Monday, 17 August 2015

ఖమ్మం,నల్గొండలో గ్రామజ్యోతిని బహిష్కరించిన టీఆర్ఏస్ కార్యకర్తలు

ఖమ్మం,నల్గొండలో గ్రామజ్యోతిని బహిష్కరించిన టీఆర్ఏస్ కార్యకర్తలు
ఖమ్మం,ఆగస్టు 17: వైరా మండలం వల్లాపురంలో గ్రామజ్యోతి కార్యక్రమాన్ని టీఆర్ఎస్ ఎంపీపీ సమత బహిష్కరించింది. రాష్ట్రాభివృద్ధి కార్యక్రమాల్లో స్ధానిక ఎమ్మెల్యే తమను పట్టించుకోవడం లేదని ఎంపీపీ సమత ఆరోపిస్తోంది. అలాగే నల్గొండ జిల్లాలోని చౌటుప్పల్‌లో కూడా గ్రామజ్యోతి కార్యక్రమాన్ని టీఆర్ఎస్ ఎంపీటీసీలు అడ్డుకున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలల్లో తమకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని వారు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో 10మంది ఎంపీటీసీలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

No comments:

Post a Comment