|
హైదరాబాద్, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): వచ్చే బడ్జెట్ సమావేశాలను విశాఖపట్టణంలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఏపీ ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. మద్రాసు నుంచి ఆంధ్ర విడిపోయిన తర్వాత కర్నూలు రాజధానిగా పాలన సాగిన సమయంలోనూ విశాఖలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించిన దాఖలాలు ఉన్నాయని వివరించారు. సమావేశాలు విశాఖ ఆంధ్రవిశ్వవిద్యాలయంలోనా..? లేక ఇతర ప్రాంతంలోనా అనేది పరిశీలిస్తామని చెప్పారు. వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ ఒకటి నుంచి..ఐదారు రోజులపాటు నిర్వహించబోతున్నట్టు యనమల తెలిపారు. కాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏనాడూ మినీ అసెంబ్లీ రాజధానేతరప్రాంతాల్లో నిర్వహించిన దాఖలాలు లేవు. ఒక్క విశాఖలోనే అదీ జరిగింది. కిరణ్ హయాంలో, కొత్త ఎమ్మెల్యేలకు అరకులో 3రోజులపాటు సమావేశాలను నిర్వహించారు.
|
No comments:
Post a Comment