Monday 30 September 2013

Babu is a prize catch for Modi’s BJP

Why Chandrababu Naidu is a prize catch for Modi’s BJP

If you're new here, you may want to subscribe to my RSS feed. Thanks for visiting!
Chandrababu Naidu’s support for NDA may suggest a significant realignment of Indian polity.
If recent media reports are to be believed, former Andhra Pradesh (AP) Chief Minister Chandrababu Naidu may return to the BJP-led National Democratic Alliance (NDA).  Launching a scathing attack on the Congress party, Naidu recently met BJP president Rajnath Singh. That Naidu has not explicitly ruled out an alliance with the BJP itself is good news for the party considering  its pariah status.  While Chandrababu Naidu’s popularity in AP is a matter of conjecture—especially with the division of the state and the rise of Jaganmohan Reddy— it may indicate a significant realignment of the political forces. For three reasons.
First, it may be hard to believe but only two decades back, the Left and the BJP had constructed a grand alliance under the leadership of V P Singh against the Rajiv Gandhi government. There was little ideological affinity between the two parties; they were motivated by only one factor: anti-Congressism. As the Congress was a colossus on the national stage, the opposition had little alternative but to come together despite its own ideological differences and disparate policies.  The only concern was throwing out the Congress government—the rest was a matter of detail.
A major shift in the Indian polity in the last two decades is the withering of anti-Congressism as the defining principle of alliance construction.  There are many reasons for that. The Gujarat riots of 2002 and NDA’s loss in 2004 helped push the ‘secular parties’ away from the BJP.  Paradoxically, the relative weakening of the Congress party compared to its overwhelming influence till the 1980s has allowed it to attract regional allies. It is no longer the behemoth which would crush all other parties and refused to compromise confident of its prima donna status. Under the leadership of Sonia Gandhi, the Congress has also offered an alternative organizing principle: anti-communalism. By portraying BJP as ‘unacceptable’, Congress has made itself an attractive option even for Lohiate socialists like Mulyam Singh Yadav and Nitish Kumar. The replacement of anti-Congressism with anti-communalism explains much of the party’s success in the last decade and is a significant achievement of Mrs. Gandhi and her leadership. That BJP is considered more ‘unacceptable’ in 2013 compared to 1998 in the aftermath of the Babri Masjid demolition and the subsequent religious polarization is indicative of how successful Mrs. Gandhi’s strategy has been.
Chandrababu Naidu overtures to the BJP marks the first major shift in that narrative in the last decade. Since its defeat in 2004, the BJP has been steadily bleeding allies to the extent that it is only left with Shiv Sena and Akali Dal as NDA partners.  Chandrababu Naidu’s scathing attack on the Congress party and his labeling of it as the primary ‘enemy’ offers the BJP an opportunity to resurrect the concept of   ‘anti-Congressism.’ If the BJP can make 2014 about the failings of the UPA government rather than the communal/secular debate, it would be in a much stronger position to not only win additional seats but attract allies. Indeed, it was interesting that Naidu never actually endorsed Modi—rather his argument was that the Congress party has derailed India’s growth story and hence needs to be removed.  Replace economics with secularism and this is precisely the reasoning the likes of Maywati and Mulayam Singh Yadav have offered for their continued support of the UPA government.
Second, BJP is not a major force in Andhra Pradesh politics. It may have its pockets of influence and the unstinted support for Telangana may yield some minor benefits, but it is unlikely to win a seat on its own. On the other hand, it is clear that any party considering an alliance with BJP should expect a significant Muslim backlash. If Naidu is willing to ally with the BJP despite these handicaps, it suggests that at least in his mind Modi is likely to attract an incremental vote in AP. In short, Naidu is betting on Modi being a Vajpayee. One of the most interesting questions of 2014 general elections is this: Does Narendra Modi have the coattails to deliver additional support to the BJP in areas outside of its core influence? Naidu’s move towards the NDA suggests that at least in the case of AP, Modi may be a stronger factor compared to his party. Will it force other regional parties to consider BJP as a potential ally?
Third, if the BJP wins 200 seats in the 2014 general elections, Narendra Modi is likely to be the next prime minister of India. However, recent opinion polls and the party’s own geographical limitations suggest that 150-160 may be a more realistic figure. It is this battle for the additional 30-40 seats which is likelyto decide who forms the next government in Delhi. One significant disadvantage BJP has that the threshold at which it can stitch together a stable coalition is much higher than the Congress party. It is exactly here an endorsement from Naidu may be truly significant: by reducing BJP’s unacceptability, he lowers the  threshold   at which Modi can ensure an expanded NDA and fulfill his prime ministerial ambitions.  It also helps address one of the strongest arguments against Narendra Modi: that not only would he scare off allies—Nitish Kumar is a prime example— but would make it exceedingly hard for the BJP to attract regional parties like the BJD or Trinamool Congress. If Chandrababu Naidu joins the NDA, it would be a significant feather in Modi’s cap. For instance, it is noticeable that despite his alleged wider acceptability, L. K Advani in 2009 failed to expand the NDA. In fact, he presided over the departure of one of its oldest allies which cost BJP the state of Orissa.
It is certainly not guaranteed that Chandrababu Naidu would ultimately join the NDA or enter into a pre-poll alliance. He would probably wait for the results of the assembly elections scheduled in November 2013 and gauge BJP’s popular support before he decides one way or the other.  And even if Naidu joins the NDA, it is unlikely that Jayalalitha—perhaps  BJP’s most natural ally–would endorse Narendra Modi.  And would a TDP-BJP alliance actually deliver seats in AP?
However, by providing ‘secular’ cover to Modi’s BJP, Naidu may yet prove to be the most important partner for the BJP and increase its acceptability among other regional players.  The logic of politics is simple: allies beget allies. As many commentators have discovered over the years, it is almost always a fraught exercise to speculate over the future direction of Indian politics. Nevertheless, the significance of this moment for the BJP and the broader national polity should be clearly understood.

రాహుల్‌దే ఆ పాపం - MODI

రాహుల్‌దే ఆ పాపం

September 30, 2013


న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: "ప్రస్తుత యూపీఏ సర్కారు గాంధీని ఆరాధిస్తుంది. అంటే  గాంధీ బొమ్మ ఉన్న వెయ్యి రూపాయల నోట్లను పూజిస్తుందన్నమాట! కాంగ్రెస్ పార్టీ అవినీతిపై యుద్ధం చేయడానికి బదులు అవినీతికి పాల్పడటానికి అలవాటు పడింది  ప్రభుత్వాలంటే ఎక్కడైనా ప్రజల బలం. కానీ, ఢిల్లీ మాత్రం ప్రభుత్వాల భారం మోస్తోంది. ఇక్కడ బహుళ ప్రభుత్వాలున్నాయి. ఒకటి.. తల్లి ప్రభుత్వం, మరొకటి కొడుకు ప్రభుత్వం, ఇంకొకటి అల్లుడి ప్రభుత్వం.

ఇవన్నీ కాకుండా.. సంకీర్ణ ప్రభుత్వం కూడా ఉంది.. ప్రధాని మన్మోహన్ సింగ్ దేశ పేదరికాన్ని మార్కెట్ చేసుకుంటూ అమెరికా అధ్యక్షుడు ఒబామా ముందు మోకరిల్లుతున్నారు'' ..బీజేపీ ప్రధాని అభ్యర్థి హోదాలో దేశరాజధానిలో ఆదివారం నిర్వహించిన తొలి భారీ ఎన్నికల సభలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోదీ అధికార కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడిన తీరు ఇది! 'ఎర్రకోట'పై నుంచి ప్రసంగించేందుకు తహతహలాడుతున్న మోదీ ఢిల్లీలో ఈ సభతో తన సత్తా చాటారు. స్థానిక జపనీస్ పార్క్‌లో జరిగిన ఈ సభకు లక్ష మందికి పైగా ప్రజలు హాజరయ్యారు. వారిని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ.. "2014లో భారతదేశానికి కావాల్సింది కలల బృందం (డ్రీమ్ టీమ్).. చెత్త బృందం (డర్టీ టీమ్) కాదు'' అని ఉద్ఘాటించారు.

మహిళలపై పెరిగిపోతున్న అత్యాచారాల నుంచి సామాన్యుడిని కుదేలు చేస్తున్న ధరా భారం, అవినీతి దాకా అన్ని అంశాలనూ ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌ను, యూపీఏ సర్కారును, మహిళలకు రక్షణ కల్పించలేకపోతున్న ఢిల్లీ ప్రభుత్వాన్ని, ప్రధానిని, పేరు ప్రస్తావించకుండా రాహుల్‌గాంధీ వైఖరిని చీల్చిచెండాడారు. కామన్‌వెల్త్ క్రీడల కుంభకోణంతో భారతదేశం తన విశ్వసనీయతను.. అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా చాటే అవకాశాన్ని, 'బ్రాండ్ ఇండియా' ఘనతను సాధించే అవకాశాన్ని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

దేశం ఇప్పుడు ప్రజాస్వామ్యానికి.. వంశ రాజకీయాలకూ నడుమ జరుగుతున్న యుద్ధానికి ప్రత్యక్షసాక్షిగా ఉందని వ్యాఖ్యానించారు. "ప్రభుత్వానికెప్పుడూ ఒక్కటే మతం ఉంటుంది...అది 'దేశమే ముందు' అనే మతం. ఒక్కటే పవిత్ర గ్రంథం ఉంటుంది.. అదే రాజ్యాంగం'' అన్నారు. బీజేపీని విశ్వసించాల్సిందిగా ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు. అయితే, ఈ ర్యాలీకి బీజేపీ అగ్రనేతలు ఎల్‌కే ఆడ్వాణీ, సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీ, ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ రాకపోవడం గమనార్హం. ఇంకా ఈ సభలో పలు అంశాలపై నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే...
మనదేశంలో అత్యంత సంతోషంగా ఉన్న ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే..ఢిల్లీ చీఫ్ మినిస్టరేనని నా ఉద్దేశం.

