గుజరాత్, ఆగస్టు 25 : ఓబీసీ రిజర్వేషన్ల కోసం పటేల్ సామాజిక వర్గం అహ్మదాబాద్‌లో నిర్వహించిన ర్యాలీకి విశేష స్పందన లభించింది. గుజరాత్‌లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఐదు లక్షల మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. రాజీకి అవకాశమే లేదని రిజర్వేషన్ అమలు అయ్యేవరకు ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఉద్యమకారులు అన్నారు.
రిజర్వేషన్ ఉద్యమకారుడు హర్దిక్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ గుజరాత్ రాష్ట్రంలో, కేంద్రంలో మన ప్రజా ప్రతినిధులు ఉన్నారని, తమ పనులు చూసుకునేందుకు వాళ్లను ఎన్నుకోలేదని, మన సమస్యలు పరిష్కరిస్తారని ఎన్నుకున్నామని అన్నారు. మన హక్కులను నాయకులకు గుర్తు చేస్తే మొహం తిప్పేసుకుంటున్నారని ఆయన విమర్శించారు. చాలా మంది మాట దాటవేస్తున్నారని, వాళ్లలో నిజాయితీ లేదని... మన హక్కు సాధించుకునేవరకు ఉద్యమాన్ని వదులుకునే ప్రసక్తే లేదని హర్దిక్ పటేల్ స్పష్టం చేశారు.
No comments:
Post a Comment