|
నెల్లూరు, ఆగస్టు 18 : ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు తాము ప్రధాన ప్రతిపక్ష పార్టీగా సర్కారుకు సహకరిస్తామని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి చెప్పారు. ఏపీకి పదేళ్లపాటు ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో పోరాడిన బీజేపీ అధికారంలోకి వచ్చాక మాట మార్చిందన్నారు. ఇలా మాట మార్చడం సరికాదని ఎంపీ అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ర్టాన్ని అన్యాయంగా విభజించిందని, బిల్లులో ప్రత్యేక హోదా అంశాన్ని పొందుపర్చలేదని ఆయన ఆరోపించారు. ప్రత్యేక హోదా సాధించేందుకు చంద్రబాబు చేస్తున్న కృషికి తాము సహకరిస్తామని ఎంపీ మేకపాటి వివరించారు
|
No comments:
Post a Comment