పొద్దుణ్నుంచీ సాయంత్రం దాకా.. రిబ్బన్లు కట్ (ప్రారంభోత్సవాలు) చేయడం తప్ప ఆమెకు వేరే పనేమీ లేదు. శాంతి భద్రతల సమస్య ఉంటే.. ఢిల్లీలో పోలీసు విభాగం కేంద్రం ఆధ్వర్యంలో ఉందంటూ తప్పును ఆమె కేంద్ర ప్రభుత్వంపైకి నెట్టేస్తారు. ఢిల్లీ రోడ్లపై గుంతలుంటే ఆ తప్పును మున్సిపల్ కార్పొరేషన్ పైకి నెట్టేస్తారు. ఇలా ఆమె నెపాన్ని పైవారి మీదికో..కిందివారి మీదికో నెట్టేస్తారు. మహిళలను రక్షించాల్సిన బాధ్యత ఢిల్లీ ముఖ్యమంత్రికి ఉంది. కానీ..ఆవిడేమో అత్యాచారాల నుంచి తప్పించుకునేందుకు ఆడపిల్లలందరూ త్వరగా ఇంటికి చేరాలని సలహా ఇస్తున్నారు.


ఆయన (ప్రధాని మన్మోహన్) పాకిస్థాన్ ప్రధానిని ఆత్మవిశ్వాసంతో కలుసుకోగలరా? ఘోరాతిఘోరంగా హత్యకు గురైన భారతీయ సైనికుల గురించి ప్రశ్నించగలరా అని సందేహంగా ఉంది. నవాజ్ షరీఫ్ మన ప్రధాని మన్మోహన్‌ను గ్రామీణ మహిళగా అభివర్ణించారు. మన్మోహన్ నవాజ్ షరీఫ్‌తో ఏం చెబుతారోనని దేశం భయపడుతోంది. 'మీరు నవాజ్ షరీఫ్‌తో ధైర్యంగా మాట్లాడగలరా లేరా' అని దేశం చూడాలనుకుంటోంది. ఎందుకంటే.. మీరు చాలా ఏళ్ల క్రితమే మాట్లాడ్డం మానేశారు. మిస్టర్ ప్రైమ్ మినిస్టర్! మన సైనికుల తలలు తెగనరకడంపై మీరు పాకిస్థాన్ పీఎంను నిలదీసి అడగాల్సిందే.

ప్రధాని గౌరవాన్ని ఆయన సొంతపార్టీనే దిగజార్చింది. ఈ పాపాన్ని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడే మూటగట్టుకున్నారు. ప్రధానిని కాంగ్రెస్ పార్టీయే గౌరవించకపోతే.. వేరెవరైనా ఎలా గౌరవిస్తారు?
ఈ దేశం రాజ్యాంగం ప్రకారం నడవాలా లేక యువరాజు ఇష్టాల ప్రకారం నడవాలా అనేది ప్రజలే తేలుస్తారు. యువరాజు ఆధ్వర్యంలో పనిచేయాలని ఉందని ప్రధాని ప్రకటించారు. నేను యూపీయేలోని సీనియర్లని ఒక ప్రశ్న అడుగుతున్నా..మీరు రాజ్యాంగం ప్రకారం పనిచేస్తారా లేక యువరాజు ఇష్టాలతోనా?

కమలంలో కల్లోలం!

కమలంలో కల్లోలం!

Published at: 01-10-2013 07:46 AM
 New  0  0 
 
 

