Thursday, 25 June 2015

మే 21న గ్రాండ్ సితారలో జగన్‌ ఎవరిని కలిశారు?

మే 21న గ్రాండ్ సితారలో జగన్‌ ఎవరిని కలిశారు?

హైదరాబాద్, జూన్ 24 (ఆంధ్రజ్యోతి):  సెక్షన్‌ 8 అమలుపై ప్రతిపక్ష వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి నోరువిప్పాలని టీడీపీ మంత్రులు, నాయకులు డిమాండ్‌ చేశారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు విలేకరులతో మాట్లాడుతూ సెక్షన్‌ 8పై తాము రాజకీయాలకు అతీతంగా పోరాడుతుంటే జగన్‌ నోరు మెదపడంలేదని విమర్శించారు. జగన్‌ టీఆర్‌ఎస్‌ నేత కేసీఆర్‌తో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. కాగా పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనపడినట్లు అవినీతిలో కూరుకుపోయిన జగన్‌కు అంతా తేడాగా కనబడుతున్నదని హైదరాబాద్‌లో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఆయన కళ్లకు కనపడకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. నేతలంతా సెక్షన్‌ 8పై మాట్లాడుతుంటే జగన్‌ మాత్రం ఈ విషయంపై నోరు మెదపడం లేదని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ వ్యాఖ్యానించారు. కడప జిల్లా కమలాపురంలో ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజల ద్రోహి కేసీఆర్‌కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు ఇస్తారా అని ప్రశ్నించారు. కాగా, మే 21వ తేదీన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 12లో ఉన్న గ్రాండ్‌ సితార హోటల్లో వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఎవరిని కలిశారో బహిర్గతం చేయాలని టీడీపీ ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ డిమాండ్‌ చేశారు. బుధవారం హైదరాబాద్‌లో ఆమె మాట్లాడుతూ ‘అక్కడ ఏం జరిగింది? ఆయన ఎవరిని కలిసి మాట్లాడారు? చెప్పాలి. ఒక పెద్ద కుట్రకు అక్కడ అంకురార్పణ జరిగింది. జగన్‌ తన బెయిల్‌ కోసం అడుగుతారుగాని సెక్షన్‌ 8 గురించి మాత్రం మాట్లాడరు. టీఆర్‌ఎ్‌సకుకి కేసీఆర్‌ అధ్యక్షుడు అయితే జగన్‌ షాడో అధ్యక్షుడు’ అని ఆమె విమర్శించారు.

టీడీపీని దెబ్బతీసేందుకు టీఆర్‌ఎస్‌, వైసీపీ కుమ్మక్కు : టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు
 హైదరాబాద్‌, జూన్‌ 25 : టీడీపీని దెబ్బ తీసేందుకు టీఆర్‌ఎస్‌ వైసీపీతో కుమ్మక్కు అయిందని టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆరోపించారు. హోటల్‌లో జగన్‌, టీఆర్‌ఎస్‌ నేతలు కలిశారని తమకు సమాచారం ఉందన్నారు. సెక్షన్‌ 8ను అమలు చేయాల్సిందేనని ఆయన అన్నారు. గతేడాది చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారని, గవర్నర్‌కు అధికారాలుంటే జేఎన్టీయూలో ప్రొఫెసర్‌పై దాడి జరిగేదా అని ఆయన ప్రశ్నించారు. 

No comments:

Post a Comment