విజయవాడ, జూన్ 19 : కృష్ణా జిల్లా నందిగామ మండలం గొళ్లమూడిలో చేపల వర్షం కురిసింది. గత రాత్రి కురిసిన వర్షానికి ఆకాశం నుంచి చేపలు పడటంతో రైతులంతా ఆశ్చర్యపోయారు. పొలాల్లో, గ్రామాల్లో పడిన చేపలను పట్టుకున్న ప్రజలు వాటిని ఇంటికి తీసుకెళ్లారు.
వర్షంతో పాటు ఆకాశం నుంచి చేపలు పడటంతో జనం ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఆకాశం నుంచి పడిన చేపలు 'వాలగ' రకానికి చెందినవిగా గ్రామస్థులు చెబుతున్నారు. మూడు నుంచి నాలుగు కిలోలు ఉన్న చేపలు కూడా లభ్యమయ్యాయి. చేపలు కురిసిన వార్త తెలియడంతో పక్క గ్రామాల ప్రజలు సైతం అక్కడకు చేరుకుని చేపలను తీసుకువెళ్తున్నారు. గతంలో వర్షాలకు వాగులు, వంకలు పొంగినప్పటికీ చేపలు కొట్టుకురాలేదని....గతరాత్రి కురిసిన వర్షాలకు ఆకాశం నుంచి చేపలు పడ్డాయని గ్రామస్థులు చెబుతున్నారు.
No comments:
Post a Comment