|
విజయవాడ, ఆగస్టు 13 : ఆంధ్రప్రదేశ్‌లో ప్రపంచస్థాయి రాజాధాని నగర నిర్మాణాన్ని చేపట్టబోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. గురువారం ఉదయం విజయవాడ నుంచి హైదరాబాద్‌లో ఉన్న సీఐఐ ప్రతినిధులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఐఐతో 19 ఏళ్ల అనుబంధం ఉందని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. 8 సార్లు దావోస్ సమావేశంలో పాల్గొన్నట్లు తెలిపారు. తమ సహకారంతో గతంలో ఏపీని అభివృద్ధి చేశానని ప్రతినిధులతో అన్నారు. వ్యవసాయం, నగరాల అభివృద్ధిలో సీఐఐది ప్రధాన పాత్ర అని బాబు కొనియాడారు. ప్రపంచంలో పెద్దపెద్ద కంపెనీలకు సీఈవోలు ఇండియా నుంచి వెళ్లడం గర్వకారణమన్నారు.
కేంద్రం సహాయంతో రాష్ర్టాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయనున్నట్లు సీఎం చెప్పారు. ఏపీకి సుదీర్ఘ కోస్తా తీరం ఉంది...అదో గొప్పవరం అని అన్నారు. పోర్టు కార్గోలో రాష్ర్టాన్ని ప్రథమస్థానానికి తీసుకెళ్తామని ధీమా వ్యక్తం చేశారు. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానంతో ఏపీని కరువు రహిత రాష్ట్రంగా మారుస్తామని స్పష్టం చేశారు. దేశంలో విద్యుత్ సంస్కరణలకు ఆద్యుణ్ని తానే అని పేర్కొన్నారు. పారిశ్రామిక అభివృద్ధికి తమ సహకారం కావాలని వీడియో కాన్ఫరెన్స్‌లో సీఐఐ ప్రతినిధులతో చంద్రబాబు అన్నారు.
|
No comments:
Post a Comment