హైదరాబాద్, జూన్ 22 : తాను ముఖ్యమంత్రి అవుతానని వచ్చిన వార్తలను సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఖండించారు. ప్రభుత్వాన్ని పార్టీని చంద్రబాబే సమర్థవంతంగా నిర్వహించగలరని ఆయన అన్నారు.
ఓటుకు నోటు కేసు తెరపైకి వచ్చిన తర్వాత టీడీపీలో రకరకాల ప్రచారాలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు సీఎం పదవికి రాజీనామా చేస్తారని, ఆయన రాజీనామా చేస్తే ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటారన్న రకరకాల ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. సీఎంగా అశోక్‌గజపతిరాజు, బాలకృష్ణ, లోకేష్ నాయుడు పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో సోమవారం బసవతారకం కేన్సర్ ఇనిస్టిట్యూట్ వ్యవస్థాపక దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఆ సంస్థ ఛైర్మన్ బాలకృష్ణ మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ఎప్పటికీ చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉంటారని, ఆయన నాయకత్వంలోనే పనిచేస్తామని అన్నారు. త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో కేన్సర్ ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని బాలయ్య తెలిపారు.
No comments:
Post a Comment