Sunday 6 October 2013

ఆ వర్గాలకే రాజకీయాలా?

ఆ వర్గాలకే రాజకీయాలా?

Published at: 06-10-2013 06:13 AM

 New  0  0 

 



వారే ఏలతారా.. 8,5శాతం వాళ్లే శాశ్వతం కాదు
పదవులు కాదు.. ఏమి చేశామనేది ముఖ్యం
రాజ్యాంగ సంక్షోభం సృష్టిద్దామని చెప్పినా పెడచెవిన పెట్టారు
నేను ఈ స్థాయికి రావడం కంటగింపయింది
మాండ్యాకు వెళ్లారన్న వారిని చెప్పుతో కొట్టాల్సింది
ఉద్యోగుల ఉద్యమంలో విద్రోహ శక్తులు
క్షుద్ర రాజకీయాలకు తావివ్వొద్దు
పీసీసీ చీఫ్ బొత్స ఉద్వేగం
హైదరాబాద్, అక్టోబర్ 5 : "పదవులు ముఖ్యం కాదు... పదవుల్లో ఉన్నప్పుడు ఏమి సాధించామనేది ముఖ్యం. 8 శాతం, 5 శాతం ఉన్న వర్గాలకే ఈ రాష్ట్ర రాజకీయాలు శాశ్వతం కాదు. ఎంత శాతం మంది ఉన్నారనేది ముఖ్యం కాదు. మన చేతిలో అధికారం ఉన్నప్పుడు ప్రజలకు మనమేమి చేశామనేది ముఖ్యం'' అని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. శనివారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఉద్వేగంగా మాట్లాడారు. తాను వెనుకబడిన విజయనగరం జిల్లా నుంచి వచ్చిన బలహీనవర్గాల వ్యక్తిగా చెప్పుకొచ్చారు. మారుమూల ప్రాంతంలో పుట్టి, తాను ఈ స్థాయికి రావడం కొందరికి కంటగింపుగా ఉందని వ్యాఖ్యానించారు. స్వయం ప్రకాశంతో ఉన్న తనకు పదవిని అంటిపెట్టుకోవాలని కూడా లేదని, తన తాత, తండ్రులు పదవులు పొందలేదన్నారు. ప్రజల సహకారంతో, సోనియాగాంధీ చలువతో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడినయ్యానన్నారు. మూడేళ్లుగా ఉద్యమాలు జరుగుతున్న సందర్భంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని, కేబినెట్ నోట్ ఆపుతామని నేతలు కొందరు చెప్పారని, ఇప్పుడేమైందని ప్రశ్నించారు.
జులై 30న సీడబ్ల్యూసీ రాష్ట్ర విభజన ప్రకటన చేసిన తర్వాత, హైకమాండ్ ఏమనుకున్నా అందరం ఢిల్లీ నుంచి గల్లీ వరకు రాజీనామాలు చేసి రాజ్యాంగ సంక్షోభం సృష్టిద్దామన్న తన మాటలు పట్టించుకోలేదన్నారు. అలా చేయకపోతే ఈ ప్రక్రియ ఆగదని ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా తాను సూచిస్తే... తమ వద్ద ఒక విధానముందని, కార్యక్రమముందని చెప్పారన్నారు. పైగా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి మాట్లాడుతున్నానని విమర్శించారన్నారు. వారికి రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉందని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ తమ సొత్తు, రాష్ట్రం విభజించినా, సమైక్యంగా ఉన్నా తామే ఉండాలని, ఈ రాష్ట్రం ఏమైనా పరవాలేదనుకుంటున్న వారి గురించి ప్రజలు ఆలోచించాలన్నారు. ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. మీడియా ప్రజల్లో అంతర్భాగమని, ఇలాంటి క్లిష్ట సమయాల్లో బాధ్యతగా విశ్లేషణ చేసి ఉద్రేకాలను తగ్గించే రీతిలో ప్రసారాలు చేయాలని వాటి యాజమాన్యాలను వేడుకుంటున్నానన్నారు. అసెంబ్లీలో రాష్ట్ర విభజన చేయాలని అశోక్‌గజపతిరాజు ఒత్తిడి చేసిన విషయం విజయనగరం జిల్లాకు చెందిన ప్రజలు గుర్తు చేసుకోవాలన్నారు. ఈ సమయంలో రాజకీయాలు మాట్లాడటం ఇష్టం లేదని, రాష్ట్రాన్ని ఏవిధంగా ఆదుకోవాలి, ప్రజలకు ఏవిధంగా న్యాయం చేయాలి, ఏవిధంగా కలిసి ఉండాలనే విషయం ఆలోచించాలన్నారు. క్షుద్ర రాజకీయాలకు తావివ్వకుం డా సోదరభావంతో ఉండాలని, స్వార్థపరులకు బుద్దిచెప్పాలని పిలుపునిచ్చారు.
ఉద్యమం చేసే వారు హింసకు తావివ్వరాదని, ఉద్యోగులు చేస్తున్న ఉద్యమంలో కొందరు సంఘ విద్రోహ శక్తులు చేరుతున్నారని బొత్స హెచ్చరించారు. ఉద్యోగులు సంయమనంతో, ఒక కార్యాచరణతో ముందుకు పోవాలని కోరారు. పోలీసులను కూడా సంయమనం పాటించాలని కోరామన్నారు. విజయనగరంలో తమ ఇళ్లపై దాడులు జరుగుతున్నాయని, కావాలంటే తమకు చెందిన వాటినన్నింటినీ ఇచ్చేస్తామన్నారు. అనంతరం ఆయన తన ఛాంబర్‌లో పిచ్చాపాటిగా మాట్లాడుతూ తాను మాండ్యాకు వెళ్లారన్న వారిని చెప్పుతో కొట్టాల్సిందన్నారు. ఉద్యమకారులు ఎంపీ బొత్స ఝాన్సీ రాజీనామా కోసం డిమాండ్ చేశారన్న విలేకరుల వ్యాఖ్యలకు... 10 రోజుల నుంచి కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఎలా రాజీనామా చేయగలదన్నారు. దాడులు కొన్ని వర్గాలపైనే జరుగుతున్నాయని, వారు మాత్రం ప్రజాప్రతినిధులు కాదా అని ప్రశ్నించారు. ఈ సందర్భంలో అక్కడ ఉన్న మంత్రి బాలరాజు, ఎమ్మెల్యే కన్నబాబు బొత్సను సమర్థించారు.
అవన్నీ వదంతులే!
విద్యార్థులను బంధించామంటూ దుష్ప్రచారం
హైదరాబాద్, అక్టోబర్ 5 : సమైక్య ఉద్యమంలో పాల్గొంటున్న ఇద్దరు విద్యార్థులను తన సోదరుడు చిన్న శ్రీను బంధించి, హింసించారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని, అవన్నీ వదంతులని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇద్దరు విద్యార్థులను బంధించి, హింసించి చంపేశారంటూ ఎస్ఎమ్ఎస్‌లు, ఫేస్‌బుక్ ద్వారా కొందరు ప్రచారం చేస్తున్నారని... ఈ వార్తలను నమ్మవద్దని బొత్స శనివారం ఒక ప్రకటనలో కోరారు. విద్యార్థులను బంధించడం, హింసించడం అసత్యాలని... కొందరు దురుద్దేశపూర్వకంగానే ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు.

