అక్కినేనికి కేన్సర్
రెండు రికార్డులు బద్దలు కొట్టా
దీన్నీ జయిస్తా..తుది దాకా నటిస్తా
ప్రజల ఆశీస్సులతో సెంచరీ కొడతా
నన్ను ఎవరూ పరామర్శించవద్దు
అభిమానులూ.. బాధపడొద్దు.. నన్ను బాధపెట్టొద్దు :ఏఎన్ఆర్
దీన్నీ జయిస్తా..తుది దాకా నటిస్తా
ప్రజల ఆశీస్సులతో సెంచరీ కొడతా
నన్ను ఎవరూ పరామర్శించవద్దు
అభిమానులూ.. బాధపడొద్దు.. నన్ను బాధపెట్టొద్దు :ఏఎన్ఆర్
కేన్సర్ రోగిగా నటించి మెప్పించిన నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావును నిజ జీవితంలోనూ అదే మహమ్మారి పట్టుకుంది! తొమ్మిది పదుల వయసులో ఆయన కేన్సర్ బారిన పడ్డారు! ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు! అయితే, తనను ఎవరూ పరామర్శించవద్దని, ఎవరూ బాధ పడవద్దు.. తనను బాధ పెట్టవద్దని అభిమానులకు పిలుపునిచ్చారు!
నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుకు కేన్సర్! ప్రేమాభిషేకం సినిమాలో ఏఎన్ఆర్ గురించి చెప్పడం లేదు! ఆయనకు నిజంగానే నిజ జీవితంలోనే కేన్సర్ వ్యాధి వచ్చింది! ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించారు. అయినా.. ఇప్పటికే రెండు రికార్డులు బద్దలు కొట్టిన తాను.. మూడో రికార్డునూ అధిగమిస్తానని, కేన్సర్‌ను జయిస్తానని భరోసా వ్యక్తం చేశారు. ఈ వయసులో కేన్సర్ వచ్చినందుకు తాను బాధ పడడం లేదని.. ఎవరూ స్వయంగా వచ్చి పరామర్శించవద్దని, అభిమానులంతా ఆశీర్వదించాలని కోరారు. వారి ఆశీర్వాదబలంతో నూరేళ్లూ బతుకుతానని ధీమా వ్యక్తం చేశారు. అక్కినేని శనివారం ప్రత్యేకంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన ఏమన్నారంటే..
"నాకు ఇప్పుడు 90 ఏళ్లు. ఈమ«ధ్యే పుట్టిన రోజు వేడుకలను నిర్వహించుకున్నాను. ఆ వేడుకలకు హాజరైన వారు 100, 116, 124 ఏళ్లు బతకమని ఎవరికి తోచిన విధంగా వారు ఆశీర్వదించారు. నాకు తెలిసి మా ఇంట్లో మా అమ్మ నా కళ్ల ముందు 96 ఏళ్లు బతికింది. నేను కూడా గ్యారెంటీగా 96 ఏళ్లు బతుకుతానని అనుకున్నాను. అభిమానుల ఆశీర్వాద బలం ఉంటే సెంచరీ కూడా కొడతానని అనుకున్నా. ప్రేక్షకుల ఆశీర్వాద బలంతో, మనో నిబ్బరంతో అన్నిటినీ అధిగమించి అనుకున్నన్నాళ్లు ఉంటాను. ఇప్పటికే నేను రెండు రికార్డులను అధిగమించాను. ఇప్పుడు మూడో రికార్డును కూడా అధిగమిస్తాననే నమ్ముతున్నాను. 1940లో 'ధర్మపత్ని' సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాను. ఆ తర్వాత చాలా వేషాలు వేశాను. ఓరోజు బెజవాడలో ఘంటసాల బలరామయ్యగారు నన్ను చూశారు. రాముడి వేషం ఇచ్చారు. అందుకు ఆయనకు ఇప్పుడు ధన్యవాదాలు చెబుతున్నాను. ఎన్నో రకాల మనస్తత్వాలున్న పాత్రలు చేశాను. 74 ఏళ్ల నా నటనా జీవితంలో ఎన్నో పేరు ప్రతిష్ఠలు తెచ్చిన పాత్రల్ని చేశాను. మా కుటుంబం సినిమా పరిశ్రమలో కళకళలాడుతూ ఉంది.
