గ్రీస్, జున్ 2 : గ్రీస్‌ను మరోసారి ఆర్థిక సంక్షోభం ముంచేసింది. జాతీయ బ్యాంకులను వారం రోజుల పాటు మూసివేస్తూ ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో కస్టమర్లు బ్యాంకుల ముందు క్యూ కడుతున్నారు. ఈ సంక్షోభ ప్రభావం ఆసియా మార్కెట్లపై పడింది. జపాన్, సియోల్, హంకాంగ్ మార్కెట్లు నష్టాలు నమోదు చేశాయి. అత్యవసర నిధుల విడుదలను పొడిగించేది లేదని యురోపియన్ సెంట్రల్ బ్యాంక్ తేల్చి చెప్పడంతో ప్రభుత్వం జాతీయ బ్యాంకులను మూసివేసింది. ప్రభుత్వ ప్రకటనలవల్ల పెన్షనర్లు బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తున్నారు. తమ అకౌంట్లలోని డబ్బులు డ్రా చేసుకునేందుకు ఎగబడుతున్నారు.
ఆర్థిక సంక్షోభంపై అత్యవసర సమావేశం అయిన కేంద్ర కేబినెట్ బ్యాంక్ మూసివేతపై నిర్ణయం తీసుకుంది. జులై 7వ తేదీ వరకు బ్యాంకులను మూసివేయనున్నారు. అంతేకాదు ప్రతి రోజు డ్రా చేయాల్సిన మొత్తాన్ని కూడా 66 డాలర్లకు కుదించారు. గత శనివారం ఉద్దీపన ప్యాకేజీపై యూరో జోన్ దేశాల మద్య జరిగిన చర్చలు ఎటువంటి ఒప్పందం లేకుండా ముగిసాయి. దాంతో జులై 5న గ్రీస్ ప్రభుత్వం ఉద్దీపన ప్యాకేజీపై రిఫరెండం నిర్వహించాలని నిర్ణయించింది.
No comments:
Post a Comment