|
రేవంత్‌రెడ్డిపై స్టింగ్ ఆపరేషన్‌లో వెలువడిన టేపులో గొంతు మీదేనని తేలితే రాజీనామాకు సిద్ధమా? అని ఏపీ సీఎం చంద్రబాబును లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్‌లు, రికార్డింగుల అంశాన్ని కోర్టు తేలుస్తుందని, చంద్రబాబు సీఎం పదవికి రాజీనామా చేసి తన నిజాయితీని నిరూపించుకోవాలని సూచించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించి నిష్పాక్షికంగా విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ‘‘ఒక సాధారణ ఎమ్మెల్యే మిమ్మల్ని సంప్రదించకుండా 5 కోట్లు పెట్టి ఓటును కొనగలడా..? ఐదు కోట్లు అంటే ఇప్పుడు 500 మందికి ఏడాది ఆదాయం. ఏపీ దివాలా తీస్తోందని పదే పదే చెప్పే మీకు ఒక్క ఎమ్మెల్యేను కొనడానికి 5 కోట్లు ఎలా వచ్చాయి? వీటన్నింటికీ చంద్రబాబు సూటిగా సమాధానం చెప్పాలి’’ అని ఆయన అన్నారు.
|
No comments:
Post a Comment