చిత్తూరు, ఆగస్టు 17 : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాపై టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిగా ఉన్న రోజా నగరి, పుత్తూరుకు నెలకొకసారి వస్తుందని ఆయన దుయ్యబట్టారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సెక్షన్ -8పై రోజాకు అవగాహన లేదని ముద్దు కృష్ణమ నాయుడు ఎద్దేవా చేశారు. రోజా లాంటి ఎమ్మెల్యేలను ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కట్టడి చేయాలని ఆయన సూచించారు.
భూసేకరణ అంశంపై సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని అందులో తప్పు లేదని గాలి ముద్దు కృష్ణమ నాయుడు అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలోనే ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్రమోదీని కలిసి చర్చలు జరుపుతారని ఆయన చెప్పారు. ఇప్పటికే బాబు ఢిల్లీకి రావలిసిందిగా ప్రధాని నుంచి ఫోను వచ్చిన విషయాన్ని ముద్దు కృష్ణమ నాయుడు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
No comments:
Post a Comment