Monday 9 September 2013

ఎన్ని జెప్పాలె ఇట్ల? - Kaloji

ఎన్ని జెప్పాలె ఇట్ల?

September 09, 2013
"తెలంగాణ భాషంతా 'తౌరక్యాంధ్ర'మని ఎవడో అన్నడు. ఇపుడు అంటాండ్రు. మరి అట్లయితే నీది తెలుగేనా? చా అంటే తప్పు. టీ అంటే తెలుగా? సిల్సిలా అంటే తప్పు. సీరియల్ అంటే రైటా? సాల్టు, షుగరు తెలుగే. నాష్త అంటే కొంప మునుగుతది. తోలు కొచ్చినం అంటే పశువులనే. పోయిందంటే చావే. కడప గాను గడపంటేనే రైటు. తొవ్వ తప్పు. దోవ రైటు. పొక్కలెన్నున్నా బొక్కంటేనే రైటు. మందలించుడంటే తప్పుచేస్తేనేనట. మేరాయన దర్జీ అంటే ఛీ ఛీ పనికిరాదు.

టైలర్ అనాల్నట. ఎప్పట్నుంచో ఉన్న అదాలతులు..కోర్టులంటేనే న్యాయస్థానాలయితయట. ఏమిటిదంతా? అసలు అర్థాన్ని మార్చి జీతాన్ని 'తనఖా' అంటే కుదువ అంటవు. కంప్లేంట్ చేసేటోడు ముద్దయి. మరి నువ్వు నేరం మోపబడ్డోన్నే ముద్దయంటున్నవు. ఎన్ని జెప్పాలె ఇట్ల?''
(తెలంగాణ రచయితల వేదిక ప్రథమ మహాసభలో "తెలంగాణ బతుకు వేరే తెలంగాణ భాష వేరే'' అనే అంశంపై చేసిన అధ్యక్షోపన్యాసం నుంచి)

No comments:

Post a Comment