కమలం కలవాలంటోంది!
'పొత్తు'పై మైనారిటీ నేతలతో బాబు చర్చ
హైదరాబాద్, అక్టోబర్ 1 : బీజేపీతో రాజకీయ సంబంధాలు నెలకొల్పుకొంటే దాని ప్రభావం ఎలా ఉంటుందన్న అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీలోని మైనారిటీ నేతల అభిప్రాయాలు తెలుసుకొంటున్నారు. ఇప్పటికే ఖమ్మం జిల్లా నేతల వద్ద పొత్తుల ప్రస్తావన చేసిన ఆయన.. రెండు రోజుల క్రితం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, హైదరాబాద్ పాత బస్తీకి చెందిన ముస్లిం మైనారిటీ ప్రముఖుడు జాహెద్ అలీఖాన్‌ను పిలిపించుకున్నారు. పాతబస్తీలో ఉన్నందువల్ల ఆయనపై 'పొత్తుల' ప్రభావం ఎక్కువ ఉండే అవకాశం ఉండటంతో చంద్రబాబు ముందుగా ఆయనను పిలిచి మాట్లాడినట్లు చెబుతున్నారు.
వాజ్‌పేయిని ముస్లిం మైనారిటీలు కొంత లౌకికవాదిగా చూసినా ఆడ్వాణీ, మోదీల విషయంలో వారికి భయాలు ఎక్కువగా ఉన్నాయని, మోదీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినందువల్ల ఆ పార్టీతో కలిస్తే మైనారిటీలు దూరం అవుతారని జాహెద్ అన్నట్టు సమాచారం. అయితే.. ఇంకా ఏమీ తేల్చుకోలేదని, అందరి అభిప్రాయాలు తెలుసుకొన్న తర్వాతే నిర్ణయానికి వస్తామని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం.
No comments:
Post a Comment