- ప్రమేయంపై లోతుగా దర్యాప్తు..
- పక్కా ఆధారాలుంటే వదలొద్దు..
- కేసులో నిందితుడిగా చేర్చేద్దాం..
- పకడ్బందీగా పడుతున్న అడుగులు..
- కేసీఆర్‌తో ఏసీబీ, నిఘా చీఫ్ భేటీ..
హైదరాబాద్, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): ‘చూద్దాం! పక్కాగా పరిశీలిద్దాం! బలమైన ఆధారాలుంటే చంద్రబాబునూ బుక్ చేసేద్దాం!’ ఓటుకు నోటు కేసులో టీఆర్‌ఎస్ ప్రభుత్వం, పార్టీ వర్గాల ఆలోచనలు ఇలాగే సాగుతున్నట్లు తెలుస్తోంది. దీని సాధ్యాసాధ్యాలు, పర్యవసానాలపై తర్జన భర్జనలు పడుతున్నట్లు సమాచారం. చంద్రబాబు ప్రమేయంపై బలమైన ఆధారాలు లభిస్తే మాత్రం ఆయనను వదిలిపెట్టొద్దనే ఉద్దేశంతోనే ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో రేవంత్ పాత్రధారేనని, అసలు సూత్రధారి ఏపీ సీఎం చంద్రబాబేనని తెలంగాణ మంత్రులు పదే పదే చెబుతున్నారు. రేవంత్‌రెడ్డి, స్టీఫెన్ మధ్య జరిగిన సంభాషణల్లో చంద్రబాబు ప్రస్తావన వచ్చిన విషయం గుర్తు చేస్తున్నారు. పైగా... తమ ఎమ్మెల్యేతో చంద్రబాబు మాట్లాడినట్లు ఆధారాలు కూడా ఉన్నాయని హోంమంత్రి నాయిని చెప్పారు. కేసు దర్యాప్తులో చంద్రబాబు పాత్ర ఉందని పక్కాగా తేలితే, కావాల్సిన చట్టబద్ధమైన అనుమతులన్నీ తీసుకొని ఆయనపై కేసు నమోదు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబుపై కేసు నమోదు చేసే అవకాశాలను తోసిపుచ్చలేమని అధికార పార్టీ ముఖ్యులు అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. ‘‘గతంలో జార్ఖండ్ ముక్తి మోర్చా ఎంపీలు కొందరు డబ్బు తీసుకొని అప్పటి పీవీ సర్కారుకు అనుకూలంగా వ్యవహరించారనే అభియోగాలు వచ్చాయి. ఇప్పట్లాగా అప్పట్లో టేపుల్లో పీవీ పేరు వినిపించలేదు, ఆయన కనిపించలేదు. అయినప్పటికీ పీవీపైనా కేసు నమోదైంది. అలాగే, చంద్రబాబుపై కేసు పెట్టే అవకాశాలున్నాయి. పైగా... వీడియో టేపుల్లో రేవంత్ నోట బాస్ మాట పదేపదే వచ్చింది’’ అని వారు చెబుతున్నారు.
అయితే... చంద్రబాబుపై కేసు పెట్టాలా, వద్దా అనేది పైస్థాయి రాజకీయ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని పేర్కొంటున్నారు. ఒకవేళ... ఈ విషయం సున్నితంగా మారి, భిన్నమైన సంకేతాలు పంపిస్తాయనుకుంటే... ఎవరి ద్వారా అయినా కోర్టును ఆశ్రయించి బాబుపై కేసు నమోదుకు ఏసీబీని ఆదేశించాలని కోరే అవకాశం ఉందని చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ముందు చంద్రబాబుపై కేసు నమోదైతే ఎలా ఉంటుందనే రాజకీయ కోణంలోనూ ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
చాలా సీరియస్‌గా...
ఏది ఏమైనప్పటికీ... ఈ కేసును టీఆర్‌ఎస్ పార్టీ ముఖ్యులు, ప్రభుత్వ పెద్దలు చాలా సీరియస్‌గా తీసుకుంటున్నట్లు సమాచారం. డబ్బులు, ఎమ్మెల్యేల కొనుగోళ్ల సంగతి పక్కనపెడితే... ఏసీబీకి చిక్కిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి మీసం మెలేయడం, కేసీఆర్‌ను కుర్చీ నించి దించుతానని, బట్టలు విప్పించి కొట్టిస్తానని అనడాన్ని ప్రభుత్వ పెద్దలు తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. అడ్డంగా దొరికిపోయిన రేవంత్ రెడ్డే అలా మాట్లాడితే, ప్రభుత్వంలో ఉన్న తాము మాత్రం ఎందుకు ఊరుకోవాలని పార్టీ ముఖ్యులు కొందరు ప్రశ్నిస్తున్నారు. ‘‘ఈ కేసులో కూడా మిగిలిన అన్ని కేసుల్లాగే, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. ప్రస్తుతం ఉన్న ఆధారాలు... దర్యాప్తులో భాగంగా భవిష్యత్‌లో లభించే సాక్ష్యాల మేరకు ఇతరులను కూడా నిందితులుగా చేరుస్తాం’’ అని ఏసీబీ అధికారులు చెబుతున్నారు.