- See more at: http://www.andhrajyothy.com/node/7694#sthash.yej2eIbD.dpuf


విజయనగరం అల్లర్ల వెనుక సీఎం

Published at: 06-10-2013 06:00 AM
 New  0  0 
 
 

ఆయన శవాలమీద పేలాలు ఏరుకునే పనిలో ఉన్నారు
చంద్రబాబూ.. రాత్రికి రాత్రే విభజన జరిగిందా?
జగన్ దొంగ దీక్షకు జూనియర్ ఆర్టిస్టులు: హరీశ్ రావు
హైదరాబాద్, అక్టోబర్ 5 : విజయనగరం అల్లర్ల వెనుక సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హస్తం ఉందని టీఆర్ఎస్ఎల్పీ ఉపనేత టి.హరీశ్‌రావు ఆరోపించారు. సమైక్య ఉద్యమం ముసుగులో ముఠా తగాదాలు, కులాల పంచాయితీలు, పార్టీల మధ్య ఆధిపత్య పోరు అత్యంత హేయంగా.. జుగుప్సాకరంగా సాగుతున్నాయన్నా రు. ఆయన శనివారం ఇక్కడ తెలంగాణ భవన్‌లో పార్టీ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, గంప గోవర్ధన్, కొప్పుల హరీశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పి.సుధాకర్‌రెడ్డి, మహమూద్అలీలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. శాంతిభద్రతలు కాపాడాల్సిన సీఎం ఫ్యాక్షనిస్టుగా వ్యవహరిస్తూ, సమైక్యవాదం పేరిట కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇకపై శాంతిభద్రతలు సీఎం వద్దనే ఉంటే, కేం ద్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. "కిరణ్ చిత్తూరు జిల్లాకు రూ.6వేల కోట్ల ప్రాజెక్టు మంజూరుచేసి లెక్కలు సెట్ చేసుకుంటున్నారు. శవాల మీద పేలాలు ఏరుకునే పనిలో ఉన్నారు'' అని ధ్వజమెత్తారు.
ఇంత జరుగుతున్నా టీ మంత్రులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని, చిత్తూరు జిల్లాకు మంజూ రు చేసిన ప్రాజెక్టును నిలిపివేయాలని, అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన ఆగదని చంద్రబాబు, జగన్‌లకు తెలుసని, అయినప్పటికీ సీమాంధ్రలో ఆధిపత్యం కోసం వైసీపీ, టీడీపీ మధ్య పోరు వికృత రూపం దాల్చుతోందని, అక్కడి ప్రజలు ఈ ఉచ్చులో పడొద్దని కోరారు. రాష్ట్ర విభజన తర్వాత ఉత్పన్నమయ్యే సమస్యల పరిష్కారం కోసం సీమాంధ్ర మేధావులు బాధ్యతాయుతంగా ఆలోచించాలని, ఇబ్బందులను మంత్రుల కమిటీ దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా విద్యుత్ సమస్య, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా డిమాండ్, ఉమ్మడి రాజధాని హెచ్ఎండీఏ పరిధిలో ఉంటుందా? జీహెచ్ఎంసీ పరిధిలోనా? వంటి అంశాలు పరిష్కారం కావాల్సి ఉందని, వాటిపై తమ వాదనను మంత్రుల కమిటీ ముందు గట్టిగా వినిపిస్తామన్నారు.
రాష్ట్ర విభజన తర్వాత నీతి, నిజాయితీగా బతికే సీమాంధ్ర ప్రజలు తమతోనే ఉండవచ్చని చెప్పారు. "జగన్‌ది ఏం దీక్ష? ఆయనింక నిజాయితీ గురించి మాట్లాడుతడు. అది జగన్‌కు సూట్ కాదు. ఆయన డిక్షనరీ నుంచి ఆ పదాన్ని తీసేయాలి'' అని హరీశ్‌రావు విరుచుకుపడ్డారు."అధికారం కోసం జగన్ ఎంత నీచానికైనా ఒడిగడతారు. జగన్ చేస్తున్న దొంగ దీక్షకు జూనియర్ ఆర్టిస్టులను ఎంగేజ్ చేసినట్లు తెలుస్తోందని, ఇది సమైక్యాంధ్ర ఉద్యమం తీరని ఎద్దేవా చేశారు. దీక్ష పేరిట జగన్ ముఠా కక్షలను హైదరాబాద్‌కు వ్యాప్తి చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు.
- See more at: http://www.andhrajyothy.com/node/7687#sthash.WFdCU2QI.dpuf