సీమాంధ్ర, తెలంగాణ నేతల మధ్య విభజన
కేసీఆర్‌తో వేదిక పంచుకోవడంపై సీమాంధ్ర నేతల ఆగ్రహం
సీమాంధ్రలో దాడులను పట్టించుకోరా? అని నిలదీత
కిషన్‌రెడ్డి మనస్తాపం, రాజీనామాకు సంసిద్ధత!
పార్టీని మీరే నడుపుకోండంటూ ఆగ్రహం
రాజ్‌నాథ్‌తో టీ-నేతల భేటీ వాయిదా
నేడు ఢిల్లీకి సీమాంధ్ర నేతలు
హైదరాబాద్, సెప్టెంబర్ 30 : రాష్ట్ర విభజన వ్యవహారం బీజేపీలోనూ విభజనకు కారణమైంది! క్రమశిక్షణకు మారు పేరని చెప్పుకొనే కమలం పార్టీలోనూ చిచ్చు పెట్టింది! టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలు ఆ పార్టీలో తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి. పార్టీ జాతీయ అధ్యక్షుడిని కలిసే విషయమూ ఇరు ప్రాంతాల నేతల మధ్య విభేదాలకు కారణమైంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం రాష్ట్ర కోర్ కమిటీ సమావేశం జరిగింది. పార్టీ రామారావు, శేషగిరిరావు, ఇంద్రసేనారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఎమ్మెల్యేలు నాగం జనార్దన్ రెడ్డి, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సకల జన భేరిలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై చర్చ జరిగింది. 'ఆంధ్రోళ్లంతా తెలంగాణ ద్రోహులే' అన్న కేసీఆర్ వ్యాఖ్యలపై సీమాంధ్ర నేతలు మండిపడ్డారు. "తెలంగాణకు అనుకూలంగా బీజేపీ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం. సీమాంధ్రలో పార్టీ కార్యాలయాలపై దాడులు జరుగుతున్నా, పార్టీ సమావేశాలను అడ్డుకుంటున్నా.. భౌతిక దాడులకు పాల్పడుతున్నా.. పార్టీ నిర్ణయాన్ని ఎదిరించలేదు. ఆడ్వాణీ, రాజ్‌నాథ్ సింగ్, మోదీ తెలంగాణలోనే పర్యటించినా.. సర్దుకుపోయాం. కానీ, కేసీఆర్ వ్యాఖ్యలతో మా ప్రాంతంలో మరిన్ని అలజడులు రేగుతున్నాయి. ఆయన వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే కాకినాడ తదితర చోట్ల బీజేపీ కార్యాలయాలపై సమైక్యవాదులు దాడులు చేశారు.
సీమాం«ద్రులను రెచ్చగొడుతూ వ్యాఖ్యలు చేస్తున్న కేసీఆర్‌తో పార్టీ నేతలు వేదికను ఎలా పంచుకుంటారు!?'' అని నిలదీశారు. ఆంధ్రోళ్లంతా ద్రోహులే అని విమర్శిస్తుంటే పార్టీ నేతలు ఎందుకు ఖండించలేదని నిలదీశారు. అలాంటి నేతతో భవిష్యత్తులో వేదికను పంచుకోవద్దని కరాఖండిగా తేల్చి చెప్పారు. సీమాంధ్రలో పార్టీ కార్యాలయాలపై జరుగుతోన్న దాడులను ఎందుకు పట్టించుకోవడం లేదని పార్టీ అధ్యక్షుడిని నిలదీశారు. దీంతో, బీజేపీ ఇప్పటికే తెలంగాణ జేఏసీలో భాగస్వామ్య పార్టీ అని, అలాంటప్పుడు జేఏసీ ఆహ్వానిస్తే వెళ్లకుండా ఎలా ఉంటామని ప్రశ్నించారు. తెలంగాణ సాకారమవుతున్న వేళ ప్రతి వేదికపైనా పార్టీ వాణిని వినిపించాల్సిన అవసరం ఉందని, అప్పుడే పార్టీకి తెలంగాణలో ఆదరణ పెరుగుతుందని వాదించారు. కేసీఆర్ అలాంటి వ్యాఖ్యలు చేస్తారని తాము ఊహించలేదు కదా అని అన్నారు. భవిష్యత్తులో ఆయనతో వేదికను పంచుకోవద్దంటే జేఏసీ నుంచి వైదొలగాల్సి వస్తుందని చెప్పారు. అలాంటి పరిస్థితే వస్తే.. ఇప్పటిదాకా జేఏసీతో కలిసి పోరాడి తెలంగాణను తెచ్చుకుంటున్న దశలో పార్టీ ఇమేజ్‌ను దెబ్బతీసుకున్నవాళ్లమవుతామని చెప్పారు.
జాతీయ నేతలతో భేటీపై..
పార్టీ జాతీయ నేతలను కలిసి సమస్యలు వినిపించే విషయంపైనా ఇరు ప్రాంతాల నేతల మధ్య విభేదాలు తలెత్తాయి. ఇరు ప్రాంతాల నేతలకు రాజ్‌నాథ్‌సింగ్ బుధవారం అపాయింట్‌మెంట్ ఇచ్చారు. కోర్ కమిటీ భేటీలో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. సీమాంధ్ర సమస్యలను పరిష్కరించిన తర్వాతే పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెడితే పార్టీ మద్దతు ఇవ్వాలని ఆ ప్రాంత నేతలు జాతీయ నాయకులను కోరాలని అనుకున్నారు. కానీ, పార్లమెంటులో బిల్లుకు బేషరతుగా మద్దతు ఇస్తామని రాష్ట్ర, జాతీయ నేతల పలుమార్లు ప్రకటించారని, ఇప్పుడు కండీషన్లు పెడితే ఎలా అని తెలంగాణ నేతలు ప్రశ్నించారు. ఇరు ప్రాంతాల నేతలు ఎవరి వాదనకు వారు కట్టుబడి ఉండడంతో.. కిషన్‌రెడ్డి తీవ్ర మనస్తాపం చెందారు. "అటు సీమాం«ద్ర నేతలు నన్నే తప్పు పడుతున్నారు. ఇటు తెలంగాణ నేతలు పట్టు విడవడం లేదు. ఒకే పార్టీలో రెండు అభిప్రాయాలుంటే ఎలా!? జాతీయ నేతలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఇన్ని జంఝాటాల మధ్య అధ్యక్షుడిగా కొనసాగలేను. పార్టీని మీరే నడుపుకోండి'' అంటూ కాస్త తీవ్రంగానే స్పందించినట్లు తెలిసింది. ఒక దశలో రాజీనామా చేయడానికి సిద్ధపడినట్లు సమాచారం. కానీ, ఇరు ప్రాంతాల నేతలు శాంతించడంతో ఆయన వెనక్కి తగ్గారని తెలిసింది.
తెలంగాణ నేతల ఢిల్లీ టూర్ వాయిదా
ఢిల్లీలో జాతీయ నేతలను బుధవారం కలిసి తెలంగాణ బిల్లును త్వరలో పెట్టించాలంటూ కోరాలనుకున్న తెలంగాణ నేతల టూర్ వాయిదా పడింది. సీమాంధ్ర, తెలంగాణ నేతలకు 2నే రాజ్‌నాథ్ సింగ్ అపాయింట్‌మెంట్ ఇచ్చిన నేపథ్యంలో, ఇరు ప్రాంతాల నేతలు ఒకేసారి వెళితే విభేదాలు ఢిల్లీదాకా వెళతాయన్న కారణంతో తెలంగాణ నేతలను ఇతర నేతలు సముదాయించినట్లు సమాచారం. దీంతో, వారు 2న కాకుండా ఆ తర్వాత వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే, సీమాంధ్ర నేతలు మాత్రం అక్టోబరు ఒకటో తేదీ (మంగళవారం) ఉదయమే బయలుదేరి ఢిల్లీ వెళుతున్నారు. 2న జాతీయ నేతలను కలుస్తారు. సీమాంధ్ర ఉద్యమ కమిటీ చైర్మన్ యడ్లపాటి రఘునాథ్‌బాబు ఆధ్వర్యంలో సీమాంధ్రలోని రాష్ట్ర పదాధికారులు, జాతీయ కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, ఇన్‌చార్జిలు కలిసి ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించారు. రాజ్‌నాథ్‌సింగ్, ఆడ్వాణీలను కలవాలని, వీలైతే సుష్మా స్వరాజ్‌ను కూడా కలవాలని నిర్ణయించారు.
విజయవాడ, విశాఖ, తిరుపతి, అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి పలువురు సీమాంధ్ర నేతలు ఢిల్లీ బయలుదేరారు. సుష్మా స్వరాజ్ తెలంగాణకు పూర్తి అనుకూలంగా ఉన్నందున ఆమెపై ఒకింత గుర్రుగా ఉన్న సీమాంధ్ర నేతలు.. కలవాలా వద్దా అన్న మీమాంసలో ఉన్నట్లు ఆ ప్రాంత నేత ఒకరు చెప్పారు. జాతీయ నేతలను కలిసి సీమాంధ్ర ప్రయోజనాలు, సమస్యలు పరిష్కరించాకే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టేలా చూడాలని వారు కోరనున్నారు. కాగా, పాలమూరులో సుష్మా స్వరాజ్ ఏకపక్షంగా మాట్లాడి సీమాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీశారని ఆ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్య నాయకులు విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర అధికార ప్రతినిధి పాకా వెంకట సత్యనారాయణ సోమవారం భీమవరంలో విలేకర్లతో మాట్లాడారు. బీజేపీ నిర్ణయం ప్రకారమే సుష్మ మాట్లాడినా.. విభజనతో సీమాంధ్రులకు అన్యాయం జరుగుతుందని కూడా చెప్పకుండా ఏకపక్షంగా హైదరబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం తీవ్ర ఆవేదన కలిగించిందని శ్రీనివాసవర్మ చెప్పారు.
 
- See more at: http://www.andhrajyothy.com/node/5752#sthash.SHJbsqcH.dpuf

జనభేరి కాదు ..దొరల భేరి : దిలీప్‌కుమార్

జనభేరి కాదు ..దొరల భేరి : దిలీప్‌కుమార్

Published at: 01-10-2013 06:18 AM
 New  0  0 
 
 

గోదావరిఖని, సెప్టెంబర్ 30 : తెలంగాణ జేఏసీ ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన సకల జన భేరి.. వాస్తవంలో దొరల భేరిగా మారిందని టీఆర్ఎల్‌డీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్ విమర్శించారు. సభ ఆద్యంతం వ్యక్తి భజనగా సాగిందని, బడుగు, బలహీన వర్గాల నాయకులు లేకుండా సభ ఎలా నిర్వహిస్తారని సోమవారం కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో ప్రశ్నించారు. అరుణోదయ విమలక్క, ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణమాదిగ, ప్రజా గాయకుడు గద్దర్ లేకుండా సభ నిర్వహించడం తీవ్ర ఆక్షేపణీయమన్నారు. ఈ విషయంలో జేఏసీ చైర్మన్ కోదండరాం తన వైఖరి మార్చుకోవాలని, జేఏసీని పునర్ వ్యవస్థీకరించాలని డిమాండ్ చేశారు. ఇదంతా చూస్తుంటే దొరల తెలంగాణ వస్తుందేమోనన్న అనుమానం వ్యక్తమవుతుందని వ్యాఖ్యానించారు.
- See more at: http://www.andhrajyothy.com/node/5504#sthash.GnFTUgrb.dpuf

సమైక్య శంఖారావం - JAGAN

హైదరాబాద్‌లో సమైక్య శంఖారావం

Published at: 01-10-2013 07:40 AM

 New  0  0 

 



