|
న్యూఢిల్లీ, ఆగస్ట్ 24: రాజకీయ పార్టీలు ఆర్టీఐ కిందకు రాబోవని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. రాజకీయ పార్టీలు ప్రభుత్వ సంస్థలు కావని స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలు కనుక ఆర్టీఐ కిందకు వస్తే వాటి పనితీరు దెబ్బతింటుందని తెలిపినట్లు సమాచారం. రాజకీయ ప్రత్యర్ధులు దురుద్దేశంతో ఆర్టీఐ అప్లికేషన్లు దాఖలు చేసే అవకాశం ఉందని వెల్లడించింది. రాజకీయ పార్టీలను సమాచారహక్కు కిందకు తెస్తే ఆర్ధిక అవకతవకలకు చెక్ పెట్టినట్లౌతుందని చాలా కాలంగా ఆర్టీఐ కార్యకర్తలు కోరుతున్నారు. ఎన్నికల్లో అవినీతి, అక్రమాలు తగ్గిపోతాయనే వాదన కూడా ఉంది. 20 వేల కంటే తక్కువగా తీసుకున్న విరాళాల వివరాలను కూడా ప్రజల ముందుంచాలని ఆర్టీఐ కార్యకర్తలు కోరుతున్నారు. ఈ తరుణంలో రాజకీయ పార్టీలను సమాచార హక్కు కిందకు తీసుకురాలేమని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది.
|
No comments:
Post a Comment