జుగల్ బందీ ఆపండి

Published at: 06-10-2013 04:26 AM

 New  0  0 

 



బాబు, జగన్ దీక్షలపై మండిపడ్డ బైరెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 5: 'పాదయాత్ర, బస్సుయాత్ర, నిరాహార దీక్ష ఇలా ఇద్దరూ ఒకే పాటపాడుతూ జనాన్ని మోసం చేయవద్దు, మీ జుగల్ బందీ ఆపండి, రాయలసీమ కోల్పోయిన రాజధాని కోసం పోరాడండి' అని చంద్రబాబు, జగన్‌లకు రాయలసీమ ప్రజా సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి హితవు పలికారు. హైదరాబాద్‌లో ఆయన శనివారం విలేఖర్లతో మాట్లాడుతూ 2003లో చిన్నారెడ్డి బృందాన్ని ఉసిగొల్పి రాష్ట్ర విభజనకు వైఎస్ నిప్పుపెట్టారన్నారు. తెలంగాణ పర్యటనలో విజయలక్ష్మి, షర్మిల, పార్టీ ప్లీనరీలో జగన్ తెలంగాణకు అనుకూలంగా మాట్లాడి ఇప్పుడు సమైక్యదీక్షకు కూర్చొని జనాన్ని మోసం చేస్తున్నాడని దుయ్యబట్టారు. వీరు చేస్తున్నది సమైక్యదీక్ష కాదని, బినామీ ఆస్తులపై తెలంగాణ కొత్త ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే జైలుకు పోతామన్న భయంతో దొంగదీక్షలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వీళ్లిద్దరూ ఒకరినొకరు దెబ్బతీసుకొనేందుకు రాష్ట్రాన్నే చీలికలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ జైలులో ఉన్నంతకాలం ప్రశాంతంగా జరిగిన సమైక్య ఉద్యమం ఇప్పుడెందుకు హింసాత్మకంగా మారుతుందో త్వరలోనే బయటపడుతుందని ఓ ప్రశ్నకు సమాధానంగా స్పందించారు. కిరణ్ కుమార్‌రెడ్డి ఇక్కడ మైలేజ్ కోసం ప్రాకులాడుతున్నాడు తప్ప సోనియాగాంధీ వద్ద నోరు విప్పలేడని, ఆడ, మగ, మాడా కాని నాలుగో జాతి వ్యక్తిలా ఉన్నాడని ఎద్దేవా చేశారు. తెలంగాణ వారితో 60 ఏళ్లు కాపురం చేసిన రాయలసీమ వాసులు ఆంధ్రవాళ్లతో 60 రోజులు కూడా కలిసి ఉండలేరన్నారు. సీమాంధ్ర రాజధానిని రాయలసీమలోనే పెట్టాలని డిమాండ్ చేశారు.
- See more at: http://www.andhrajyothy.com/node/7604#sthash.HoqJSImV.dpuf

No comments:

Post a Comment