ఓట్ల కోసం కాంగ్రెస్, టీడీపీలే కుమ్మక్కు
లౌకిక పార్టీలకే మా మద్దతు
హిందూత్వ ముసుగు తొలగిచుకుంటే
మోదీతో పొత్తుకు ఆలోచిస్తాం: వైఎస్ జగన్
గవర్నర్‌తో భేటీ, వెంటనే అసెంబ్లీ సమావేశానికి వినతి
హైదరాబాద్, సెప్టెంబర్ 30: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తో అక్టోబర్ 15, 20 తేదీల మధ్య హైదరాబాద్‌లో సమైక్య శంఖారావం పేరిట భారీ సభ నిర్వహిస్తామని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తెలిపారు. తాను ఎక్కడకీ వెళ్లకుండా కట్టడి చేస్తున్నా ప్రజల హృదయాల్లోనుంచి మాత్రం తీసేయలేరని వ్యాఖ్యానించారు. సమైక్యం కోరే పార్టీలు తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. టీడీపీసహా విభజనకు సహకరించిన పార్టీలను ప్రశ్నించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం ఆయనిక్కడ మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్‌తో డీల్‌పై..
కాంగ్రెస్‌తో కుమ్మక్కువల్లే తనకు బెయిల్ వచ్చిందన్న కథనాలను జగన్ కొట్టిపారేశారు. డీల్ జరిగితే మూడు నెలల్లో రావాల్సిన బెయిల్‌కు 16 నెలలు ఎందుకు పడుతుందని ప్రశ్నించారు. తనను ఎక్కువ కాలం జైల్లో ఉంచాలనే చార్జిషీట్లు వేయడానికి సీబీఐ 16 నెలలు తీసుకున్నదని ఆరోపించారు.
లౌకిక వాదానికే మద్దతు..
తాను లౌకిక వాదినని, తమ పార్టీ లౌకికవాద పార్టీలకే మద్దతిస్తుందని చెప్పారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ హింతూత్వ ముసుగు తొలగిస్తే ఆలోచిస్తామన్నారు. పాలనాదక్షుడిగా మోదీకి మంచి పేరుందని ప్రశంసించారు. అయితే హిందూత్వ ముద్రనుంచి బయటపడాలన్నారు. లౌకికవాదిగా నిరూపించుకోవాలని, ఇతర మతవర్గాల్లో అభద్రత భావాన్ని తొలగించాలని సూచించారు. దేశంలో లౌకికపార్టీలైన కమ్యూనిస్టులు, జనతాదళ్‌లాంటివి కలసివస్తే ఆ దిశగా కూడా ఆలోచిస్తామని చెప్పారు.
అసెంబ్లీలో తీర్మానం చేద్దాం..
సమైక్యంపై తీర్మానం చేసేందుకు అసెంబ్లీని సత్వరం సమావేశపరచాలని కోరుతూ గవర్నర్ నరసింహన్‌కు లేఖ ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర విభజనపై కేబినెట్ నోట్ రూపొందక ముందే అసెంబ్లీని సమావేశపరచి సమైక్యంపై తీర్మానం చేసి కేంద్రానికి పంపుదామన్నారు. దీంతో కేంద్రం కాస్త వెనకడుగు వేస్తుందని చెప్పారు. దీనివల్ల దేశంలోని ఇతర పార్టీలూ కేంద్రంపై ఒత్తిడి తెస్తాయని వివరించారు. కేబినెట్ నోట్ అసెంబ్లీకి వచ్చి న తర్వాత చర్చిస్తే ఉపయోగం ఉండదని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర సమైక్యతపై వైసీపీ, సీపీఎం, ఎంఐఎం మినహా మిగతావి నిజాయతీ, నిబద్ధతతో పనిచేయడంలేదని విమర్శించారు. రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ నిర్ణయిస్తే.. టీడీపీ అధినేత చంద్రబాబు మద్దతు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. ఈ రెండు పార్టీలు ఓట్లు, సీట్ల కోసమే అన్నట్టు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ఓ తండ్రికి కూతురు, కొడుకు ఉంటే వారిలో ఎవరికీ అన్యాయం జరగకుండా చూడాలని, భవిష్యత్‌లో వారెప్పుడూ ప్రశ్నించకుండా వ్యవహరించాలని సూచించారు. న్యాయం చేయలేకపోతే వదిలేయాలన్నారు.
విడిపోతే సమస్యలు..
రాష్ట్రం సమైక్యంగా ఉనప్పుడే నదీజలాల కోసం కొట్లాడుకునే పరిస్థితి ఉంటే.. మరో రాష్ట్రం ఏర్పడితే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చని వ్యాఖ్యానించారు. విభజిస్తే రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో 8జిల్లాలు.. కృష్ణాజలాల కోసం కొట్టుకుంటాయని వివరించారు. కుప్పం నుంచి శ్రీకాకుళం వరకూ మంచి నీరు దొరికే పరిస్థితి లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తామంటున్నారని, దానికి నీళ్లెలా వస్తాయని ప్రశ్నించారు. హైదరాబాద్ నుంచి 50 శాతం బడ్జెట్ వస్తుంటే.. దాన్ని వదిలిపెట్టి పోయి మరో నగరాన్ని కట్టుకోవాలని అడ్డగోలుగా చెప్పడం ఏమిటని మండిపడ్డారు. సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని తెలంగాణలోని ప్రతి సోదరుడికి తాను వివరించగలనన్నారు. ఇది చేసి చూపించిన సత్తా వైఎస్ రాజశేఖరరెడ్డిదేనని చెప్పారు. తెలంగాణను అభివృద్ధిచేసే లక్ష్యంతోనే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు వైఎస్ రూపకల్పన చేశారని చెప్పారు. రాష్ట్రంలో 60 శాతం ప్రజలు రోడ్డెక్కి తమకు అన్యాయం జరిగిందంటూ 60 రోజులుగా ఉద్యమిస్తుంటే కేంద్రానికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.
అంతా ప్రజలకు తెలుసు..
కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నానని తనవైపు వేలు చూపిస్తున్నారని.. ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో ప్రజలు గమనించాలని జగన్ కోరారు. తనపైనా, తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపైనా కాంగ్రెస్‌కు చెందిన శంకర్రావు కేసు వేస్తే.. దానికి మద్దతుగా టీడీపీ నేతలు పిటిషన్లు దాఖలు చేశారని గుర్తు చేశారు. కాంగెస్ర్, టీడీపీ కుమ్మక్కై తనపై సీబీఐ దర్యాప్తు జరిగేందుకు కారణమైనట్లు జగన్ ఆరోపించారు. విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ తమ పార్టీ అవిశ్వాస తీర్మానం పెడితే ప్రభుత్వాన్ని చంద్రబాబే కాపాడారని గుర్తు చేశారు. ఎఫ్‌డీఐలకు సంబంధించి రాజ్యసభలో బిల్లు ప్రవేశపెడితే తన పార్టీ ఎంపీలను చంద్రబాబు హాజరు కానివ్వలేదన్నారు. రాష్ట్ర విభజన చేస్తుంటే లేఖ ఇచ్చి మౌనంగా కూర్చున్నారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డితోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

- See more at: http://www.andhrajyothy.com/node/5748#sthash.o0GTjgU5.dpuf

టీడీపీ లేఖతోనే తెలంగాణపై నిర్ణయం

టీడీపీ లేఖతోనే తెలంగాణపై నిర్ణయం

Published at: 01-10-2013 06:20 AM
 
పచ్చపార్టీ ఉచ్చ తాగే 

ఇంతదూరం
పదవి, పైసలు ఇవ్వలేదని నీ అక్కసు
గద్దర్, మందకృష్ణను పిలవలేదు
కేసీఆర్‌పూ మోత్కుపల్లి, ఎర్రబెల్లి, రేవంత్ ఫైర్
కరీంనగర్/హైదరాబాద్, సెప్టెంబర్ 30 (ఆంధ్రజ్యోతి): టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తెలుగుదేశం పార్టీ నేతలు మోత్కుపల్లి నర్సింహులు, ఎర్రబెల్లి దయాకర్ రావు, అనుముల రేవంత్ రెడ్డి సోమవారం వేర్వేరు వేదికలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు కరీంనగర్‌లో జిల్లాస్థాయి పార్టీ కార్యకర్తల భేటీలో టీ-టీడీపీ ఫోరం నేత మోత్కుపల్లి మాట్లాడుతూ... "బిడ్డా కేసీఆర్.. తెలంగాణ ఎలా వచ్చింది? నువ్వడిగితే ఇచ్చా రా? టీడీపీ లేఖ ఇస్తేనే ఇచ్చారు. నీది తోక పార్టీ. నీ దుకాణం బంద్ అయ్యింది. పచ్చ పార్టీ ఉచ్చ తాగితేనే ఇంత దూరం వచ్చావు. నువ్వు వలసవాదివి. తెలంగాణ రావద్దనే ఆం«ద్రులను రెచ్చగొడుతున్నావు'' అని నిప్పులు చెరిగారు. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన సకల జనభేరి సభలో కేసీఆర్ భాష, మాటలను అందరూ విన్నారని ఆయన గుర్తుచేశారు. "ఒకరోజు మంత్రి పదవి ఇవ్వకుంటే పంచాయతీ పెట్టావు, మరొక రోజు.. పొత్తు కుదిరినప్పుడు పైసలు ఇవ్వకుంటే పక్కకు జరిగావు. బిడ్డా కేసీఆర్.. తెలంగాణలో నీ దుకాణం బంద్ అ య్యింది'' అని దుయ్యబట్టారు. చంద్రబాబు లేఖ ఇచ్చేవరకూ తెలంగాణపై కేంద్రంలో కదలిక లేదన్నారు.
సకల జనభేరి సభకు గద్దర్, మంద కృష్ణమాదిగ, అమరవీరుల కుటుంబాల సభ్యులను ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. తాము లేఖ ఇచ్చిన తర్వాతే కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నదని, దీన్ని కాదంటున్న కేసీఆర్ 2009లో తమతో పొత్తు ఎందుకు పెట్టుకున్నాడని ప్రశ్నించారు. ఆ ఎన్నికల్లో రూ.200 కోట్లు డిమాండ్ చేశాడని, పైసలు ఇవ్వకపోవడంతో సీట్లను కోట్లకు అమ్ముకున్నాడని ఆరోపించారు. విజయనగరం జిల్లానుంచి వలస వచ్చిన కేసీఆర్.. ఇంత త్వరగా తన దుకాణం బంద్ అవుతుందని ఊహించి ఉండడని మోత్కుపల్లి ఎద్దేవా చేశారు. అందుకే ఆంధ్రోళ్లను రెచ్చగొట్టేలా ప్రసంగిస్తూ తెలంగాణను అడ్డుకోవడానికి యత్నిస్తున్నాడని విమర్శించారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెడితే ఎవరు అడ్డు పడుతున్నారో తేలుతుందని టీ-టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇదే సభలో అన్నారు. కాంగ్రెస్‌లో టీఆర్ఎస్‌ను విలీనం చేయనందు కే సీడబ్ల్యూసీ తీర్మానం చేసి 60 రోజులు గడుస్తున్నా బిల్లు మాటెత్తడం లేదన్నారు.
'సమైక్య ఉద్యమంలో సీమాంధ్ర నేతలు అలసిపోయి కూర్చుంటే కేసీఆర్ రంగంలో దిగి, బండ బూతులతో వారిని లేపి కూర్చోబెడుతున్నారని టీడీపీ అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయనిక్కడ విలేకరులతో మా ట్లాడారు. కేసీఆర్ తిట్లు, శాపనార్థాలతో తమ ఉద్యమాన్ని బతికిస్తున్నందుకు సీమాంధ్ర నేతలు సన్మానిస్తారేమోనని ఎద్దేవా చేశారు. 'ఆంధ్రలో పుట్టినవాళ్లంతా ద్రోహులంటున్నారు. మరి తెలంగాణ కావాలంటున్న వెంకయ్యనాయుడు, సీపీఐ నారాయణ కూడా ద్రోహులేనా? సఖ్యతగా విడిపోదామంటూనే వా రిని రాక్షసులని తిట్టడం ఎందుకు? ఇంతవరకూ ఒక్క అడుగు ముందుకు వేయని సోనియాను ఒక్కమాట అనవేం? నిజంగా తెలంగాణ వస్తే ఫాం హౌస్‌లో టెంకాయలు, వంకాయలు అమ్ముకోవాలని కేసీఆర్ భయం. కాబట్టే విభజన ప్రకటన వచ్చిన రోజు ఆయన మొహం తుఫాన్లో సర్వం కోల్పోయినవాడిలా, దివాలా తీసిన వాడి మాదిరిగా ఉంది' అని ఎద్దేవా చేశారు.
- See more at: http://www.andhrajyothy.com/node/5509#sthash.G3UQj9Pu.dpuf

