ఇష్టపూర్వక సంభోగానికి కోర్టు అక్కరలేదు:రేణుక
న్యూఢిల్లీ: పద్దెనిమిదేళ్లు పైబడిన మహిళలు ఇష్టపూర్వకంగా కలయికలో పాల్గొంటే దానికి కోర్టు అనుమతి అవసరం లేదని కాంగ్రెస్ ఎంపీ రేణుకాచౌదరి పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలో మాట్లాడుతూ ఇష్టపూర్వకమైన కలయికకు, అత్యాచారానికి తేడా తెలియకపోవడం బాధాకరమని రేణుక వ్యాఖ్యానించారు. కొందరు మహిళలు ఇష్టపూర్వకంగా కలిసి, అనంతరం తమపై అత్యాచారం జరిగిందని ఆరోపిస్తున్నారని స్థానిక న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలపై రేణుక పైవిధంగా స్పందించారు.
No comments:
Post a Comment