Monday 17 August 2015

నవ్యాంధ్ర రాజధాని రైతులకు కరెంట్ షాక్

నవ్యాంధ్ర రాజధాని రైతులకు కరెంట్ షాక్

  •  రాజధాని ప్రాంత రైతులకు కొత్త చిక్కు
  •  భూములిచ్చారు.. బకాయిలు మరిచారు
  •  వెంటాడుతున్న వ్యవసాయ విద్యుత్‌ బకాయిలు
  •  చెల్లించాంటూ విద్యుత్‌ శాఖ నోటీసులు
  •  లేదంటే ఇంటికి కనెక్షన్‌ కట్‌ అంటూ హెచ్చరిక
 
గుంటూరు, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): రాజధాని ప్రాంతంలోని రైతులకు కొత్త చిక్కు ఎదురైంది. ఇంతవరకూ సేద్యానికి ఉపయోగించిన విద్యుత్‌ బకాయిలను వెంటనే చెల్లించాలని.. లేదంటే ఆ బకాయిలను ఇంటికి వచ్చే విద్యుత్‌ బిల్లులో కలుపుతామని విద్యుత్‌శాఖ అధికారులు నోటీసులు జారీచేశారు. అంతేకాదు.. ఒకవేళ బకాయిలను చెల్లించకుంటే ఇంటికి విద్యుత్‌ కనెక్షన్‌ను తొలగిస్తామని హెచ్చరికలు జారీచేశారు. దీంతో రైతులంతా షాక్‌కు గురయ్యారు. నవ్యాంధ్ర రా జధాని నిర్మాణం కోసం రైతులు తమ తమ భూములను ప్రభుత్వానికి అప్పగిం చారు. చదునుచేసే కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అంతకుముందు తాము చెల్లించాల్సి ఉన్న విద్యుత్‌ మోటార్ల బకాయిల గురించి చాలామంది రైతులు పట్టించుకోలేదు. భూములనే వదిలేశాం, ఇక వ్యవసాయ విద్యుత్‌ బిల్లులు ఏం చెల్లిస్తాంలే అనే ఆలోచనతో కొందరు.. కట్టకపోతే తమకు వచ్చే నష్టం ఏముందిలే? అనే భరోసాతో మరికొందరు.. ప్రభుత్వం బకాయిలు రద్దు చేస్తుందనే ధీమాతో ఇంకొందరు వాటిని కట్టలేదు. అయితే విద్యుత్‌ శాఖ అధికారులు మాత్రం సదరు బకాయిలను ముక్కుపిండి వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. రెండు రోజులుగా.. రాజధాని ప్రాంతంలోని వ్యవసాయ విద్యుత్‌ బకాయిలున్న రైతులకు నోటీసులు జారీచేసే ప్రక్రియకు విద్యుత్‌ శాఖ అధికారులు శ్రీకారం చుట్టారు. ఆ నోటీసులు అందుకున్న రైతులు ఒకింత షాకుకు గురయ్యారనే చెప్పవచ్చు.
 
ఇదీ నోటీసుల సారాంశం
‘సీఆర్‌డీఏ పరిఽధిలో ఉన్న మీరు మీ భూములను ప్రభుత్వానికి అందజేసినట్లుగా మాకు తెలిసింది. ఇప్పటివరకు మీరు వినియోగించుకున్న వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌ను రద్దు చేసుకోవాల్సి ఉంది. అందుకుగానూ మీరు ఇప్పటివరకు ఉన్న బకాయిలను పూర్తిగాచెల్లించి.. ఇకపై బిల్లులు జారీ కాకుండా ఉండేందుకు దరఖాస్తు చేసుకోవాలి. అలా రద్దుచేసుకోని ప్రతి వ్యవసాయ సర్వీస్‌పై ప్రతి నెలా కనీస చార్జీలు కలపడం జరగుతూనే ఉంటుంది. అంతేకాదు వ్యవసాయ సర్వీస్‌పై ఉన్న బకాయిని ఇంటి సర్వీస్‌కు జత చేస్తాం. అలా జత చేసిన బకాయిని తక్షణమే చెల్లించని పక్షంలో ఇంటి సర్వీస్‌ను కూడా తొలగిస్తాం’’ అని విద్యుత్‌ శాఖ నోటీసులు జారీచేసింది.
 
4,700 మంది.. రూ.2 కోట్లు
రాజధాని ప్రాంతం పరిధిలో సుమారు 4,700 మంది రైతులకు ఈ నోటీసులు జారీచేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటి వరకు సగం మంది రైతులకు ఈ నోటీసులు అందాయి. వీరందరూ చెల్లించాల్సిన బకాయిలు సుమారు రూ. 2 కోట్ల వరకు ఉన్నాయి. ఒక్క తుళ్లూరు మండలంలోనే రూ.కోటికి పైగా బకాయిలు ఉన్నాయి.
 
వచ్చే కౌలుకు లింక్‌ పెట్టే ఆలోచనలో సీఆర్‌డీఏ
విద్యుత్‌ బకాయిలున్న రైతులను ఇప్పటికిప్పుడు ఇబ్బందులకు గురి కా కుండా చేయాలనే ఆలోచనలో సీఆర్‌డీఏ అధికారులున్నట్లు సమాచారం. బకాయి ల వసూలుకు అధికారులు చేస్తున్న హడావుడి కొంతమంది రైతులు సీఆర్‌డీఏ దృష్టికి తీసుకువెళ్లడంతో వారు దీనిపై దృష్టి సారించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి ఉపసంహరింపజేయాలని భావిస్తున్నారు. వ్యవ సాయ విద్యుత్‌ బకాయిలను వచ్చే ఏడాది చెల్లించే కౌలు మొత్తం నుంచి మినహాయించుకోవచ్చునని, ఇప్పటికిప్పుడు ఆ రైతులను బకాయి సొమ్ము కోసం వేధించాల్సిన అవసరం లేదని ప్రజాప్రతినిధులు కూడా భావిస్తున్నారు.

No comments:

Post a Comment