Wednesday 2 October 2013

కేసీఆర్‌పై భగ్గుమన్న సీమాంద్రులు

కేసీఆర్‌పై భగ్గుమన్న సీమాంద్రులు

Published at: 01-10-2013 07:28 AM
 New  0  0 
 
 

ఆయనే ఓ పెద్ద సమైక్యవాది: ఏరాసు
కేసీఆర్ నీ కెంత ప్యాకేజీ కావాలి?: అడుసుమిల్లి
హైదరాబాద్, సెప్టెంబర్ 30 : ఆంధ్రావాళ్లంతా తెలంగాణ ద్రోహులే. అక్కడ మేధావి అనేటోడే లేడా... అంటూ ఆదివారం నాటి సకల జన భేరిలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీమాంధ్ర నేతలు, ప్రజలు, ప్రవాసాం«ద్రులు భగ్గుమన్నారు. ఆం«ద్రుల గొప్పదనాన్ని, తన పూర్వీకుల చరిత్రను తెలుసుకుని మాట్లాడాలని హె చ్చరించారు. అసలు టీఆర్ఎస్ అధినేత కేసీఆరే నిజంగా ఓ పెద్ద సమైక్యవాదని, అందువల్లే సభలు ఏర్పాటుచేసి మరీ సమైక్యాంధ్ర ఉద్యమకారులను రెచ్చగొడుతున్నారని న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శ్రీవారి దర్శనార్థం తిరుమల వచ్చిన ఆయన సోమవారం 'ఏబీఎన్-ఆంధ్రజ్యోతి'తో మాట్లాడారు. రాష్ట్ర విభజనకు అనుకూల ప్రకటన వచ్చిన రోజున కేసీఆర్ మొహంలో నెత్తురుచుక్క కనబడలేదని, ఇంత త్వరగా ఎందుకు ప్రకటన చేశారా? అని లోలోపల కుమిలిపోతున్నారన్నారు. కేసీఆర్ కారుకూతలు మానుకోవాలని 20 సూత్రాల పథకం అమలు కమిటీ ఛైర్మన్ ఎన్.తులసిరెడ్డి హెచ్చరించారు.
'నీ పూర్వీకులు విజయనగరం జిల్లా బుడ్డిపేట నుంచి సిద్దిపేటకు వలసవచ్చినవారే. ఆ మాటకొస్తే నువ్వూ ఆంధ్రావాడివే. నువ్వు కూడా తెలంగాణ ద్రోహివేనా?' అని ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన యజ్ఞానికి భీమవరం సిద్ధాంతిని ఎందుకు పిలిపించావని తులసిరెడ్డి నిలదీశారు. తెలంగాణ ప్రజలను దోచుకుంటున్నది, వారికి ద్రోహం చేస్తున్నది కేసీఆరేనని సమైక్యాంధ్ర నాయకుడు అడుసుమిల్లి జయప్రకాశ్ ఆరోపించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటం కోసం ఎంత ప్యాకేజీ కావాలో చెప్పాలని కేసీఆర్‌ను డిమాండ్ చేశారు.తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో సింహపురి బిడ్డ పుచ్చలపల్లి సుందరయ్య పోషించిన కీలక పాత్ర మర్చిపోయావా కేసీఆర్... అంటూ నెల్లూరు జిల్లావాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేవారు. సీమాం«ద్రుల మనోభావాలు దెబ్బతినేలా కేసీఆర్ వ్యాఖ్యలు చేశారంటూ గుంటూరు జిల్లా తెనాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో సమైక్యవాదులు ఫిర్యాదు చేశారు.
- See more at: http://www.andhrajyothy.com/node/5722#sthash.C57LAdrM.dpuf

No comments:

Post a Comment