Tuesday 16 June 2015

అంతు చూస్తాం.. లోతూ చూస్తాం : పరకాల ప్రభాకర్ 8-6-2015 23 Hrs.

http://www.andhrajyothy.com/Artical.aspx?SID=117419&SupID=42

అది చంద్రబాబు వాయిస్ కాదు..
అదే అయితే మీరు ట్యాపింగ్‌ చేశారా?
అంతు చూస్తాం.. లోతూ చూస్తాం (08-Jun-2015)


  • సీరియస్‌గా తీసుకుంటున్నాం.. ఎక్కడెక్కడివో కలిపి గుదిగుచ్చారు
  • చేస్తే చెప్పండి.. న్యాయ, చట్ట, రాజ్యాంగ, రాజకీయంగా ఎదుర్కొంటాం
  • టీఆర్‌ఎస్‌ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం..
  • బాబును అరెస్టు చేసే ధైర్యం ఎవరికీ లేదు..
  • ఎవరైనా వస్తారనీ అనుకోవడం లేదు: పరకాల
హైదరాబాద్‌, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ఏపీ సీఎం చంద్రబాబు ప్రలోభ పెట్టారంటూ ఆదివారం రాత్రి టీవీ చానెళ్లలో వచ్చిన ఆడియో టేపులను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌ ఆదివారం రాత్రి 11 గంటలకు మీడియాతో మాట్లాడుతూ... టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఆడియోలో ఉన్నది చంద్రబాబు స్వరం కాదని, ఆయన మాటలూ కాదని అన్నారు. ఒకవేళ ఆయనదే అయితే ఎక్కడెక్కడో మాట్లాడినవి తీసుకొచ్చి గుదిగుచ్చారని అన్నారు. లేకపోతే ఆ ఆడియో ఎలా వచ్చిందో చెప్పాలన్నారు. ‘‘అన్నీ కోర్టుకు సమర్పించినప్పుడు... ఈ సంభాషణ ఎక్కడి నుంచి వచ్చింది? దీనిని ఎలా బయటపెడుతున్నారంటే.. సాక్ష్యాధారాలు కావా? కాదన్నప్పుడు ఎలా, ఎక్కడి నుంచి వచ్చింది? ట్యాప్‌ చేసి ఉంటే చెప్పండి. ఏపీ సీఎం ఫోన్‌ను టాప్‌ చేశామని చెప్పండి. మా వద్ద టేపులు ఉన్నాయని సాక్షాత్తూ తెలంగాణ హోంమంత్రి చెప్పారు. లేదా... సీఎం సంభాషణ అంటూ... సీఎం ఎక్కడెక్కడో మాట్లాడిన మాటలు గుదిగుచ్చి ప్రజల్లో భావన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. టెలిఫోన్లు ఇంటర్‌సెప్ట్‌ చేసి, ట్యాపింగ్‌ చేసి బయటపెడితే నేరం. అక్కడక్కడ మాటలన్నింటినీ గుదిగుచ్చి చూపినా నేరమే. దీన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తోంది. దీని లోతు చూస్తాం. దీని అంతూ చూస్తాం. దీనిని మాములుగా వదిలిపెట్టేది లేదు.’’ అని స్పష్టం చేశారు. రాజ్యాంగ బద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం, మంత్రిమండలి, ఆ నాయకుడు ముఖ్యమంత్రి... రాష్ట్రం విడిపోయిన సందర్భంలో ఒక ఉమ్మడి రాజధానిలో ఉన్నప్పుడు, ఇక్కడ ఉన్నటువంటి సీఎం పట్ల టీఆర్‌ఎస్‌ ప్రవర్తించే తీరు ఇదేనా? అని పరకాల ప్రశ్నించారు. ప్రజల స్వేచ్ఛ, ఆస్తులు, ముఖ్యమైన ఇరు ప్రభుత్వాలు, సీఎంలకు సరిసమానమైన హక్కులు ఉన్నాయన్నారు. ‘మేము ఇక్కడ ఉన్నప్పుడు... ఉమ్మడి రాజధానిలో ఉన్నప్పుడు.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మా రాష్ట్ర సీఎం పట్ల వ్యవహరించిన తీరును ఖండిస్తాం. దీనికి రాజ్యాంగ, న్యాయ, చట్ట, రాజకీయంగా అన్ని రకాల చర్యలు మా ప్రభుత్వం తీసుకుంటుంది. చంద్రబాబును అరెస్టు చేసే ధైర్యం ఎవరికీ లేదు. ఎవరైనా వస్తారనీ అనుకోవడం లేదు.’ అని పరకాల చెప్పారు. ఈ రాష్ట్రం ఏర్పడిందని సంబరాలు చేసుకుంటున్నారని, కానీ ఆ వెంటనే మా కష్టాలను, నష్టాలను గుర్తుకు తెచ్చుకుని సభ జరుపుకుంటుంటే ఈ టేపు విడుదల చేశారని ఆయన అన్నారు. అయినా తమ సభ జరుగుతుందని, తమ సంకల్పం బలపడుతుందని పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు, ప్రజానీకం ఉత్సాహంగా ఈ సభకు తరలి రావాలని పరకాల పిలుపునిచ్చారు.


