Saturday, 8 August 2015

రెండు రాష్ర్టాల్లో ఎలాంటి సమస్యలు లేవు : గవర్నర్‌ నరసింహన్‌

రెండు రాష్ర్టాల్లో ఎలాంటి సమస్యలు లేవు : గవర్నర్‌ నరసింహన్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 8 : తెలుగు రాష్ర్టాల్లో ఎలాంటి సమస్యలు లేవని ఉమ్మడి రాష్ర్టాల గవర్నర్‌ నరసింహన్‌ తెలిపారు. మీడియానే ఈ సమస్యలను సృష్టిస్తోందని వ్యాఖ్యానించారు. త్వరలోనే విద్యుత్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని గవర్నర్‌ చెప్పారు. రెండు రోజుల పర్యటన కోసం ఢిల్లీ వెళ్లిన గవర్నర్‌ బిజీబిజీగా ఉన్నారు. ఈ ఉదయం కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, హోంశాఖ కార్యదర్శితో గవర్నర్‌ సమావేశమయ్యారు. రెండు రాష్ర్టాల్లోని తాజాపరిస్థితులపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో కూడా సాయంత్రం గవర్నర్‌ సమావేశంకానున్నారు.

No comments:

Post a Comment