప్రజల్లోకి మంచి సంకేతాన్ని తీసుకెళ్లామని, పార్లమెంటులో తక్షణం హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు పెట్టాలనే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేగలిగామనే సంతృప్తిని వ్యక్తంచేశారు. జేఏసీ కో-చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్‌కు, విద్యార్థి నేతలకు మధ్య తలెత్తిన వివాద పరిష్కారం కోసం జోక్యం చేసుకోవాలని నేతలు నిర్ణయించారు. సమావేశం చివర్లో అక్కడికి వచ్చిన టీఆర్ఎస్ఎల్పీ నేత ఈటెల రాజేందర్ వివాద పరిష్కార బాధ్యతను స్వీకరించారు. కాగా, భేరి ముగిసిన రాత్రి శ్రీనివాస్‌గౌడ్ క్యాంపస్‌కు వెళ్లటాన్ని జేఏసీ ముఖ్యులు తప్పుపట్టారు.
- See more at: http://www.andhrajyothy.com/node/5945#sthash.hZFp5vfn.dpuf


వాడుకుని వదిలేస్తారా?

Published at: 02-10-2013 07:13 AM

 1  0  1 

 



'భేరి' ముందు భేటీలు వేశారు
వేదికపై మాత్రం కాని వారిమయ్యాం
ఈటెల వద్ద పిడమర్తి ఆవేదన
హైదరాబాద్, అక్టోబర్ 1 : విద్యార్థి నేతలకు, జేఏసీ నేత శ్రీనివాస్‌గౌడ్‌కు మధ్య తలెత్తిన వివాదం తెలంగాణ వాదుల్లో చర్చనీయాంశమైంది. దీంతో అసలు ఏం జరిగిందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. 'ఆంధ్రజ్యోతి'కి వివిధ వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం..సకల జన భేరి వేదిక నుంచి ఐదారుగురు విద్యార్థి నేతలను మాట్లాడించాలని తొలుత తెలంగాణ జేఏసీ నిర్ణయించినట్టు తెలిసింది. ఆ మేరకు పేర్లు ఇవ్వాలని ముందే కోరామని, వేదిక మీద నుంచీ అడిగామని, అయితే 'నేను మాట్లాడతాను అంటే నేను మాట్లాడతాను' అని అనడం తప్ప ఎవరూ ముందుకు రాలేదని జేఏసీ వర్గాలు చెబుతున్నాయి. దీనికితోడు సమయాభావం, ఇతరత్రా కారణాల వల్ల మాట్లాడే అవకాశం ఇవ్వలేకపోయామని వివరిస్తున్నాయి. కేసీఆర్ ప్రసంగం తర్వాత 'భేరి' ముగిసి, అంతా తిరుగుముఖం పడుతున్న నేపథ్యంలో విద్యార్థి నేత పిడమర్తి రవి ఆధ్వర్యంలో పలువురు వేదిక వద్ద కోదండరాంను కలిశారు.
'మమ్మల్ని ఎందుకు మాట్లాడనివ్వలేద'ని అడుగుతుండగా.. పక్కనే ఉన్న శ్రీనివాస్‌గౌడ్ జోక్యం చేసుకున్నారని కొంతమంది విద్యార్థి నేతలు చెబుతున్నారు. దీంతో 'మేం కోదండరాంతో మాట్లాడుతుంటే, మధ్యలోకి మీరెందుకు వచ్చారు'' అని గౌడ్‌పై పిడమర్తి తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారని వీరు అంటున్నారు. వాగ్వాదం ముదురుతుండగా.. జేఏ సీ నేతలు కలగజేసుకొని ఎటు వాళ్లని అటు పంపించి వేసినట్టు చెబుతున్నారు. ఆ తరువాత ఏమి జరిగిందనే దానిపై శ్రీనివాస్‌గౌడ్ అనుచరుల వాదన, విద్యార్థి నే తల కథనం భిన్నంగా ఉన్నాయి. శ్రీనివాస్‌గౌడ్ వర్గం వాదన ప్రకారం.. కోదండరాం, శ్రీనివాస్‌గౌడ్ సెల్‌ఫోన్లకు వేర్వేరు నంబర్ల నుంచి పలువురు విద్యార్థులు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడారు. 'ఓయూ కేంపస్‌లోని ఆ ర్ట్స్ కాలేజీ వద్దకు రండి..చూసుకుందా''మంటూ సవాల్ చేశారు. దీంతో ఆవేశానికి లోనైన శ్రీనివాస్‌గౌడ్ అదే రాత్రి తన అనుచరులతో ఆర్ట్స్ కాలేజీ వద్దకు వెళ్లారు. కానీ ఎవరూ అక్కడికి రాలేదు.
అయితే, శ్రీనివాస్‌గౌడ్ ఆర్డ్స్ కాలేజీలో వీరంగం చేశారని పిడమర్తి రవి బృందం చెబుతోంది. వీరి కథనం ప్రకారం.. సదస్సు ముగిసిన వెంటనే వర్సిటీలోకి దూసుకొచ్చారు. ఆ సమయంలో ఆ యన చేతిలో ఉన్న తుపాకీతో విద్యార్థిలను బెదిరించా రు. ఇదే ఫిర్యాదును వారు ఆ మరుసటి రోజు ఓయూ పోలీస్‌స్టేషన్‌లో నమోదు చేశారు. అయితే..'తుపాకి' వాదనను గౌడ్ అనుచరులు తీవ్రంగా ఖండిస్తున్నారు. తమకు వచ్చిన ఫోన్ కాల్స్ నంబర్లు..ఎవరు..ఎక్కడి నుంచి చేశారనే దానిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్టు వారు చెబుతున్నారు. పిడమర్తి రవి ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులు తెలంగాణ భవన్‌కు వచ్చి ఈటెల రాజేందర్‌ను కలిశారు. "తెలంగాణ ఉద్యమంలో మమ్మల్ని వా డుకొని వదిలేస్తారా ? భవిష్యత్తులో మా పరిస్థితి ఏమిటి ?'' అని పిడమర్తి రవి ఆందోళన వ్యక్తం చేశారు. నిన్నమొన్నటి వ రకు తమతోపాటు ఉన్న రాజారాం యాదవ్ రాజకీయం గా సక్సెస్ అయ్యారని, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును కలిసి టికెట్ ఖరారు చేసుకున్నారని నిష్ఠూరాలాడగా.. అన్నీ సర్దుకుంటాయంటూ ఈటెల సముదాయించారు.
- See more at: http://www.andhrajyothy.com/node/5942#sthash.pAFCsPH0.dpuf