కేసీఆర్‌పై విమర్శల భేరి!

కేసీఆర్‌పై విమర్శల భేరి!

Published at: 01-10-2013 06:22 AM
ప్రజలను అవమానించడం సరికాదు : నారాయణ
సీమాం«ద్రులంతా ద్రోహులా? :దత్తాత్రేయ
మీ జాతకం చూసుకోండి
(ఆంధ్రజ్యోతి, న్యూస్ నెట్‌వర్క్)
సకల జన భేరి వేదికగా గులాబీ దళపతి కేసీఆర్ చేసి న ప్రసంగంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీమాంధ్ర ప్రజలనుద్దేశించి ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలను..తెలంగాణకు గట్టి మద్దతు ఇస్తున్న సీపీఐ, బీజేపీ సైతం ఆక్షేపించగా, కేసీఆర్ తీరును కాంగ్రెస్ పార్టీ ఘా టుగా దుయ్యబట్టింది. "ఆంధ్రా ప్రజలు దోపిడీదారులం టూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. తెలంగాణ కోరుకునే నాయకుడు మాట్లాడే మా టలు కావవి'' అని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు బం డారు దత్తాత్రేయ హైదరాబాద్‌లో ధ్వజమెత్తారు. ప్రాం తాలే విడిపోతున్నాయి కానీ ప్రజలు కాదన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. సభ బాగా జరిగినా, లంకలో పుట్టినోళ్లు రాక్షసులని, సీమాంధ్రలో పుట్టినోల్లు తెలంగాణ ద్రోహులని కేసీఆర్ అనడం సరిగా లేదని కడపలో విమర్శించారు. "నాయకులు చేసిన తప్పులకు ప్రజలను అవమానించడం సరికాదు. తెలంగాణ ఏర్పాటుకు సానుకూలత ఏర్పడుతున్న దశలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికాదు'' అన్నారు. రాజీనామాలు చేస్తే ఓటింగ్‌లో ఓడిపోతామంటున్నారని, అసలు అసెంబ్లీలో తీర్మానమే ఉండనప్పుడు ఓటింగ్ ఎలా ఉంటుందని ప్రశ్నించారు. అలాగే..హైదరాబాద్ కేసీఆర్ అబ్బసొత్తు గానీ, లగడపాటి అబ్బసొత్తు కాదన్నారు.
విభజన ప్రకటన వెలువడి ఇన్ని రోజులవుతున్నా సోనియా, మన్మోహన్‌లు వంకాయలు కోసుకుంటున్నారా అని ప్రశ్నించారు. అలాగే.. కేసీఆర్ తీరును సీపీఐ కార్యవర్గం ఓ ప్రకటనలో ఖండించింది. ఇలాంటి వ్యాఖ్యల వల్ల ప్రాంతీయ వైషమ్యాలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి జాతకం కేసీఆర్‌కు అనవసరమని, ముందు ఆయన జాతకం చూసుకుంటే మంచిదని ఏఐసీసీ ప్రతినిధి రేణుకా చౌదరి ఖమ్మంలో ఘాటుగా వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కేసీఆర్‌కు ఇష్టం లేదని తెలంగాణ-సీమాంధ్ర జేఏసీ చైర్మన్, లంబాడి హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు తేజావత్ బెల్లయ్యనాయక్ విమర్శించారు. నోటి దాకా వచ్చిన తెలంగాణను దూరంగా నెట్టేయడానికే ఆయన ఇలాంటి దుందుడుకు వ్యాఖ్యలకు దిగుతున్నారని హైదరాబాద్‌లో ఆయన మండిపడ్డారు. "తన రెచ్చగొట్టే వ్యాఖ్యలతో కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ఆరాచక వాదంలోనికి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్ర పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడడం కోసమే కేసీఆర్ ఉద్యమిస్తున్నారు. ఆయన పోరాటానికి సిద్ధాంతపరమైన రాజకీయ పునాది లేదు. అక్టోబర్ 5న బషీర్‌బాగ్‌లోని ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ ఉద్యమంలో నిజమైన ఉద్యమకారులు, విద్యార్థి, కార్మిక, యువజన వర్గాలను తిరిగి ఒక వేదిక మీదకు తెస్తామని వెల్లడించారు.

