|
న్యూయార్క్ (ఆగస్ట్ 18): ఆమె పేరు ఎడెనా హైన్స్ (33). ప్రముఖ హాలీవుడ్ నటుడు మోర్గాన్ ఫ్రీమన్ (ఆస్కార్ అవార్డ్ గ్రహీత) మనవరాలు. కొంతకాలంగా లమెన్ డావెన్‌పోర్ట్ (30)తో ప్రేమలో ఉంది. అయితే ఆదివారం ఉదయం అమెరికాలోని మాన్‌హట్టన్ వీధుల్లో నిర్జీవంగా పడివుంది. ఆమె శరీరంపై కత్తిపోటు గాయాలున్నాయి.
దీనికి కారణం ఆమెను ప్రేమించిన వాడి పైశాచికత్వంతో కూడిన మూఢనమ్మకమే. హైనస్ శరీరంలో చాలా దయ్యాలున్నాయని, వాటిని తరిమే శక్తి జీసెస్ క్రైస్ట్‌కే ఉందని అతని నమ్మకం. అందుకే ఆదివారం ఉదయం నడివీధిలోకి తీసుకొచ్చి భయంకరంగా అరుస్తూ కిరాతకంగా కత్తితో పొడుస్తూ చంపేశాడు. ఇలా దాదాపు 16 సార్లు ఆమెను పొడిచాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.
‘ఆమె శరీరం రోడ్డుపై పడి ఉంది. అతను మోకాళ్ల మీద ఆమె మీద కూర్చుని ఉన్నాడు. ‘బయటికి రండి. బయటికి రండి’ అంటూ గట్టిగా అరుస్తూ ఆమెను కత్తితో చాలా సార్లు పొడిచాడు. చూడడానికి ఆ దృశ్యం భూతవైద్యం చేస్తున్నట్టుగా ఉంద’ని ప్రత్యక్ష సాక్షి వివరించాడు. కాగా, హైనస్ ‘ఫైవ్ ఫ్లైట్స్ అప్’ అనే హాలీవుడ్ సినిమాలో నటించింది. ఈ చిత్రం ఈ ఏడాది మేలో విడుదలైంది. ఆమె గత కొంతకాలంగా తన ప్రేమికుడితోనే కలసి నివసిస్తోంది. కాగా, హైనస్ మరణం తననెంతో కలచి వేసిందని మోర్గాన్ విచారం వ్యక్తం చేశారు.
|
No comments:
Post a Comment