పశ్చిమగోదావరి, జూన్ 3 : వీరవాసరంలోని మంత్రి పీతల సుజాత నివాసంలో రూ.10 లక్షల బ్యాగ్ లభ్యంపై ఆమె స్సందించారు. తనపై కుట్ర జరుగుతుందని అనుమానంగా ఉందని ఆమె ఆరోపించారు. నోట్ల కట్టల బ్యాగ్ తాడేపల్లిగూడెంకు చెందిన ద్దాల విష్నువత్తిదిగా అనుమానిస్తున్నారు. విష్ణు మంత్రిని కలిసేందుకు వచ్చినట్లు సిబ్బంది చెబుతున్నారు.
మంత్రి ఇంట్లో డబ్బు బ్యాగు వ్యవహారంలో....మహిళను గుర్తించిన పోలీసులు
మంత్రి ఇంట్లో డబ్బు బ్యాగు వ్యవహారంలో ఓ మహిళను పోలీసులు గుర్తించారు. తమ్ముడి పెళ్లి కోసం పాలకొల్లు బ్యాంకులో రూ.10 లక్షలను డ్రా చేసినట్లు కె.లక్ష్మీ చెప్పారు. మంత్రి ఇంటికి వెళ్లి తాను బ్యాగును మరిచిపోయానని లక్ష్మీ చెప్పారు. ఈ బ్యాగులో లక్ష్మీ అనే పేరుతో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.కాగా, డబ్బు ఉన్న బ్యాగులో డీఎస్సీ హాల్ టికెట్ ఉందని గుర్తించారు. డీఎస్సీ ఫలితాలు నిన్న వెలువడిన నేపథ్యంలో దీనిపై పలు రకాల అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీ దర్యాప్తు చేస్తున్నారు. మంత్రిని కలిసేందుకు లక్ష్మీ ఎందుకు వచ్చిందనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.
No comments:
Post a Comment