Wednesday 3 June 2015

నవనిర్మాణదీక్షలో లక్షల మంది ప్రజలు పాల్గొన్నారు - బాబు

నవనిర్మాణదీక్షలో లక్షల మంది ప్రజలు పాల్గొన్నారు
రాజకీయ లబ్దికోసం కాంగ్రెస్‌ ప్రజల పొట్ట కొట్టింది
చిత్తూరుజిల్లాలో జన్మభూమి-మనవూరులో చంద్రబాబు

చిత్తూరు, జూన్‌ 3 : నవనిర్మాణ దీక్షలో రాష్ట్ర ప్రజలను భాగస్వాములుగా చేశానని, కొన్ని లక్షల మంది దీక్షలో పాల్గొన్నారని, విద్యార్థులు, డ్వాక్రా సంఘాలు, ఉద్యోగస్తులు అందరూ పాల్గొన్నారని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జన్మభూమి - మనవూరు కార్యక్రమంలో భాగంగా బుధవారం చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం, ఆర్‌.మల్లవరంలో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అక్కడ ప్రజల కష్టసుఖాలను, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు సక్రమంగా పనిచేయాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ నవనిర్మాణ దీక్ష చేపట్టడానికి కారణం జూన్‌ 2న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం రెండు రాష్ర్టాలుగా విభజింపబడిందని, దీనికి కారణం ఆనాటి కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల పొట్టకొట్టిందని విమర్శించారు.

ఏపీకి కట్టుబట్టలతో పంపించారని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కాలేజీలు లేవు, రాజధాని లేదు, ఇండసీ్ట్రలు లేవని చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలన్నీ నిన్న నవనిర్మాణ దీక్షలు ప్రజలకు గుర్తు చేశానని ఆయన అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా పేదవాళ్లతో ఉండాలని అనుకున్నానని, పేదవాళ్లకోసం నిరంతరం పనిచేస్తున్నానని ఆయన చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పేదవారి ఫించన్‌ ఐదు రెట్లు పెంచానని, వితంతువుల ఫించన్‌ మూడు రెట్లు పెంచానని ఆయన తెలిపారు.

రైతులకు రూ. 24 వేల కోట్లు ఇస్తున్నామని, అలాగే డ్వాక్రా సంఘాలకు రూ. 10 వేల కోట్లు ఇస్తున్నట్లు చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ మూడు కార్యక్రమాలు చూస్తే రూ. 40 వేల కోట్లు ఒక్క ఏడాదిలో పేదవారికి ఇచ్చిన ఘనత ఒక్క తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కిందని ఆయన అన్నారు. పేదవాడి సంక్షేమమే నా లక్ష్యమని, ఏపీలో 9 లక్షాల డ్వాక్రా సంఘాలు ఉన్నాయని, డ్వాక్రా సంఘాల వద్ద రూ. 15 వేల కోట్లు ఉన్నాయని, స్వయం ఉపాధి ద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చునని, మహిళలను ఆర్థికంగా పైకి తీసుకురావాలన్నదే నా ఆకాంక్ష అని చంద్రబాబు పేర్కొన్నారు. ఇక్కడ గార్మెంట్‌ పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. పట్టిసీమ, పోలవరాన్ని పూర్తి చేస్తామని ఆయన తెలిపారు.

ఏపీలో ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చామని, ఉద్యోగులను బాగా చూపుకుంటామని, ఉద్యోగులు ప్రజలను బాగా చూసుకోవాలని చంద్రబాబు నాయుడు సూచించారు. ప్రతి పేదవాడు ఆనందంగా ఉండాలన్నదే టీడీపీ లక్ష్యమని ఆయన అన్నారు. సకాలంలో పనులు జరగకపోతే ఎన్ని జన్మభూమి క్యాక్రమాలు పెట్టినా ఉపయోగం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

No comments:

Post a Comment