సీఎంతో కీలక భేటీ
క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఏసీబీ డీజీ ఏకే ఖాన్, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి గురువారం సమావేశమయ్యారు. రేవంత్ కేసులో ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు, అదనంగా సేకరించిన సమాచారం, కోర్టులో కేసు పరిస్థితి తదితర విషయాల్ని వారు సీఎంకు వివరించినట్లు సమాచారం. ఈ విషయంతో సంబంధం ఉన్న ఏ ఒక్కర్నీ వదలొద్దని, పక్కా ఆధారాలతో కేసులు నమోదు చేయాలని అధికారులకు సీఎం సూచించినట్లు తెలుస్తోంది.
ముందు నుంచీ పక్కాగా...
స్టీఫెన్సన్ ఏసీబీకి లిఖితపూర్వక ఫిర్యాదు చేయకముందే, టీఆర్‌ఎస్ వైపు నుంచే ‘నిఘా’ వేసినట్లు తెలుస్తోంది. గత నెల 31న రేవంత్, స్టీఫెన్‌సన్ మధ్య జరిగిన భేటీకి సంబంధించిన టేపులు బయటపడినప్పటికీ... అంతకుముందు జరిగిన సంభాషణల టేపులూ ఉన్నట్లు చెబుతున్నారు. ‘దొరికిపోవడం పక్కా’ అని నిర్ధారించుకున్న తర్వాతే ఏసీబీకి ఫిర్యాదు చేయించి, రేవంత్‌ను ఆధార సహితంగా పట్టుకున్నట్లు తెలుస్తోంది. దాడులు చేసే సమయంలో ఏసీబీ అధికారులు కెమెరాలు ఉపయోగించడం సాధారణమే అయిప్పటికీ... పూర్తి సమాచారం, సమయం, తేదీ కూడా రికార్డు అయ్యేలా ఇంత పకడ్బందీగా చర్యలు తీసుకోవడం ఇదే మొదటిసారిగా చెబుతున్నారు. రేవంత్‌ను అరెస్టు చేసిన కొద్దిసేపటికే... మొత్తం వీడియో ఫుటేజ్ మీడియాకు లీక్ కావడం కూడా ‘వ్యూహం’లో భాగమేనని తెలుస్తోంది.
గుట్టు రాబట్టాలి!
రేవంత్‌ను ఐదు రోజులు అప్పగించండి.. ఏసీబీ అధికారుల కస్టడీ పిటిషన్
ఓటుకు నోటు కేసులో అరెస్టయి, జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని తమ కస్టడీ అప్పగించాలంటూ ఏసీబీ ప్రత్యేక కోర్టులో అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. రేవంత్‌తోపాటు సహ నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయ్‌సింహను కూడా ఐదు రోజులపాటు తమ కస్టడీకి అప్పగించాలని ఏసీబీ అధికారులు కోరారు. అందుకు కారణాలనూ వివరించారు. ‘‘నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్‌కు ఇచ్చిన రూ.50 లక్షలు ఎక్కడివి? ఎమ్మెల్సీ ఎన్నిక ఓటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఇస్తామన్న రూ. 4.50 కోట్లు ఎక్కడ ఉన్నాయి? ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ విషయాలన్నీ రేవంత్ రెడ్డికి తెలుసు. అరెస్టు తర్వాత ఆయనను ప్రశ్నించేందుకు మాకు అవకాశం లభించలేదు. ఇప్పుడు పూర్తిస్థాయిలో విచారించి వివరాలు తెలుసుకోవాల్సి ఉంది’’ అని తెలిపారు. అరెస్ట్ సమయంలో రేవంత్ రెడ్డి నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్‌ను పరిశీలించి ఇప్పటికే కొంత సమాచారం సేకరించామని, ఈ వ్యవహారంలో ఆయన చాలామందితో మాట్లాడినట్లు తెలుస్తోందని చెప్పారు. వీటన్నింటిని విశ్లేషించి దర్యాప్తుకు అవసరమైన అన్ని అంశాల్ని వెలుగులోకి తేవాల్సి ఉందని కోర్టుకు ఏసీబీ అధికారులు తెలిపారు. ‘‘నేరం చేసే ముందు నిందితులు ఎక్కడెక్కడ కలుసుకుని చర్చించుకున్నారు? ప్రణాళిక ఎక్కడ రూపొందించారు? స్టీఫెన్సన్‌ను ఎలా కలుసుకున్నారు? వంటి వివరాలు తెలుసుకోవాల్సి ఉంది’’ అని తెలిపారు. మరోవైపు... ఈ కేసులో ఏ4గా ఉన్న జెరుసలేం మత్తయ్య తరచూ తాను ఉంటున్న ప్రదేశాన్ని మారుస్తున్నారని, అందువల్లే పట్టుకోలేకపోతున్నామని చెప్పారు. ముగ్గురు నిందితుల్ని విచారించడం ద్వారానే పరారీలో ఉన్న మత్తయ్యను అదుపులోకి తీసుకునేందుకు అవకాశం ఉంటుందని పిటిషన్‌లో చెప్పారు. ఈ పిటిషన్‌పై ఏసీబీ ప్రత్యేక కోర్టు శుక్రవారం విచారణ
No comments:
Post a Comment