Monday, 10 August 2015

ఏపీకి హోదా కంటే రెట్టింపు నిధులు: ఎంపీ హరిబాబు

ఏపీకి హోదా కంటే రెట్టింపు నిధులు: ఎంపీ హరిబాబు

గుంటూరు, ఆగస్ట్ 10: ఏపీకి ప్రత్యేకహోదా వల్ల వచ్చే నిధుల కంటే, రెట్టింపు నిధులు ఇచ్చేందుకు కేంద్రం ప్రణాళిక సిద్ధం చేస్తోందని విశాఖ ఎంపీ, బీజేపీ నేత కంభంపాటి హరిబాబు చెప్పారు. రాజధానికి ప్రణాళిక సిద్ధం కాకపోయినా, కేంద్రం వెయ్యికోట్లు మంజూరు చేసిందని ఆయన గుర్తు చేశారు. పోలవరంపై రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్‌ నేతలు, పదేళ్లు అధికారంలో ఉండి ఏంచేశారో చెప్పాలని హరిబాబు డిమాండ్ చేశారు. విభజన చట్టంలో లేని అంశాలను కూడా కేంద్రం అమలు చేస్తోందని ఆయన అన్నారు. ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని హరిబాబు చెప్పారు. ప్రతిపక్షాలు లేనిపోని అపోహలు సృష్టించి ప్రజలను భయాందోళనలకు గురి చేయడం సరికాదన్నారు. ప్రత్యేక హోదా గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎంపీ హరిబాబు చెప్పారు.

No comments:

Post a Comment