Tuesday, 2 June 2015

ఇదే మన కేపిటల్‌.. ఇక్కడే ఉంటాం: చంద్రబాబు

ఇదే మన కేపిటల్‌.. ఇక్కడే ఉంటాం: చంద్రబాబు
విజయవాడ, ఆంధ్రజ్యోతి: ‘‘ఇదే మన కేపిటల్‌! మనం ఇక్కడే ఉంటాం!! రానున్న రోజుల్లో మన ఊరు అనుకుని ఇక్కడ పని చేయాల్సి ఉంటుంది. గతంలో నేను మీకు ఏ విషయాన్ని అయినా నొక్కి చెప్పేవాడిని. ఇప్పుడు చెప్పి చేస్తున్నాను. మీరు మరింత కష్టపడాల్సిన సమయం వచ్చింది. ఇబ్బందుల మధ్యనే ఏడాది పూర్తి చేసుకున్నాం. చాలా వరకు ప్రజలకు న్యాయం చేశాం. మిగిలిన నాలుగేళ్లలో ప్రజల కోసం, రాజధాని నిర్మాణం కోసం మరింత కష్టపడాలి. మీ నుంచి ఆ సహకారం ఆశిస్తున్నా’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. దీక్ష అనంతరం ప్రభుత్వ అతిథి గృహంలో అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. నవ నిర్మాణ దీక్ష సమైక్యాంధ్ర సభల తరహాలోనే విజయవంతమైందని, మీరు స్ఫూర్తిమంతంగా మాట్లాడారంటూ అధికారులు చంద్రబాబును కొనియాడారు. దీక్ష విజయవంతం కావడంపై తనకు కూడా ఆనందంగా ఉందని చంద్రబాబు చెప్పారు. ఇబ్బందుల్లో ఉన్నా రాజధాని నిర్మాణంతోపాటు రాష్ర్టాభివృద్ధి, ప్రజా సంక్షేమాలను ఏకకాలంలో నిర్వహించటానికి సర్వ శక్తులు ఒడ్డామని చెప్పారు. మనమంతా మిగిలిన నాలుగేళ్లూ శక్తికి మించి పనిచే యాల్సి ఉంటుందని చెప్పారు. ‘‘మీరు మరింత కష్టపడాలి. మా ఆలోచనలకు అనుగుణంగా మీరు కష్టపడితేనే ఈ రాష్ర్టాన్ని మనం సంకల్పించినట్టు అగ్రస్థానంలోకి తీసుకు రాగలం. ఇందుకు మీ సహకారం అవసరం. నేనేమీ గతంలోలా నొక్కి చెప్పడం లేదు. మీకు చెప్పి చేస్తున్నా.. మనమంతా సమష్టిగా పని చేయాల్సి ఉంది’’ అని చెప్పారు. విద్యుత్తు శాఖాధికారులు మరింత కష్టపడాలని, పరిశ్రమలు, విద్యుత్తు శాఖలు రెండూ సమన్వయంతో పని చేయాలని అజయ్‌ జైన్‌కు సూచించారు. రాష్ర్టాభివృద్ధికి పవర్‌, పరిశ్రమలే అతి ముఖ్యమైనవ ని.. ఆ రెండూ సమన్వయంతో పని చేస్తేనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు

No comments:

Post a Comment