Monday 30 September 2013

1931 నాటికే హైదరాబాద్ అభివృద్ధి చెందింది

1931 నాటికే హైదరాబాద్ అభివృద్ధి చెందింది

September 30, 2013

కేసముద్రం రూరల్, సెప్టెంబర్ 29: హైదరాబాద్ అభివృద్ధిపై సీమాంధ్ర నాయకులు, తెలంగాణవాదుల మధ్య వాదనలకు ముగింపు పలికేందుకు ఒక ఆధారం లభించిందని వరంగల్‌కు చెందిన కాకతీయ విశ్వవిద్యాలయం రిటైర్డ్ హిస్టరీ ప్రొఫెసర్ బి.చంద్రయ్య తెలిపారు. బ్రిటిష్ సామ్రాజ్యంలో హైదరాబాద్ ఆరో అతి పెద్ద నగరమని 1931లో భారత గణాంక శాఖ ప్రచురించిన నివేదికలో స్పష్టంగా ఉందని వివరించారు. తన పరిశోధనలో భాగంగా దాదాపు 20 ఏళ్ల కిందట మద్రాస్ కేంద్ర గ్రంథాలయంలో ఈ ఆధారాలను సేకరించినట్లు ఆయన 'ఆంధ్రజ్యోతి'కి తెలిపారు. భారత గణాంకశాఖ కమిషనర్ గులాం అహ్మద్‌ఖాన్ 1931లో నిజాం సంస్థానం (హైదరాబాద్ రాష్ట్రం)పై గణాంక నివేదిక ఇచ్చారు. 13వ వాల్యూమ్ పార్ట్-1 నివేదిక ప్రకారం ఆనాటి రాష్ట్రంలో హైదరాబాద్, ఔరంగబాద్, గుల్బర్గా, వరంగల్‌లను నగరాలుగా పేర్కొన్నారు. ఈ నాలుగు నగరాల జనాభా 6,06,966గా ఉంది. ఇందులో హైదరాబాద్ దేశంలో నాలుగో స్థానం, బ్రిటీష్ పాలనలో ఉన్న రాజ్యాల్లో లండన్, సిడ్నీ, కలకత్తా, బాంబే, మద్రాస్ తర్వాత హైదరాబాద్(ఆరోస్థానం) ఉంది. ప్రపంచంలో 23వ ర్యాంకుతో హైదరాబాద్ ఉన్నట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు.

No comments:

Post a Comment