సకల భేరిలో దళితులకు అవమానం

Published at: 02-10-2013 07:12 AM
 New  0  0 
 
 

ఆంధ్రాలో పుట్టినవాళ్లంతా ద్రోహులనడం సరికాదు
కేసీఆర్ వ్యాఖ్యలు ఉద్యమానికి నష్టం
గుంటూరులో సభ జరిపి తీరతాం: మందకృష్ణ
హైదరాబాద్, అక్టోబర్ 1: సకల జన భేరి సభలో మాట్లాడించకుండా దళిత ప్రజా ప్రతినిధులను కేసీఆర్, కోదండరాం అవమానపరిచారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. "కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లోకి వచ్చిన మంద జగన్నాథం, వివేక్, టీడీపీ నుంచి వచ్చిన కడియం శ్రీహరిలను మాట్లాడించకపోవడం కేసీఆర్, కోదండరాంలకు తగునా!? దళితులకు మీరిచ్చే గౌరవం ఇదేనా?'' అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఓయూ, కేయూ విద్యార్థి నాయకులను మాట్లాడనివ్వకపోవడం బాధాకరమన్నారు. ఆంధ్రాలో పుట్టిన వాళ్లంతా తెలంగాణ ద్రోహులంటూ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
కేసీఆర్ వ్యాఖ్యలు ఉద్యమానికి నష్టం కలిగించేలా ఉన్నాయి'' అని మండిపడ్డారు.
ఈనెల 6న గుంటూరులో తలపెట్టిన అంబేద్కర్‌వాదుల సభను ఎన్ని అడ్డంకులు ఎదురైనా జరిపి తీరతామన్నారు. ఐదారు తేదీల్లో సమైక్యవాదులు గుంటూరులో ప్రైవేట్ ట్రావెల్స్, పెట్రోలు బంకుల బంద్‌కు పిలుపునిచ్చారని, ఏపీఎన్జీవోలతో కుమ్మక్కై గుంటూరు సభకు సీఎం అడ్డంకులు కల్పిస్తున్నారని ఆరోపించారు. తమ కులస్తుడైన ఇన్‌చార్జి డీజీపీ ప్రసాదరావు గుంటూరు సభకు అనుమతి ఇస్తారని కొద్దిగా నమ్మకం ఉందని, బుధవారం ఆయనను కలిసి అభినందించి, సభకు అనుమతి కోరతామని తెలిపారు. అనుమతి ఇవ్వకపోతే కోర్టుకు వెళతామన్నారు.
- See more at: http://www.andhrajyothy.com/node/5939#sthash.ibNOBBgP.dpuf


No comments:

Post a Comment