Saturday, 13 June 2015

ఆ ఏపీ నేత టీఆర్‌ఎస్‌ రాయబారి

ఆ ఏపీ నేత టీఆర్‌ఎస్‌ రాయబారి
  •  టీఆర్‌ఎస్‌ రాయబారి జగన్
  • ఆ పార్టీలో వైసీపీని కలిపేయండి
  • విజయమ్మను తీసేసి కేసీఆర్‌ను గౌరవ అధ్యక్షునిగా పెట్టుకో
  •  ఏపీ మంత్రులు, టీడీపీ నేతల ఫైర్‌
(హైదరాబాద్‌ - ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యేకు ముడుపుల వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబును ఏ-1 ముద్దాయిగా చేర్చాలంటూ వైసీపీ నేత జగన్‌ ఢిల్లీలో డిమాండ్‌ చేయడం, రాష్ట్రపతి, కేంద్ర మంత్రులను కలిసి ఫిర్యాదు చేయడంపై ఏపీ మంత్రులు, టీడీపీ నేతలు పెద్దఎత్తున విరుచుకుపడ్డారు. జగన్‌.. టీఆర్‌ఎస్‌ పార్టీకి రాయబారిగా వ్యవహరిస్తున్నారని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. కేంద్రానికి తాము చేసిన తమ ఫిర్యాదుతో టీఆర్‌ఎస్‌ వెనక్కు తగ్గినా జగన్‌ మాత్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తుండటం వెనక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా జగన్‌ తమపై ఎన్ని ఫిర్యాదులు చేసినా అభ్యంతరం లేదుకానీ ఆయన ఎవరి పక్షాన ఆ పని చేస్తున్నారనేది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు. ట్యాప్‌ చేసిన ఫోన్‌ సంభాషణలను తమకు కావాల్సిన విధంగా అతికించుకుని ఐదు రోజుల తర్వాత వాటిని విడుదల చేశారని యనమల ఆరోపించారు. ఏపీకి చెందిన 120 మంది ఫోన్లను తెలంగాణ ప్రభుత్వం ట్యాపింగ్‌ చేసిందన్నారు. తమ వద్ద రికార్డులు ఉన్నాయని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రకటించారని, దానిపై తాము కేంద్రానికి ఫిర్యాదుచేస్తామనే సరికి ఏసీబీ డీజీ ఏకే ఖాన్‌తో ఖండన ఇప్పించారని విమర్శించారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు రక్షణ లేకుండాపోయిందని, ఈ నేపథ్యంలోనే సెక్షన్‌ 8ని అమలు చేసి... ఉమ్మడి రాష్ర్టాల గవర్నర్‌కు పూర్తి అధికారాలను అప్పగించాలని తాము కేంద్రాన్ని కోరుతున్నామని వివరించారు. కాగా, జగన్‌ తన పార్టీని టీఆర్‌ఎ్‌సలో కలిపేయాలని టీడీపీ పొలిట్‌బ్యూరో నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. వైఎస్‌ విజయమ్మను పార్టీ గౌరవాధ్యక్షురాలి పదవి తొలగించి కేసీఆర్‌ను నియమించుకోవాలని సూచించారు. కేసీఆర్‌, జగన్‌ కలిసి ఏపీకి తీరని ద్రోహం చేస్తున్నారని, ఏపీ హోం మంత్రి చినరాజప్ప విమర్శించారు. సీబీఐ కేసుల్లో ఏ-1, ఏ2గా ఉన్న జగన్‌, విజయసాయిరెడిక్డి... సీఎం చంద్రబాబుపై విమర్శలు చేసే అర్హత లేదని మండిపడ్డారు. చంద్రబాబుపై కేసు నమోదు చేయాలని రాష్ట్రపతి, గవర్నర్‌ని జగన్‌ కలవడం విడ్డూరంగా ఉన్నదని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. జగన్‌... కేసీఆర్‌తో కలిసి కుహనా రాజకీయాలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు.

No comments:

Post a Comment