Wednesday 3 June 2015

బాబు సన్నిహితుల ఫోన్లు ట్యాప్‌ చేసిన ఇంటెలిజెన్స్‌

బాబు సన్నిహితుల ఫోన్లు ట్యాప్‌ చేసిన ఇంటెలిజెన్స్‌
ఎవరితో ఎవరు మాట్లాడుతున్నారని నిత్యం నిఘా !

హైదరాబాద్‌, జూన్‌ 3 : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సన్నిహితుల ఫోన్లు ట్యాప్‌ అవుతున్నాయి. నిత్యం చంద్రబాబు చుట్టూ ఉండేవారి ఫోన్లు ఇంటెలిజెన్స్‌ ట్యాప్‌ చేస్తున్నట్లు తెలియవచ్చింది. ప్రభుత్వంలోని కొందరి అధికారులు ఫోన్లు కూడా ట్యాప్‌ చేస్తున్నట్లు సమాచారం. ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారన్న అంశాలపై ఇంటెలిజెన్స్‌ వర్గాలు నిత్యం నిఘా పెట్టినట్లుగా తెలియవచ్చింది.

అనుమతి లేకుండా ఇల్లీగల్‌గా ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంత మంది అధికారుల పోన్‌ నెంబర్‌లను ట్యాప్‌ చేస్తున్నారు. ప్రధానంగా చంద్రబాబు నాయుడు చుట్టు సన్నిహితంగా ఉండే వ్యక్తుల ఫోన్‌ నెంబర్లు, అదే విధంగా చంద్రబాబు ఎవరితో మాట్లాడుతున్నారో దానికి సంబంధించి ఇంటిలిజెన్స్‌ వివరాలు ఆరా తీయడం జరుగుతోంది. వారు మాట్లాడుతున్న వాయిస్‌ కూడా రికార్డు చేయడం జరుగుతుందని తెలియవచ్చింది. ఈ విషయంపై ఏపీ పోలీసులు కూడా సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం.

No comments:

Post a Comment