Saturday, 8 August 2015

ఉద్యమాలకు మా సంపూర్ణ మద్దతు : సోనియా

ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ఉద్యమాలకు మా సంపూర్ణ మద్దతు : ఓయూ విద్యార్థులతో సోనియా

ఢిల్లీ, ఆగస్టు8:‌ సోనియాతో ఓయూ విద్యార్థుల భేటీ ముగిసింది . తెలంగాణలో కేసీఆర్‌ పాలన, విద్యార్థుల సమస్యలపై చర్చ ఈ భేటీలో చర్చ జరిగింది. ఎన్నికలకుముందు ఇంటికో ఉద్యోగమన్న కేసీఆర్ ఇప్పుడు జిల్లాకొకటి కూడా ఇవ్వడం లేదని విద్యార్థులు సోనియా వద్ద తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ఉద్యమాలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని సోనియా విద్యార్థులతో అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి విద్యార్థులు కష్టపడాలని సోనియా సూచించారు.
తెలంగాణ కోసం ఉద్యమం చేసింది విద్యార్థులు, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీనేని ఓయూ విద్యార్థులు మీడియాతో చెప్పారు. మధ్యలో వచ్చిన కేసీఆర్‌ నియంతలాగా వ్యవహరిస్తున్నారనీ, ఓయూకు వీసీ, సిబ్బందిని నియమించకుండా ప్రభుత్వం కాలయాపనచేస్తోందని ఓయూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment