Friday, 5 June 2015

ఇది ప్రజా రాజధాని...మొదటి కూలీని నేనే

ఇది ప్రజా రాజధాని...మొదటి కూలీని నేనే
కొండనైనా బద్దలు చేస్తా, రండి
రాజధాని నిర్మాణం కట్టుకునే అదృష్టం మనకు వచ్చింది
రైతులకు పాదాభివందనం చేసిన చంద్రబాబు

మందడం, జూన్‌ 6 : రాజధానిని నిర్మించుకునే అవకాశం జీవితంలో అందరికీ రాదని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధాని నిర్మించుకునే అవకాశం మనకు రావడం మన అదృష్టం అని ఆయన అన్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి శనివారం ఉదయం భూమి పూజ జరిగిన అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ దసరా నాటికి రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని ఆయన వెల్లడించారు. సింగపూర్‌నుంచి వచ్చిన నిపుణులు సింగపూర్‌ కంటె మెరుగుగా మీ అమరావతి వస్తుందని చెప్పినప్పు డు తాను చాలా సంతోషంచానని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణానికి కొండనైనా బద్దలు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు పాదాభివందనం చేస్తూ చంద్రబాబు తన ప్రసంగం ప్రారంభించారు. ఈ రైతులను జీవితంలో మరిచిపోలేనని చెబుతూ కట్టలేమనుకున్న రాజధానిని మనం బ్రహ్మాండంగా కట్టుకుంటాం అని ఆయన చెప్పినప్పు డు సభికులు కేరింతలు కొట్టారు. అమరావతి అంటే దేవతలకు రాజధాని, దేవేంద్రుని రాజధాని అమరావతి అని ఆయన అన్నారు. ఇటువైపు కృష్ణమ్మని చూసినప్పుడు ఎంతో ఆనందం కలుగుతుందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రతి ఒక్కరూ ఒక ఇటుకను, లేదా అంత విలువైన విరాళం ఇవ్వాలని ఆయన పిలుపు ఇచ్చారు. రాజధాని నిర్మాణంలో మొదటి కూలీని తానే అంటూ భూమి ఇవ్వవద్దని ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఇక్కడి రైతులు ధైర్యంగా నిల్చున్నారని చంద్రబాబు ప్రశంసించారు. భూసేకరణ జరగడం దేశంలో ఇదే మొదటిసారి అని, ఇక్కడికి వచ్చినపడు నాకు ఎక్కడికీ పోబుద్ధికావడంలేదని చంద్రబాబు చెప్పారు.

No comments:

Post a Comment