|
ఎన్టీఆర్ హయాంలో..1986లో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు తెలుగుభాష మీద అభిమానంతో తెలుగు విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. దానికి అనుబంధంగా వరంగల్, కూచిపూడి, శ్రీశైలం, రాజమండ్రి ప్రాంతాలలో పీఠాలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత తెలుగు వర్సిటీనీ విభజించవలసి ఉంది. ఆస్తుల, ఉద్యోగుల పంపకాలు జరగాల్సి ఉంది. కానీ పంపకాలకు ముందే.. రాజమండ్రిలో తెలుగు వర్సిటీ ఏర్పాటుకు నిర్ణయించినట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు అసెంబ్లీలో ఒక తీర్మానం కూడా చేసింది. కానీ.. ఆ తర్వాత ఈ విషయంలో పెద్దగా దృష్టి పెట్టలేదు. ఈ లోపు తెలంగాణ ప్రభుత్వం ఏపీలోని మూడు పీఠాలనూ ఎత్తివేసింది. దీంతో ఈ ఏడాది విద్యార్థుల ప్రవేశానికి నోటిఫికేషన్ జారీకాలేదు. ప్రస్తుతం రెండవ సంవత్సరం విద్యార్థులకు మాత్రమే పాఠాలు చెబుతున్నారు. ఆటంకాలేమిటి?రాజమండ్రి సమీపంలో బొమ్మూరు కొండ మీద 1987-88 నుంచి తెలుగు సాహిత్య పీఠం నడుస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడ ఏకంగా విశ్వవిద్యాలయమే ఇక్కడకు వస్తుందని చెప్పడంతో స్థానికుల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. కానీ ప్రస్తుత పరిస్థితి వేరుగా ఉంది. ఇక్కడ విశ్వవిద్యాలయం ఏర్పాటు కావాలంటే, తెలుగు వర్సిటీ ఆస్తుల పంపకం జరగాలి. ఉద్యోగుల పంపకమూ జరగాలి. మొత్తం ఉమ్మడి రాష్ట్రంలోని విశ్వవిద్యాలయంలో 224మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో ఏపీ పరిధిలో మూడు పీఠాల్లో పనిచేస్తున్న సుమారు 50 మంది ఉద్యోగులను తప్పించి, మిగతావారిని తెలంగాణ పరిధిలో కొనసాగిస్తున్నారు. పరిశీలించిన ప్రముఖులుతెలుగు విశ్వవిద్యాలయం ఇబ్బందులలో ఉందని తెలియడంతో రాజమండ్రికి చెందిన ప్రముఖులు కంటిపూటి సర్వారాయుడు, ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్ కొవ్వూరి గంగిరెడ్డి, బ్రౌన్ మందిరం నిర్వాహకుడు సన్నిధానం శాసి్త్ర, సాహిత్యవేత్త ఫణి నాగేశ్వరరావు సోమవారం విశ్వవిద్యాలయాన్ని పరిశీలించారు. ఒక వెలుగు వెలిగిన ఈ పీఠానికి ఈ దుస్థితి వస్తుందని తాము ఊహించలేదని, దీనికోసం దీక్ష చేయనున్న యార్లగడ్డకు తాము మద్దతు ఇస్తున్నామని వారు ప్రకటించారు. వర్సిటీ దుస్థితి గురించి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఇటీవలే వినతి పత్రం ఇచ్చినట్టు తెలుగు సాహిత్య పీఠం డీన్ జి.ఎ్‌స.భాస్కర్ తెలిపారు. |
No comments:
Post a Comment