ఈ 74 ఏళ్ల నటనా జీవితంలో ఎన్నో అవార్డులు అందుకున్నాను. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్, దాదా సాహెబ్, రఘుపతి వెంకయ్య అవార్డు, టీఎస్సార్ నేషనల్ అవార్డు, అన్నాదురై, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం అందుకున్నాను. తమిళంలో 26 సినిమాలు చేశాను. అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా, కువైట్, సింగపూర్, దుబాయ్‌ల్లో లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులను అందుకున్నాను. ఇంత పేరును, ఇన్ని అవార్డులను నేను కలలో కూడా ఊహించలేదు. ఇక, 1984లో నాకు హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు మా కుటుంబం అంతా చాలా బాధపడింది. పిల్లలు ఫీలయ్యారు. కానీ నా మనోబలం, అభిమానుల ఆశీర్వాదంతో బయటపడ్డాను. మొన్న అక్టోబర్ 8న నాకు కడుపులో నొప్పిగా అనిపించింది. కేర్, నిమ్స్‌లో చూపించాం. ఎండోస్కోపీ, కొలనోస్కోపీ చేశారు. కేన్సర్ వచ్చిందని తేల్చారు. నా వయసు వాళ్లలో కేన్సర్ కణాలు వేగంగా పెరగవని కూడా డాక్టర్లు చెప్పారు. ఈసారి కూడా ప్రేక్షకుల ఆశీర్వాద బలంతో గట్టెక్కుతాననే నమ్మకం ఉంది. ఈ విషయం ఆనోటా ఈనోటా కొంతమందికి తెలిసింది. ఈ మధ్య సుస్థీ చేసిందట కదా అని పరోక్షంగా నన్ను అడుగుతున్నారు. అందుకే, మా కుటుంబం అంతా కలిసి కూర్చుని చర్చించుకున్నాం. ఈ విషయాన్ని నేరుగా చెప్పేయడమే మంచిదని నిర్ణయానికి వచ్చాం. అందుకే ఈ ప్రెస్‌మీట్. అబద్ధం చెప్పడానికి తెలివి తేటలు కావాలి. నిజం చెప్పడానికి ధైర్యం కావాలి. నాకు అభిమానులు ధైర్యాన్ని ఇచ్చారు. బంధువులు, శ్రేయోభిలాషులు, అభిమానులు నన్ను కలిసి, నాకు కేన్సర్ వచ్చిన విషయాన్ని పదే పదే గుర్తు చేయవద్దని కోరుతున్నాను. ఒకవేళ నేను చెప్పకపోయినా తెలుసుకుని ఇంటికి వస్తున్నారు. అలా రావద్దని విన్నవించుకుంటున్నాను. ఇంటికి రావద్దని, ఈ విషయమై ఫోన్లు చేయవద్దని, నేను మనో నిబ్బరంతోనే ఉన్నానని చెప్పడానికే ఈ ప్రెస్‌మీట్ పెట్టాను. మీరు బాధ పడవద్దు. నన్ను బాధ పెట్టవద్దు'' అని తెలిపారు.
సెంచరీ కొడతా
నాకు తెలిసి మా ఇంట్లో మా అమ్మ నా కళ్ల ముందు 96 ఏళ్లు బతికింది. నేను కూడా గ్యారెంటీగా 96 ఏళ్లు బతుకుతానని అనుకున్నాను. అభిమానుల ఆశీర్వాద బలం ఉంటే సెంచరీ కూడా కొడతానని అనుకున్నా. ప్రేక్షకుల ఆశీర్వాద బలంతో, మనో నిబ్బరంతో అన్నిటినీ అధిగమించి అనుకున్నన్నాళ్లు ఉంటాను.

నన్ను బాధ పెట్టొద్దు
బంధువులు, శ్రేయోభిలాషులు, అభిమానులు నన్ను కలిసి, నాకు కేన్సర్ వచ్చిన విషయాన్ని పదే పదే గుర్తు చేయవద్దని కోరుతున్నాను. ఒకవేళ నేను చెప్పకపోయినా తెలుసుకుని ఇంటికి వస్తున్నారు. అలా రావద్దని విన్నవించుకుంటున్నాను. ఇంటికి రావద్దని, ఈ విషయమై ఫోన్లు చేయవద్దని, నేను మనో నిబ్బరంతోనే ఉన్నానని చెప్పడానికే ఈ ప్రెస్‌మీట్ పెట్టాను. మీరు బాధ పడవద్దు. నన్ను బాధ పెట్టవద్దు''
రెండుసార్లు ఆత్మహత్య చేసుకోవాలని..
గతంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న సందర్భాలను అక్కినేని వివరించారు. "పెళ్లి కాకముందు రెండుసార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. నా పెళ్లి కన్నా ముందు నా గురించి ఏవేవో అనుకునేవారు. వాటితో మనస్తాపం చెంది ఓసారి మద్రాసు శాంతోం బీచ్‌లో నీళ్లలో దిగాను. మోకాళ్ల లోతు నీళ్లు వచ్చే సరికి భయం వేసింది. వెనక్కి వచ్చేశాను. ఆ తర్వాత మరోసారి కూడా అలాగే వెళ్లాను. అప్పుడు చీలమండ లోతు నీళ్లలోకి దిగి వెనక్కి వచ్చాను. బతికి సాధించాలని అనిపించింది. చచ్చి సాధించేదేమీ లేదు. చచ్చినా కలకాలం బతికుండాలి. అదే నా సిద్ధాంతం. అందుకే నేను ఇప్పటికీ నటిస్తూనే ఉన్నాను. ఇప్పుడు 'మనం'లో నటిస్తున్నా. భవిష్యత్తులోనూ నటిస్తాను. అలాగని ప్రతి పాత్రా చేయాలని లేదు. అలా చేస్తే డబ్బు కోసం కక్కుర్తి పడ్డానని అందరూ అంటారు. కేవలం మంచి పాత్రలు మాత్రమే చేయాలనుకుంటున్నాను. నా తుది శ్వాస వరకు నటిస్తూనే ఉంటాను'' అని చెప్పారు.
- ఆంధ్రజ్యోతి, హైదరాబాద్

No comments:
Post a Comment