|
ఆకివీడు : వాతావరణ మార్పుతో చేపల రైతులు కుదేలయ్యారు. నెలాఖరు వరకు భానుడు భగభగమంటూ ఎండ వేడిమితో ప్రజలు అల్లాడారు. సోమవారం ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ కుండపోత వర్షం కురిసింది. ప్రజలు సేద తీరారు. కాని, చేపల చెరువుల రైతులకు శాపంలా మారింది. చెరువులలో చేపలకు ఆక్సిజన్ సరిపోక పైకి తేలడం మొదలుపెట్టాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలంలో అయినకాడికి అమ్ముకుందామని చేపలను లాంచీల రేవు దగ్గర మార్కెట్‌కు తరలించారు. చేప కేజి తయారవ్వడానికి రూ.75లు పైనే ఖర్చవుతుంది. మార్కెట్ ధర నిన్నటి వరకు రూ.85 పలికింది. వాతావరణ మార్పుతో పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు, కాళ్ళ మండలాలు, కృష్ణ జిల్లా కలిదిండి, కైకలూరు మండలాలను టన్నుల కొద్దీ చేపలు రావడంతో కిలో చేప రూ.10, రూ.5లకు అయినకాడికి అమ్ముకున్నా
|
No comments:
Post a Comment