http://www.andhrajyothy.com/node/5519#sthash.QT0Wo2Qh.dpuf

న.మో.నమః

న.మో.నమః

  • 29/09/2013
  •  వడ్డమాని సుందరరామశాస్ర్తీ sastryvsr@gmail.com
‘దేశ్ కా నేతా కైసా హై... రాజీవ్‌గాంధీ జైసా హై’ అని 1980లలో కాంగ్రెస్ వారు నినదించేవారు. కానీ ఇపుడు మన్మోహన్ సారును, రాహుల్ బాబును చూశాక, దేశ ప్రజానీకం ‘నరేంద్రమోడీ జైసా హై’ అని నినదించే పరిస్థితి వచ్చింది. ఈ దేశానికి ఓ సామ్యవాది ప్రధాని కావచ్చని నెహ్రూ నిరూపించాడు. ఓ సామాన్యుడు ప్రధాని కావచ్చని లాల్‌బహదూర్ శాస్ర్తీ నిరూపించాడు. ఓ మహిళ ప్రధాని కావచ్చని ఇందిరాగాంధీ నిరూపించింది. ఓ నవ యువకుడు ప్రధాని కావచ్చని రాజీవ్‌గాంధీ నిరూపించాడు. ఓ సమితి ప్రెసిడెంటు స్థాయి కాంట్రాక్టరు ప్రధాని కావచ్చని దేవెగౌడ నిరూపించాడు. ఓ బ్రాహ్మణుడు ప్రధాని కావచ్చని వాజ్‌పేయి నిరూపించాడు. అసలు ఈ దేశానికి ప్రధానమంత్రే అక్కర్లేదని మన్మోహన్ సింగ్ నిరూపించాడు - ఇదీ ఇటీవల ఫేస్‌బుక్‌లో ఒక విశే్లషణ. పైకి చూడడానికి ఇది సరదాగా చేసిన వ్యాఖ్యలాగా ఉన్నా, ఇందులో లోతైన ఫిలాసఫీ ఉంది. గత 9-10 సంవత్సరాలుగా ఉన్నా.. లేనట్టుగా ఉన్న ప్రధాని మన్మోహన్ స్థానే ఈ విశాల భారతదేశానికి దమ్మున్న, సమర్థుడైన ఓ మోడీ లాంటి వాడు ప్రధానమంత్రిగా రావాలని ప్రజానీకం మనసులో బీజం పడ్డట్టు కనిపిస్తోంది. బిజెపి అంటే హిందూత్వం, రామమందిరం. కమల దళంపై దేశంలో సగటు ఓటర్ల అభిప్రాయం ఇదే. కాలక్రమేణా అలాంటి అభిప్రాయాలు మారుతున్నాయి. బిజెపి అంటే అభివృద్ధి, సుపరిపాలన.. బిజెపి అంటే మోడీ అనే పరిస్థితి వచ్చింది. అందుకే అగ్రనేత అద్వానీ కాదన్నా, అంతర్గతంగా ఎంతమంది వ్యతిరేకించినా, సంఘ్ పరివార్ మోడీకే పట్టం కట్టింది. అయితే ఎవరి దయా దాక్షిణ్యాల వల్లనో, వారసత్వంగానో మోడీ ఈ స్థాయికి చేరలేదు. స్వశక్తినే నమ్ముకొని పట్టుదలతో ఎన్నో ఏళ్లు చేసిన కృషి ఫలితంగానే మోడీ దేశ అత్యున్నత పీఠం వైపు దూసుకెళ్తున్నాడు. మన్మోహన్ సింగ్ లాంటి సెలెక్టెడ్ పీఎంల స్థానంలో మోడీ లాంటి ఎలెక్టెడ్ పీఎంను భారతదేశంలో త్వరలో చూడబోతోందని చెప్పుకోవచ్చు. సాధారణ ఆరెస్సెస్ కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించిన మోడీ బిజెపి ప్రధాని అభ్యర్థి స్థాయికి చేరడానికి ఎన్నో అవాంతరాలు అధిగమించారు. దశాబ్దం క్రితం కేశూభాయ్ పటేల్ నుంచి నరేంద్ర మోడీ గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్రం తీవ్ర సంక్షోభంలో ఉంది. భూకంపం దెబ్బతో తీవ్రంగా నష్టపోయి.. ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రాన్ని తనదైన శైలిలో మోడీ అభివృద్ధి పథంలో నడిపించారు. భూకంపంతో నష్టపోయిన ప్రాంతాల పునర్నిర్మాణంతోపాటు, బాధితులకు పునరావాసం, ఆర్థికంగా చేయూత అందించి పరిస్థితులను గాడిలో పెట్టడంతో మోడీ పరిపాలనా దక్షత మొదటిసారి వెలుగులోకి వచ్చింది. గోద్రా ఘటన తర్వాత గుజరాత్‌లో చెలరేగిన మత ఘర్షణలతో మోడీపై కరడుగట్టిన హిందూత్వ వాది అనే ముద్ర పడిపోయింది. మత రాజకీయాలు చేస్తున్నారని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. గుజరాత్ సీఎం పదవి నుంచి తప్పించాలని అప్పటి ప్రధాని వాజ్‌పేయి భావించడంతో మోడీ ప్రస్థానం ముగిసిందని అంతా అనుకున్నారు. అయితే అద్వానీ అండగా నిలవడంతో మోడీ ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగింది. గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో ఐరోపా సమాఖ్య దౌత్యాధికారులందరూ మోడీతో సమావేశాలు నిషేధించారు. అమెరికా మోడీకి వీసా నిరాకరించింది. ఈ పరిణామాలతో మోడీ తన వ్యూహాలకు మరింత పదును పెట్టారు. జాతీయ స్థాయిలోనే కాక అంతర్జాతీయంగా తనపై పడిన ముద్రను చెరిపేసుకుని, సానుకూలత సాధించాల్సిన అవసరంపై దృష్టి పెట్టారు. గోద్రా అనంతర మత ఘర్షణల తర్వాత దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన విమర్శలతో ఎన్నికలకు వెళ్లిన మోడీ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా- కాంగ్రెస్ హైకమాండ్ ఎంత ప్రయత్నించినా గుజరాత్‌లో మోడీ ప్రభంజనాన్ని అవి అడ్డుకోలేక పోయాయి. 2007, 2012 ఎన్నికల్లోనూ బిజెపిని విజయపథంలో నడిపించి మోడీ హ్యాట్రిక్ సాధించాడు. ఈ అప్రతిహత విజయాలే ప్రధాని అభ్యర్థిత్వానికి బలమైన పునాది వేశాయి. గుజరాత్ అల్లర్ల విషయంలో జాతీయ స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న మోడీ వాటన్నింటికీ అభివృద్ధితోనే సమాధానమిచ్చారు. అభివృద్ధి కార్యక్రమాలపై సత్వర నిర్ణయాలు, దృఢమైన వైఖరితో మోడీ గుజరాత్‌లో పారిశ్రామికాభివృద్ధిని పరుగులు పెట్టించారు. పరిశ్రమలకు సులభంగా అనుమతులు కల్పించటం, వౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, కోతలు లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయడంతో రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోయింది. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. ఒకప్పుడు ఉద్యోగ, వ్యాపారాల కోసం ముంబై బాట పట్టే గుజరాతీలకు ఇప్పుడు సొంత రాష్ట్రంలోనే అపారమైన అవకాశాలు పుట్టుకొచ్చాయి. ఇలా వాణిజ్య, వ్యాపార వర్గాలతోపాటు యువత, మధ్యతరగతి ప్రజల మన్ననలు పొందారు. జాతీయ స్థాయి విమర్శలు ఎదుర్కొని తన చేతలతో వాటిని దీటుగా తిప్పికొట్టడంతో మోడీకి దేశవ్యాప్తంగా పాపులారిటీ పెరిగింది. జాతీయ మీడియా మోడీపై సాగించిన వ్యతిరేక ప్రచారం కూడా ఆయన పాపులారిటీని పెంచడంలో గణనీయ పాత్ర పోషించిందని చెప్పుకోవచ్చు. మోడీపై హిందూత్వ ముద్ర ఆయన్ను దమ్మున్న నేతగా ఆవిష్కరించింది. ప్రతిపక్షాల సూడో సెక్యులరిజం విధానాలు సైతం ఈ దళపతికి కలిసొచ్చాయి. మరోవైపు విధాన నిర్ణయాల్లో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు యూపీఏ ప్రతిష్ఠను మసకబార్చాయి. ముఖ్యంగా యూపీఏ రెండోసారి అధికారంలోకి వచ్చాక బయటపడిన కుంభకోణాలు, అవినీతి బాగోతాలతో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. మోడీయే సరైన ప్రత్యామ్నాయమనే భావన మొగ్గ తొడిగింది. