Thursday, 25 June 2015

విజయవాడకు రాజధాని కళ!

విజయవాడకు రాజధాని కళ!

 చురుగ్గా సీఎం క్యాంపు కార్యాలయం పనులు
 లింగమనేని అతిథిగృహంలోనే బస?
విజయవాడ, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): ఏపీ వాణిజ్య రాజధాని విజయవాడ త్వరలో తాత్కాలిక రాజధాని కళను సంతరించుకోనుంది. వారానికి మూడు రోజులు విజయవాడ నుంచే అధికారిక కార్యకలాపాలు నిర్వహిస్తానని ప్రకటించిన ఏపీ సీఎం చంద్రబాబు దానికి త్వరలో కార్యరూపం ఇవ్వనున్నారు. పలు ఆటంకాలు, వాయిదాల తర్వాత సీఎం విజయవాడ క్యాంప్‌ ఆఫీస్‌ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. మరోవైపు చంద్రబాబు నివాసం ఉండేందుకు కృష్ణానదీ తీరాన గుంటూరు జిల్లా ఉండవల్లి పంచాయతీ పరిధిలో ఉన్న లింగమనేని గ్రూపునకు చెందిన అతిథిగృహాన్ని పలువురు ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. వివాదాస్పదమైన ఈ అతిథిగృహంలో సీఎం బస చేయకపోవచ్చని తొలుత భావించినా, పరిశీలనకు వచ్చే అధికారుల తాకిడి తగ్గకపోవడంతో ఇక్కడే సీఎం బస చేయవచ్చని స్థానిక అధికారులు భావిస్తున్నారు. తాజా పరిణామాలతో సీఎం కొద్ది రోజుల్లోనే ఇక్కడికి తరలి రావడం తథ్యమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీఎం బాటలోనే వివిధ శాఖల మంత్రులు తమ క్యాంపు కార్యాలయాలను ఈ ప్రాంతంలో ఏ ర్పాటు చేసుకుంట ుండడం, పలు వి భాగాల ప్రధాన కా ర్యాలయాలు సైతం ఇక్కడికి వచ్చేందుకు సమాయత్తమవుతుండటంతో విజయవాడ తాత్కాలికంగానైనా రాజధాని కళ సంతరించుకోనుంది. సీఎం, మంత్రులు వారానికి మూడు రోజులు విజయవాడలో బస చేస్తే ఏపీలోని 13 జిల్లాల నుంచి ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌కి రాకపోకలు తగ్గిపోయే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదే సమయంలో విజయవాడలో రద్దీ పెరిగే అవకాశం ఉంది.

No comments:

Post a Comment