బాబు గొంతు కాదు, ఎవరూ అరెస్టు చేయలేరు: పరకాల ప్రభాకర్ Posted by: Pratap Updated: Monday, June 8, 2015, 11:54 [IST] Share this on your social network:    FacebookTwitterGoogle+   CommentsMail హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, ఆంగ్లో ఇండియన్ శాసనసభ్యుడు స్టీఫెన్‌సన్‌కు మధ్య జరిగిన సంభాషణ అంటూ విడుదలైన ఆడియో టేప్‌పై ఎపి మీడియా ప్రతినిధి పరకాల ప్రభాకర్ తీవ్రంగా ప్రతిస్పందించారు. అది చంద్రబాబు గొంతు కాదని, తమ ముఖ్యమంత్రి స్టీఫన్‌సన్‌తో మాట్లాడలేదని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఇది నీచమైన, క్షుద్రమైన చర్య అని, కుట్ర అని ఆయన అన్నారు. ఈ విషయాన్ని తేలికగా తీసుకోబోమని ఆయన అన్నారు. తెలంగాణ హోం మంత్రి నాయని నర్సింహా రెడ్డి ప్రకటన తర్వాత ఆ మేరకు ఈ టేప్ విడుదలైందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) కార్యాలయం నుంచి అది విడుదలైందని ఆయన అన్నారు. ఇవాళ టేప్‌ను బయటపెట్టి, చంద్రబాబు మాటలని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. ఆ టేప్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, హోం మంత్రి నాయని చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తమ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నోటీసులు ఇస్తారని తాను అనుకోవడం లేదని, అంత సాహసం చేస్తారని భావించలేమని, చంద్రబాబును ఎవరూ అరెస్టు చేయలేరని ఆయన అన్నారు. ఆ సంభాషణలు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని, టెలిఫోన్ ట్యాప్ చేశారా బయపెట్టాలని ఆయన డిమాండ్చేశారు. చంద్రబాబు ఎక్కడెక్కడో మాట్లాడిన మాటలను గుదిగుచ్చి ఆ టేప్‌ను రూపొందించి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. టెలిఫోన్ ట్యాప్ చేసి ఒక సంభాషణను బయటపెట్టినా, ఎక్కడెక్కడి మాటలనో గుదిగుచ్చి టేప్ తయారు చేసినా నేరమని ఆయన అన్నారు. నోటుకు ఓటు కేసులో సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని, దాని లోతూ అంతూ చూస్తామని, ఈ చర్యకు పాల్పడినవారిని వదిలిపెట్టబోమని ఆయన అన్నారు. వారిని జైలుకు పంపిస్తామని ఆయన అన్నారు. రేపు తాము తలపెట్టిన మహాసంకల్ఫ బహిరంగ సభను భగ్నం చేయడానికి కుట్ర చేశారని ఆయన ఆరోపించారు. రాజ్యాంగబద్గంగా ఏర్పడిన ప్రభుత్వం పట్ల, మంత్రిమండలికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి పట్ల ఉమ్మడి రాజధానిలో ఓ ప్రభుత్వం వ్యవహరించే తీరు ఇదేనా అని ఆయన అడిగారు. దీనికి కారణమైనవారు మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతలు, ప్రజల స్వేచ్ఛ, ఆస్తులకు గవర్నర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. గవర్నర్ బాధ్యతలు తీసుకున్నప్పుడు రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు, ఇద్దరు ముఖ్యమంత్రులకు సరిసమానమైన హక్కులుంటాయని ఆయన అన్నారు. దీనిపై రాజ్యాంగపరంగా, చట్టపరంగా, న్యాయపరంగా, రాజకీయంగా ఎదుర్కుంటామని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం సంబురాలు చేసుకుంటున్నప్పుడు రాష్ట్ర విభజన వల్ల తమకు కలిగిన కష్టనష్టాలను చెప్పుకుని, సవాళ్లను గుర్తించి, లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి మహాసంకల్ప బహిరంగ సభను రేపు తలపెట్టామని, ఆ సభను పాడు చేయడానికి, స్ఫూర్తిని దెబ్బ తీయడానికి, ప్రజల మనో స్థయిర్యాన్ని దెబ్బ తీయడానికి ఈ విధమైన కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. ఈ కుట్రలను సహించేది లేదని ఆయన అన్నారు. రేపటి సభను వాయిదా వేసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోందని, అందులో నిజం లేదని, సభ జరిగి తీరుతుందని ఆయన అన్నారు. నోటుకు ఓటు కేసులో సాక్ష్యాలన్నీ సమర్పించాలని కోర్టు చెప్పిందని, వాటిని కోర్టుకు సమర్పించినప్పుడు ఈ తాజా టేప్ ఎక్కడి నుంచి వచ్చిందో ఎసిబి ఉన్నతాధికారులు, తెలంగాణ హోం మంత్రి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ టేప్ సాక్ష్యాధారాలకు సంబంధించింది కానప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Read more at: http://telugu.oneindia.com/news/andhra-pradesh/cash-vote-parakala-prabhakar-says-the-tone-is-not-chandraba-157700.html

మా సీఎం ఫోన్ ట్యాప్ చేశారా?

Sakshi | Updated: June 08, 2015 02:40 (IST)
మా సీఎం ఫోన్ ట్యాప్ చేశారా?
⇒  ఏపీ ప్రభుత్వ సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్
⇒  సాక్ష్యాధారాలన్నీ కోర్టుకు సమర్పించినప్పుడు ఈ ఆడియో రికార్డింగ్ ఎక్కడిది?
⇒  మమ్మల్ని అభాసుపాలు చేయడానికి, మా స్థ్యైరాన్ని దెబ్బతీయడానికి తెచ్చారా?
⇒  డీజీపీ, ఉన్నతాధికారులు, మంత్రులతో సీఎం చంద్రబాబు సమాలోచనలు


 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో జరిపిన ఫోన్ సంభాషణ రికార్డులు వెలుగు చూసిన నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హుటాహుటిన ఏపీ పోలీసు ఉన్నతాధికారులు, న్యాయవాదులు, పార్టీ సీనియర్ నేతలతో ఆదివారం తన నివాసంలో అర్ధరాత్రి వరకు సమాలోచనలు జరిపారు. అనంతరం ప్రభుత్వ సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు బయటకు పొక్కిన ఆడియోలోని సంభాషణలోనిది ఏపీ సీఎం గొంతు కాదని చెప్పారు. అది ఏపీ ముఖ్యమంత్రి సంభాషణ కాదన్నారు. ఈ కేసులో సేకరించిన సాక్ష్యాధారాలన్నీ కోర్టుకు సమర్పించినప్పుడు ఈ ఆడియో రికార్డింగ్ ఎక్కడినుంచి వచ్చిందని ప్రశ్నించారు. సాక్ష్యాధారాల్లో సేకరించింది కాదా? మా ముఖ్యమంత్రి ఫోన్ ట్యాప్ చేశారా? అని ప్రశ్నించారు. ఏపీ సీఎం ఫోన్ టాప్ చేశామని చెబుతారా? అసలు ఈ టేపులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలన్నారు.

మీకున్న టెక్నాలజీతో గుదిగుచ్చి అభాసుపాలు చేయడానికి, అవమానించడానికి మా మనోస్థయిర్యాన్ని దెబ్బతీయడానికి తెచ్చారా? చెప్పాలని ప్రశ్నించారు. దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి, హోంమంత్రి, ఏసీబీ డీజీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఇది ఫోన్‌ట్యాపింగ్ కాకుండా.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ తన ఫోన్‌లో ఆడియో రికార్డ్ చేసిందని అంటున్నారని విలేకరులు ప్రస్తావించగా.. అలాంటివేమైనా ఉంటే కోర్టు సమక్షంలో ఉండాలి కదా అని పరకాల బదులిచ్చారు. దర్యాప్తు చేస్తున్నవారు ఆడియో, వీడియో టేపులు, ఇతర సాక్ష్యాధారాలు ఏమున్నా కోర్టు ముందుంచాలని, అలాకాకుంటే వీళ్లు రుజువులను తారుమారు చేస్తున్నట్టేనని చెప్పారు. ‘‘కోర్టులో ఉండాల్సినవి బయటకు వచ్చాయంటే మీరు కావాలని గుదిగుచ్చి అభాసుపాలు చేయడానికి చేస్తున్నట్టే. ఈ ఉదంతంపై ఊరుకునే ప్రసక్తే లేదు. అంతుచూస్తాం’’ అని ఆయన హెచ్చరించారు. ‘ఇదంతా తెలంగాణ సీఎం చేసిన పనికాదా? నాకు సంబంధం లేదని ఆయన్ను చెప్పమనండి? ఈ ఆడియో టేపులకు సోర్స్ ఏంటో చెప్పమనండి’ అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై న్యాయపరంగా, చట్టపరంగా, రాజ్యాంగపరంగా పోరాటం చేస్తామన్నారు.

 ఏపీ సీఎం పట్ల వ్యవహరించే తీరు ఇదేనా?
 విభజన చట్టంలోని సెక్షన్ 8లో ఉమ్మడి రాజధానిలో ఉమ్మడి గవర్నర్ భద్రత చర్యలు చేపట్టాల్సి ఉంటుందని, అయితే గవర్నర్ పాత్రేమిటో ఆలోచించుకోవాలని పరకాల అన్నారు. ఉమ్మడి రాజధానిలో ఏపీ సీఎం పట్ల మీరు వ్యవహరించే తీరు ఇదేనా? అని అన్నారు. ఈ కుట్ర వెనుక ఎవరున్నారో వారిని శిక్షించేవరకు, జైలుకు పంపించేవరకు వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఈ కేసుకు సంబంధించి తమకు ఎలాంటి నోటీసులు రాలేదన్నారు. మీరు సంబరాలు చేసుకుని రే పటిరోజున తాము ‘మహాసంకల్పం’ నిర్వహించుకునే దశలో ఇంతటి నీచమైన, క్షుద్రమైన, దారుణమైన పనికి ఒడిగడతారా? అని మండిపడ్డారు. దీనికి మూల్యం చెల్లించకతప్పదన్నారు. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తారా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ చివరివరకూ తీసుకెళ్తామని చెప్పారు.

