చిత్తూరు, జూన్ 3 : టీఆర్‌ఎస్, వైసీపీలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీడీపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలను కొనడమే కాకుండా టీడీపీ నేతలపై కేసీఆర్ ప్రభుత్వం ఇష్టానుసారంగా కేసులు పెడుతోందని ఆయన ఆరోపించారు. సమైక్యవాదం గురించి మాట్లాడే జగన్ టీఆర్‌ఎస్‌కు ఎలా మద్దతు ఇస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. బుధవారం చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం, ఆర్. మల్లవరంలో నిర్వహించిన జన్మభూమి - మాఊరు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నిప్పులా బతికిన తనపై ఎవరూ చర్యలు తీసుకోలేరని అన్నారు.
తెలంగాణలో 15 మంది టీడీపీ, ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారని, ఎమ్మెల్సీ కావాడానికి 17 ఓట్లు అవసరమని... అలాంటిది ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్ కొని.... ఇష్టానుసారంగా పోయి.. తిరిగి మాపై కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. రాష్ర్టాన్ని ఉద్దరిస్తామని, సమైక్యంగా ఉండాలని మాట్లాడిన వైసీపీ ఇప్పుడు టీఆర్‌ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీకి ఓటు వేసిందని ఆయన విమర్శించారు. దొంగలు... దొంగలు ఊర్లు పంచుకున్నట్లు.. ఆ రోజు కాంగ్రెస్, టీఆర్‌ఎస్, వైసీపీ నాయకులు కలిసి పనిచేశారని బాబు విమర్శించారు. 30 ఏళ్లుగా ఎవరూ వేలెత్తి చూపని విధంగా... నిప్పులా బతికానని.. ఆ విషయం ఈ నాయకులు గుర్తు పెట్టుకోవాల్సిన అవరసం ఉందని ఆయన అన్నారు.
No comments:
Post a Comment