|
విజయవాడ, ఆగస్టు 11 : రాబోయో మూడు నెలల్లో ఏపీ నుంచే పూర్తి స్థాయి పాలన కొనసాగనుందని ఏపీ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. మంగళవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రితోపాటు మంత్రులు, కార్యదర్శులు, కమిషనర్లు వారానికి నాలుగు రోజులు విజయవాడలో ఉంటారని, విజయవాడకు మొత్తం అధికార యంత్రాంగం అంతా తరలించాలనే పట్టుదలతో సీఎం ఉన్నారన్నారు. పరిశ్రమలకు భూమి, విద్యుత్, నీటి కేటాయింపుపై కొత్త విధానంతోపాటు మొదటి త్రైమాసికంలో రెవెన్యూ లోటు.. రెండో త్రైమాసికంలో లోటు భర్తీపై సీఎం చర్చించారని, ఆదాయం తెచ్చే శాఖలు, సేవలందించే శాఖలపై ముఖ్యమంత్రి సమీక్ష జరిపారని ఆయన వివరించారు.
|
No comments:
Post a Comment