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం కనీస చర్యలు చేపట్టలేదు. ఈ పరిస్థితికి తోడు బడా పారిశ్రామికవేత్తలు, విదేశీ పెట్టుబడిదారులకు అనుకూల నిర్ణయాలతో ముందుకెళ్తున్న కేంద్రం.. వంటగ్యాస్, పెట్రోలు ఇతర నిత్యావసరాలపై సబ్సిడీలను తగ్గించుకుంటూ వస్తోంది. ఈ పరిస్థితులతో విసిగిపోయిన సామాన్య, మధ్యతరగతి ప్రజలు యూపీఏపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గళమెత్తిన మోడీ.. జాతీయ స్థాయిలో అన్ని వర్గాల ప్రజలను విశేషంగా ఆకట్టుకొన్నారు. యూపీఏ ప్రభుత్వానికి సరైన ప్రత్యామ్నాయం తానేనని ప్రజలను ఒప్పించి మెప్పించగలిగారు. ప్రస్తుత ప్రధాని మన్మోహన్ సింగ్ గానీ, కాంగ్రెస్ భవిష్యత్ ప్రధానిగా భావిస్తున్న రాహుల్‌గాంధీ కానీ.. నరేంద్ర మోడీకి కనీస పోటీ కూడా కాదని కాంగ్రెస్‌కు కూడా ఇపుడిపుడే అర్థమవుతోంది. విగ్రహంలో అయినా, వాక్చాతుర్యంలో అయినా.. అనుభవంలో అయినా, కాంగ్రెస్ వారసుడి కంటే తాను అనేక రెట్లు మిన్న అని మోడీ నిరూపించుకున్నారు. మాటలతోపాటు గుజరాత్‌లో మోడీ చేతలు కూడా ప్రజలకు ఆయనపై విశ్వాసాన్ని పెంచాయి. ఇక బిజెపిలో జాతీయ స్థాయిలో మోడీని ఢీకొట్టగల మరో నాయకుడు లేకపోవడం ఆయనకు బాగా కలిసొచ్చింది. పార్టీకి భీష్మ పితామహుడి వంటి అద్వానీ మాత్రమే మోడీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని సవాల్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అద్వానీ కంటే, మోడీ సారథ్యంలో ఎన్నికలకు వెళ్తేనే పార్టీకి శ్రేయస్కరమనే భావన వ్యక్తమైంది. బిజెపిలో సామాన్య కార్యకర్తల దగ్గర్నుంచి పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ వరకూ అత్యధికులు మోడీకే ఓటేయడంతోపాటు.. ఆరెస్సెస్ నాయకులు కూడా మోడీ కోసం పట్టుబట్టడంతో అద్వానీ వగైరాల అభ్యంతరాలన్నీ కొట్టుకుపోయాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా మోడీ హవా స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా విచక్షణాయుత ఓటర్లు మోడీకి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడాలి అనే ఆలోచనలో ఉన్నారు. జాతీయ మీడియాలో వస్తున్న సర్వేల ఫలితాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ప్రధాని మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీల కంటే మోడీకే అత్యధికులు మద్దతిస్తున్నారు. అయితే ప్రజల్లో ఉన్న మోడీ ప్రభంజనం బిజెపికి ఓట్లు కురిపిస్తుందా అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. మోడీకి మద్దతిస్తున్న వాళ్లంతా బిజెపి కార్యకర్తలు, అభిమానులు కాదు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లను అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. స్థానిక అంశాలు, కులం, మతం, వర్గం, ప్రాంతం వంటివి కూడా ఎన్నికల్లో అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయిస్తాయి. బిజెపి ప్రచార సారధిగా, ప్రధాని అభ్యర్థిగా ఎన్నికైన నరేంద్ర మోడీకి.. త్వరలో జరగనున్న 5 రాష్ట్రాల ఎన్నికలు మొదటి సవాల్ విసరనున్నాయి. ఐదు రాష్ట్రాల్లో మిజోరాంను మినహాయిస్తే మిగిలిన 4 రాష్ట్రాల్లోనూ ప్రధాన ప్రత్యర్థులు బిజెపి, కాంగ్రెస్ పార్టీలే. ఈ నాలుగు రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్‌లో బిజెపి అధికారంలో ఉండగా, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాలు కాంగ్రెస్ పాలనలో ఉన్నాయి. బిజెపి పాలిత రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయావకాశాలు నామమాత్రంగానే ఉన్నాయి. రాజస్థాన్ బిజెపి సొంతం కాబోతోంది. అంతా ఆశిస్తున్నట్లుగా ఐదింటిలో కనీసం 3 రాష్ట్రాల్లో బిజెపి విజయం సాధిస్తే మోడీ ప్రభంజనం మరింత పుంజుకునే అవకాశం ఉంటుంది. జాతీయ స్థాయిలో ప్రధాన పార్టీలైన బిజెపి, కాంగ్రెస్ ముఖాముఖి తలపడనున్న ఈ ఎన్నికల ఫలితాలు 2014 ఎన్నికలకు ముందు పార్టీలకు గోడ మీద రాతల్లా నిలుస్తాయనడంలో సందేహం లేదు. బిజెపి ప్రచార సారధిగా ఎన్నికైన వెంటనే నరేంద్ర మోడీ.. 2014 ఎన్నికలకు ప్రచారం ప్రారంభించేశారు. ఏ విషయంలోనైనా సూటిగా, ఘాటుగా అభిప్రాయాలు చెప్పే మోడీ.. స్వాతంత్య్ర దినోత్సవం నాడే ప్రధాని మన్మోహన్‌కు సవాల్ విసిరి తన లక్ష్యమేంటో చెప్పేశారు. అభివృద్ధి, సుపరిపాలన నినాదాలతో ప్రజల్లోకి వెళ్తున్న మోడీ.. తన బలహీనతలు ప్రత్యర్థులకు బలం కాకుండా జాగ్రత్త పడుతున్నారు. బిజెపి ప్రధాని అభ్యర్థిగా మోడీకి అనేక సానుకూలతలు కనిపిస్తున్నా.. అంతకు మించిన సవాళ్లూ ఎదురుచూస్తున్నాయి. ప్రతిపక్షాలను ఎదుర్కోవడం కంటే అంతర్గత వ్యతిరేకతను అధిగమించడమే మోడీ ముందున్న అతి పెద్ద సమస్య. ప్రధాని అభ్యర్థిత్వం విషయంలో అద్వానీ అభ్యంతరాలను అధిగమించినా - వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపిక దగ్గర్నుంచి మిత్రపక్షాలతో పొత్తు వరకూ ప్రతి విషయంలోనూ ప్రతిబంధకాలు తప్పవు. మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా బిజెపి ముస్లిం ఓట్లను పూర్తిగా దూరం చేసుకొందనే వాదన వినిపిస్తోంది. అయితే మోడీ ప్రధాని అభ్యర్థి అయినా కాకపోయినా.. ముస్లింలు బిజెపికి ఓట్లు వేయరు అనే విషయంలో ఎవరికీ సందేహాలు ఉండవు. మోడీ ముందున్న మరో పెద్ద సమస్య.. ఎన్నికల తర్వాత బిజెపి అతి పెద్ద పార్టీగా అవతరించినా పూర్తి మెజారిటీ రాకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేయగలదా అనేది. బిజెపి నమో నమామి అనడంతో.. సుదీర్ఘ కాలం నుంచి మిత్రపక్షంగా ఉన్న జెడియూ ఎన్డీయేకు రాంరాం చెప్పేసింది. బిజూ జనతాదళ్, అన్నాడిఎంకె, టిడిపి వంటి పార్టీలు ఇప్పటికే ఎన్డీయేలో చేరడానికి విముఖత చూపిస్తున్నాయి. ఎన్సీపీ, తృణమూల్, ఉత్తరప్రదేశ్‌లో చక్రం తిప్పుతున్న సమాజ్‌వాది పార్టీ, బిఎస్పీలతో పాటు కమ్యూనిస్టులు బిజెపిని అంటరాని పార్టీగానే చూస్తున్నారు. అయితే ఎన్నికల తర్వాత కమ్యూనిస్టులు తప్ప మిగిలిన పార్టీల్లో ఏవైనా మనసు మార్చుకొని ఎన్డీయేతో దోస్తీకి సిద్ధమైనా ఆశ్చర్యం లేదు. మోడీ మహత్తు అలాంటిది. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ మన ప్రధాన మంత్రులను చూస్తే.. నెహ్రూ కుటుంబ సభ్యులు తప్ప మిగిలిన వాళ్లంతా అనుకోకుండా అదృష్టం కలిసొచ్చి ఆ పీఠంపై కూర్చున్న వాళ్లే. ఎలాంటి రాజకీయ వారసత్వం లేకుండా, ఇతరుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడకుండా స్వశక్తితో ప్రజల మద్దతుతో, ప్రధాని పదవి కోసం పోటీ పడుతున్న నరేంద్ర మోడీకి ఓటర్లు నమో నమామి అంటారో బెటర్ లక్ నెక్స్ట్‌టైమ్ అంటారో వేచి చూడాలి మరి! * * * 2004, 2009 జనరల్ ఎలక్షన్స్‌లో వరసగా రెండుసార్లు ఓటమి పాలైన బిజెపి నేతృత్వంలోని ఎన్డీయేను తిరిగి ఎలాగైనా గట్టెక్కించే బాధ్యత ఇప్పుడు నరేంద్ర మోడీపై పడింది. గుజరాత్‌లో హ్యాట్రిక్ సాధించిన మోడీ.. ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చిన అవకాశాన్ని అంది పుచ్చుకోవాలని భావిస్తున్న మోడి, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. పరిణతి చెందిన నేతలా వ్యవహరిస్తున్నారు. ప్రధాని అభ్యర్థిగా తనకు తగిన అర్హతలున్నాయని నిరూపించుకునే యత్నంలో ఉన్నారని భావించవచ్చు. దేశ వర్తమాన పరిస్థితులపై అవగాహనతోపాటు, అన్ని వర్గాలను కలుపుకుని పోయే దిశలో ఆయన పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గత నెల పర్యటించిన మోడీ, ప్రత్యేక తెలంగాణను గట్టిగా సమర్థిస్తూనే, ఇరు ప్రాంతాల ప్రజల మనోభావాలు దృష్టిలో ఉంచుకుంటామని.. అందరికీ న్యాయం చేస్తామని.. అందరూ ఇది గమనించాలన్నట్టుగా మాట్లాడారు. నిజానికి ప్రత్యేక తెలంగాణయే బిజెపి ఎజెండా అయినా.. సీమాంధ్ర వారిని కూడా ఆకట్టుకునే విధంగా మోడీ వ్యవహరించారు. మొన్న హర్యానాలో సైనిక దళాలను కలిసిన మోడీ దేశ రక్షణలో కీలక బాధ్యత వహించే సైనికులను సదా గౌరవించాలంటూ వారిని ఆకట్టుకునే యత్నం చేశారు. చైనా, పాకిస్తాన్‌లపై తొడగొట్టారు. ఇదే మన్మోహన్‌కు, మోడీకీ తేడా. అసలు ఈ దేశానికి ప్రధాని అనే మనిషి ఉన్నాడా లేడా! అన్నట్టు మన్మోహన్ వ్యవహరిస్తే, ‘ఇడుగో! ఇతడు కాబోయే ప్రధాని’ అని విదేశాలు సైతం గుర్తించే రీతిలో మోడీ కనపడుతున్నారు. కరడు గట్టిన హిందూత్వ వాదిగా పేరు పొందినా.. అభివృద్ధిపై మోడీ పెట్టిన ప్రత్యేక దృష్టి ఆయన్ను గుజరాత్‌లో తిరుగులేని నేతగా తీర్చిదిద్దింది. అందుకే గుజరాతీలు వరుసగా మూడుసార్లు ఆయనకే పట్టం కట్టారు. అవినీతికి తావునివ్వకుండా - ఆయన చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పనులు, పథకాలు అన్ని వర్గాల వారిని ఆకట్టుకున్నాయి. గుజరాత్‌లో రహదారులు, విద్యుత్, నీటి సరఫరా వంటి వౌలిక సదుపాయాలతో పాటు, ఉపాధి కల్పనపై మోడీ ప్రత్యేక దృష్టి పెట్టారు. పట్టణాల్లోనే ఈ పనులు ఎక్కువగా జరిగాయని విమర్శలు ఉన్నా.. గ్రామాల్లో సైతం కొంత మార్పు వచ్చింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే సాధారణంగా ఇతర ఏ నేతా పెద్దగా దృష్టి పెట్టని.. ఏరియాలపై మోడీ ప్రత్యేకంగా పని చేశారు. గుజరాత్ రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా చేసేందుకు సోలార్ ప్లాంట్లు విరివిగా ఏర్పాటు చేయడం మోడీ ఘనత. ముఖ్యంగా పట్టణాల్లో స్ట్రీట్‌లైట్ల పవర్ సప్లై కోసం.. అలాగే హైవేల వెంట పెద్దఎత్తున సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం గొప్ప విషయం. దీనివల్ల గుజరాత్‌లో పవర్ కట్ అనేది లేకుండా పోయింది. నదీ జలాల వినియోగం - సుందరీకరణ నదీ జలాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేస్తూ.. నర్మద నదితోపాటు, పరిసరాలనూ అందంగా తీర్చిదిద్దారు. అహ్మదాబాద్ నగరంలో ప్రవహించే సబర్మతీ నది.. అక్కడ ఓ టూరిస్ట్ స్పాట్‌లా మారిందంటే అతిశయోక్తి కాదు. అంతలా నదీ తీరాన్ని తీర్చిదిద్దారు. మంచినీటి సరఫరా కోసం పెద్దఎత్తున పైప్‌లైన్ల ఏర్పాటు.. అక్కడి గ్రామాల్లో తాగునీటి సమస్యను తీర్చింది. ఓవైపు రహదారుల నిర్మాణం, మరోవైపు మంచినీటి సరఫరా, ఇంకా నిరంతర విద్యుత్ సరఫరా గ్రామీణ ప్రజలను కూడా మోడీకి దగ్గర చేసింది. విద్యుత్ కోతలు లేకపోవడం వల్ల పంటలూ బాగానే పండుతున్నాయి. ఆర్థికాభివృద్ధితోపాటు, ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎందరికో ఉపాధి కల్పించే పారిశ్రామిక రంగంపై మోడీ ప్రత్యేక దృష్టి పెట్టారు. పరిశ్రమల ఏర్పాటుకు పూర్తి ప్రోత్సాహం అందించారు. టాటా మోటార్స్ పశ్చిమ బెంగాల్‌లోని సింగూరులో నానో కార్ల ప్లాంట్ పెట్టింది. అయితే రైతు, కార్మిక ఉద్యమంతో ఆ కంపెనీని గుజరాత్‌కు తరలించారు. ఈ ప్లాంట్ కోసం ఎన్నో రాష్ట్రాలు పోటీ పడినా.. చివరకు గుజరాత్‌లోనే ఏర్పాటు చేశారు. అంతలా పారిశ్రామిక రంగాన్ని మోడీ ప్రభావితం చేశారు. పరిశ్రమల వల్లనే అత్యధిక ఉపాధి కల్పన జరుగుతుందని.. మోడీ దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. జిల్లాల్లోనూ పరిశ్రమల కోసం ప్రత్యేకంగా వాడల అభివృద్ధి, పలుచోట్ల సెజ్‌ల ఏర్పాటు మోడీ ప్రత్యేకతలని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగా ‘నీకిది - నాకది’ వంటి వై.ఎస్. మార్కు స్వప్రయోజనాల కోసం కాకుండా నిజంగానే పరిశ్రమల పురోగతి కోసం సెజ్‌లు ఏర్పాటు చేశారు. తాను ఉన్నది చాదస్తపుకాషాయ పార్టీలోనే అయినా నరేంద్ర మోడీ సోషల్ మీడియాను బాగా వినియోగిస్తున్నారని చెప్పవచ్చు. పర్సనల్‌గా వెబ్‌సైట్, బ్లాగ్‌తోపాటు ఫేస్‌బుక్ వినియోగించే మోడీ.. అలా ఎందరికో ముఖ్యంగా యూత్‌కు చేరువయ్యారు. మ్లాగ్‌లో పోస్ట్ అయ్యే వాటికి వెంటనే సమాధానం చెబుతారు. రోజూ వేల మందికి మెయిల్స్ పంపిస్తారు. అలాగే ఫేస్‌బుక్‌లో కూడా. కేవలం ఒకచోట ప్రసంగిస్తూ.. అదే సమయంలో మరో మూడు చోట్ల కనిపించేలా 3-డి టెక్నాలజీ వినియోగించిన నేతల్లో మోడీ మొదటివారు. పలుచోట్ల ఒకేసారి కనిపిస్తూ మాట్లాడ్డం.. నిజంగా గుజరాతీయులను ఎంతో ఆకట్టుకుంది. అదే ఆయన్ను ప్రజలకు మరింత చేరువ చేసింది. ప్రత్యర్థులపై ఎప్పుడూ నేరుగా విమర్శలు చేయకపోవడం మోడీ మరో ప్రత్యేకత. ముఖ్యంగా చౌకబారు విమర్శలకు ఆయన దూరమని చెప్పవచ్చు. ఆయన ప్రసంగాలు ఎప్పుడూ హుందాగా ఉంటాయి. చూడగానే ఎవ్వరైనా గుర్తుంచుకునే విధంగా ఆహార్యాన్ని కలిగి ఉండడం మోడీ ప్రత్యేకత. డ్రెస్సింగ్, హావభావాలు, డిగ్నిటీ ఇవన్నీ ఆయన్ను విశిష్ట వ్యక్తిగా నిలిపాయి. ముఖ్యంగా ఖాదీ పాలిస్టర్ లాల్చీ, పైజామా ఆయనకు హుందాతనం తెచ్చిపెట్టాయని చెప్పవచ్చు. ప్రత్యర్థులైనా సరే, వయసులో పెద్దవారైతే వారిని గౌరవించడం మోడీ ప్రత్యేకత. గత ఎన్నికల్లో ఆయన బద్ధశత్రువు, సీనియర్ లీడర్ కేశూభాయ్ పటేల్ సొంత పార్టీ పెట్టి ఓటమి పాలయ్యారు. గెల్చాక వెంటనే స్వయంగా పటేల్ ఇంటికి వెళ్లి.. పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకోవడం మోడీ పట్ల జనంలో సదభిప్రాయం పెరగడానికి ఉపకరించింది. అలాగే, ఇప్పుడు ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత.. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన అగ్రనేత అద్వానీ ఇంటికి స్వయంగా వెళ్లిన మోడీ.. ఆయనకు పాదాభివందనం చేశారు. ఇలా తనకు ప్రత్యర్థులైనా, తనను వ్యతిరేకించిన వారైనా సరే.. వారి ఆశీర్వాదం తీసుకోవడం మోడీ ప్రత్యేకత. ఇది గుజరాతీల వ్యాపార దక్షత రహస్యమేమో! ఇక ప్రతి సందర్భంలో తల్లిని కలుసుకోవడం, ఆమెకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం కూడా మోడీకి ఉన్న మంచి అలవాటు. ఎకనమిక్ క్యాపిటల్ నిర్మాణం దేశ ఆర్థిక రాజధాని ముంబై తరహాలో ఓ నగరం నిర్మాణం చేపట్టిన మోడీ.. గుజరాత్‌లో వాణిజ్య రంగాన్ని ఎంతో అభివృద్ధి చేసే పనిలో పడ్డారు. వ్యాపార, వాణిజ్య వర్గాలకు అన్ని విధాల ఉపయోగపడే విధంగా అహ్మదాబాద్ సమీపంలో.. అన్ని వసతులు, సౌకర్యాలతో అత్యాధునిక నగర నిర్మాణం చేపట్టారు. ఈ నగర నిర్మాణం పూర్తయితే, వ్యాపార, వాణిజ్య సంస్థలన్నీ అక్కడికి తరలి వెళ్లే అవకాశం ఉంది. అదే జరిగితే, ఆ నగరం మరో ముంబై కావడమన్నది ఖాయం. దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నది మోడీ నమ్మకం. ఇలా అన్ని వర్గాల వారి అభివృద్ధి, సంక్షేమం కోసం పలు పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్న మోడీ.. ఇప్పుడు జాతీయ నేతగా ఎదుగుతున్నారు. అందుకే బిజెపి నుంచి ప్రధాని అభ్యర్థి అయ్యారు. మన ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీ రామారావు తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఢిల్లీలోని కాంగ్రెస్ దర్బారును ఢీకొన్నట్టు, గుజరాత్‌లో మోడీ కూడా గుజరాతీల ఆత్మగౌరవాన్ని తెర మీదికి తెచ్చారు. గుజరాత్‌లో కాంగ్రెస్ అనే జాతీయ పార్టీని దాదాపు నామ రూపాల్లేకుండా చేశారు. ఇపుడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు చుక్కలు చూపించేందుకు మోడీ సిద్ధమవుతున్నారు. బిజెపిలోని అవలక్షణాలు పూర్తిగా ఆకళింపు చేసుకున్న మోడీ తన ఈ తాజా భగీరథ యత్నంలో పూర్తిగా బిజెపి స్కంధావారాలపైనే ఆధారపడకుండా తన సొంత ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ఓ విభిన్నమైన, విశిష్టమైన ఈ ఒకే ఒక్కడు ఏం చేయబోతున్నాడో, అతడివల్ల ఈ దేశానికి ఏమి రాసి పెట్టి ఉందో, అతడి నుదుటన ఆ బ్రహ్మ ఏమి రాశాడో మరో 8-9 నెలలు ఆగితేగాని తెలియదు. శుభం భూయాత్ ఇండియా! *