 ఉలిక్కిపడిన బాబు
 తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యేకు రూ.5 కోట్ల లంచం ఎరవేసి రూ.50 లక్షలు ముట్టజెప్పిన సందర్భంగా అడ్డంగా దొరికిపోయిన రేవంత్‌రెడ్డి కేసులో చంద్రబాబు ప్రమేయమున్నట్టు ఆడియో టేపులద్వారా వెల్లడికావడం తెలుగుదేశం నేతలను కుదిపేస్తోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు వ్యవహారంలో నేరుగా చంద్రబాబు ప్రమేయమున్నట్టు ఆడియో టేపులు టీవీల్లో ప్రసారం కావడం చూసి చంద్రబాబుతోపాటు మంత్రులు, సీనియర్ నేతలు ఉలిక్కిపడ్డారు. స్టీఫెన్‌సన్‌తో జరిపిన ఫోన్ సంభాషణ బయటకు పొక్కిన నేపథ్యంలో చంద్రబాబు ఆగమేఘాలపై ఏపీ పోలీసు ఉన్నతాధికారులు, పలువురు న్యాయవాదులను పిలిపించుకుని తన నివాసంలో అత్యవసరంగా సమావేశమయ్యారు.

అర్ధరాత్రి వరకు అధికారులు, పలువురు మంత్రులతో ఆయన సుదీర్ఘ మంతనాల్లో మునిగిపోయారు. తక్షణం ఎలా స్పందించాలన్న విషయంపై తర్జనభర్జన పడ్డారు. డీజీపీ రాముడుతోపాటు ఇంటెలిజెన్స్ అధికారులు, ఇతర ఉన్నతాధికారులతో సమావేశానంతరం ఆయన న్యాయవాదులు, పార్టీ సీనియర్లతో విడిగా సమాలోచనలు జరిపారు. నామినేటెడ్ ఎమ్మెల్యేతో జరిగిన సంభాషణకు సంబంధించి ఆడియో రికార్డులు ఎలా బయటపడ్డాయి? ఎవరిచ్చారు? తదుపరి చర్యలు ఎలా ఉంటాయి? ఈ మొత్తం వ్యవహారంపై ఎలా స్పందించాలి? వంటి అంశాలపై చంద్రబాబు లోతుగా చర్చించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. సుదీర్ఘ మంతనాల అనంతరం పరకాల ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు.
  అయితే, పరకాల ప్రభాకర్ వివరణపై పెదవి విరిచిన పలువురు తమకు సూటిగా సమాధానం చెప్పాలంటూ పలు ప్రశ్నలు సందించారు.
 ఈ ప్రశ్నలకు సమాధానాలేవీ?
► టేపుల్లో ఉన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు స్వరం కాదంటారు... ఆ వెంటనే వేర్వేరు సందర్భాల్లో మాట్లాడిన చంద్రబాబు మాటలే అతికించారంటారు. ఇందులో ఏది నిజం?
► ఆ టేపుల్లో ఉన్నది తన స్వరం కాకపోతే చంద్రబాబు స్వయంగా ఎందుకు ఖండించలేదు?
► రేవంత్‌రెడ్డి వ్యవహారం బయటపడినప్పటినుంచీ చంద్రబాబు ఆ అంశంపై నోరెందుకు విప్పలేదు?
►  రేవంత్ ఎపిసోడ్‌తో మాకు సంబంధం లేదని చెప్పే ధైర్యం ఇప్పటివరకూ
 టీడీపీకి ఎందుకు లేకపోయింది?
► యావత్ తెలుగుజాతి టీడీపీని ముద్దాయిగా చూస్తున్నా నిజమేంటో చెప్పే ప్రయత్నం ఎందుకు చేయలేదు?
► రేవంత్‌రెడ్డిపై కుట్రచేశారని బుకాయిస్తారే తప్ప... రేవంత్‌రెడ్డి రూ.50 లక్షలు ఇచ్చింది వాస్తవంకాదా? ‘బాస్’ చెప్తేనే వచ్చానని చెప్పలేదా?
► ఎమ్మెల్యేను కొనేందుకు ప్రయత్నిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డంగా దొరికిపోతే... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిపై కుట్ర జరిగిందంటారేం. ఏపీ సీఎంకు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలతో ఏం అవసరం?
► మీ పార్టీ, మీ అధినేత తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మార్చాలని చూస్తారేం?

No comments:

Post a Comment