|
హైదరాబాద్, ఆగస్టు 10 : ప్రత్యేక హోదా కోసం వైసీపీ అధ్యక్షుడు చేస్తున్న ధర్నా రాజకీయ డ్రామాగా ఏపీ మంత్రి అచ్చెంన్నాయుడు అభివర్ణించారు. వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి తమ స్వార్థం కోసం నాటకం ఆడుతున్నాయని ఆయన మండిపడ్డారు. చచ్చి పోయినటువంటి వైసీపీ ఉనికిని మళ్లీ రాష్ట్రంలో కాపాడుకోడానికే ధర్నా చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఏపీకి జరిగిన నష్టం గురించి 14 నెలలుగా ఒక్క రోజు కూడా మాట్లాడలేదని.. ఇప్పుడు పార్టీ ఉనికిని కాపాడుకోడానికి జగన్ ధర్నా చేస్తున్నారని, దీని వల్ల ఒరిగింది ఏమీ లేదని అచ్చెంనాయుడు అన్నారు.
|
No comments:
Post a Comment