Sunday 15 September 2013

అత్యుత్తమ 200 వర్సిటీల్లో భారత్‌కు దక్కని చోటు

అత్యుత్తమ 200 వర్సిటీల్లో భారత్‌కు దక్కని చోటు

September 11, 2013
లండన్, సెప్టెంబర్ 10: బ్రిటన్‌లోని ప్రముఖ విద్యాపరిశోధన సంస్థ 'క్యుఎస్' ప్రకటించిన 200 ప్రపంచ అత్యుత్తమ విశ్వవిద్యాలయాల జాబితాలో ఒక్క భారతీ య వర్సిటీకీ చోటు దక్కలేదు. మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూ ట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) ఈ జాబితాలో ప్రథమస్థానం పొందింది. హార్వర్డ్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయాలు రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నాయి.

ఇక నిరుడు 212వ స్థానంలో ఉన్న ఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) ఈసారి 222కు దిగజా రింది. పరిశోధన, విద్యాప్రమాణాల ఆధారంగా ప్రపం చంలోని 3వేల వర్సిటీలపై అధ్యయనం మేరకు క్యుఎస్ ఈ జాబితా ప్రకటించింది. ఆసియా వరకు చూస్తే 50 అత్యుత్తమ విద్యాసంస్థల్లో ఢిల్లీ, ముంబై ఐఐటీలు 38, 39 స్థానాల్లో నిలిచాయి. కాన్పూర్, రూర్కీ ఐఐటీలకు 51, 66 స్థానాలు దక్కగా హాంకాంగ్ వర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అత్యుత్తమ సంస్థగా నిలిచింది.

No comments:

Post a Comment