Monday 22 June 2015

అనంతలో ఆగని అన్నదాతల ఆందోళన

అనంతలో ఆగని అన్నదాతల ఆందోళన

అనంతపురం జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి) : సబ్సిడీ విత్తన వేరుశనగ కాయల కోసం అనంతపురం జిల్లాలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. సోమవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతన్నలు వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చే శారు. మరోవైపు రైతుల పక్షాన సీపీఐ, సీపీఎం రైతు సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. ఉరవకొండ, వజ్రకరూరులలో రైతులు రాస్తారోకో చేసి నిరసన వ్యక్తం చేశారు. కళ్యాణదుర్గంలో అన్నదాతలు రోడ్లెక్కారు. ముందుగా వ్యవసాయ కార్యాలయాన్ని ముట్టడించారు. అధికారులను గది లో నిర్బంధించారు. అనంతరం రాస్తారోకో చేశారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్రఅంతరాయం ఏర్పడింది. కూడేరు మండల కేంద్రంలోనూ రైతులు రాస్తారోకో చేపట్టారు. గుంతకల్లులో సీపీఎం ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. కరువురైతుకు వెంటనే విత్తన వేరుశనగ కాయలు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు

No comments:

Post a Comment