Tuesday, 30 June 2015

'Not-before-me' scene repeats in SC, too!

'Not-before-me' scene repeats in SC, too!

Published Date : 06-Jan-2012 02:13:40 GMT

http://www.greatandhra.com/politics/gossip/not-before-me-scene-repeats-in-sc-too-34794.html


Y S Vijayalakshmi, widow of former Chief Minister Y S  Rajasekhar Reddy, who had moved the Supreme Court seeking transfer of her petition against Telugu Desam Party president N Chandrababu Naidu and others from the Andhra Pradesh High Court, had to face the same situation which she had encountered in the High Court.

A Supreme Court bench comprising Dalvir Bhandari and Deepak Mishra on Thursday refused to take up her petition, after the defence lawyer Harish Salve brought to the notice of the bench that Justice Bhandari had refused to take up cases in which Reliance Industries Limited was a defendant.
Obviously, Justice Bhandari had stakes in the RIL. The SC bench, then, announced that the case would be transferred to another bench.

Vijayamma faced a similar situation in AP High Court in the past. The HC bench comprising Chief Justice M B Lokur refused to take up the case since he had shares in RIL. The case then got transferred first to Justice Eshwaraiah bench and then later to Justice Rohini bench, thanks to the clever ploy by Naidu’s lawyers using the “not-before-me” tradition in the court.

Vijayamma contended that both Eshwaraih and Rohini had acted in favour of Naidu in the past.

Now, it remains to be seen to which bench Naidu’s case gets transferred in Supreme Court.
- See more at: http://www.greatandhra.com/politics/gossip/not-before-me-scene-repeats-in-sc-too-34794.html#sthash.NrKmHUJz.dpuf

Monday, 29 June 2015

గ్రీస్‌లో తీవ్ర ఆర్థిక సంక్షోభం..

గ్రీస్‌లో తీవ్ర ఆర్థిక సంక్షోభం...
వారం రోజుల పాటు బ్యాంకుల మూసివేత

గ్రీస్‌, జున్‌ 2 : గ్రీస్‌ను మరోసారి ఆర్థిక సంక్షోభం ముంచేసింది. జాతీయ బ్యాంకులను వారం రోజుల పాటు మూసివేస్తూ ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో కస్టమర్లు బ్యాంకుల ముందు క్యూ కడుతున్నారు. ఈ సంక్షోభ ప్రభావం ఆసియా మార్కెట్లపై పడింది. జపాన్‌, సియోల్‌, హంకాంగ్‌ మార్కెట్లు నష్టాలు నమోదు చేశాయి. అత్యవసర నిధుల విడుదలను పొడిగించేది లేదని యురోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ తేల్చి చెప్పడంతో ప్రభుత్వం జాతీయ బ్యాంకులను మూసివేసింది. ప్రభుత్వ ప్రకటనలవల్ల పెన్షనర్లు బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తున్నారు. తమ అకౌంట్లలోని డబ్బులు డ్రా చేసుకునేందుకు ఎగబడుతున్నారు.

ఆర్థిక సంక్షోభంపై అత్యవసర సమావేశం అయిన కేంద్ర కేబినెట్‌ బ్యాంక్‌ మూసివేతపై నిర్ణయం తీసుకుంది. జులై 7వ తేదీ వరకు బ్యాంకులను మూసివేయనున్నారు. అంతేకాదు ప్రతి రోజు డ్రా చేయాల్సిన మొత్తాన్ని కూడా 66 డాలర్లకు కుదించారు. గత శనివారం ఉద్దీపన ప్యాకేజీపై యూరో జోన్‌ దేశాల మద్య జరిగిన చర్చలు ఎటువంటి ఒప్పందం లేకుండా ముగిసాయి. దాంతో జులై 5న గ్రీస్‌ ప్రభుత్వం ఉద్దీపన ప్యాకేజీపై రిఫరెండం నిర్వహించాలని నిర్ణయించింది.

Saturday, 27 June 2015

వారానికి నాలుగు రోజులు విజయవాడలోనే

వారానికి నాలుగు రోజులు విజయవాడలోనే
ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి
సెక్షన్‌8పై టి.సర్కార్‌ది ఏకపక్ష వ్యవహారం

విజయవాడ, జూన్‌ 27 : వారానికి నాలుగు రోజులు విజయవాడలోనే ఉంటానని...కార్యాలయం పూర్తి అవకున్నా బస్సులోనే ఉండి కార్యకలాపాలు సాగిస్తానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. శనివారం టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం మాట్లాడుతూ త్వరలో అన్ని శాఖల కార్యాలయాలను విజయవాడకు తరలించనున్నట్లు చెప్పారు.
 
ఎన్ని ఇబ్బందులు వచ్చినా అనుకున్న పనులు చేయగలిగామన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలపై నేతలకు అవగాహన ఉండాలని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించారు. రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేశామని బాబు అన్నారు. రూ.5 వేల కోట్లతో ఎస్సీ సబ్‌ప్లాన్‌, రూ.2 వేల కోట్లతో ఎస్టీ సబ్‌ప్లాన్‌, రూ.6 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌ అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అభివృద్ధిని వివరిస్తే ప్రజలు ఆమోదిస్తారన్నారు. అభివృద్ధిలో కార్యకర్తలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
 
సమస్యలపై కూర్చుని మాట్లాడుకుందామంటే తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావడం లేదని సీఎం చంద్రబాబు విమర్శించారు. ఇద్దరం కలిసి కూర్చుంటే ఆమోదయోగ్యమైన పరిష్కారం వస్తుందని అభిప్రాయపడ్డారు. సెక్షన్‌-8పై తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. విద్యుత్‌ ఉద్యోగుల సమస్యను గవర్నర్‌కు చెప్పినా పరిష్కారం కాలేదన్నారు. 9,10 షెడ్యూల్‌ సంస్థలపై తెలంగాణ ప్రభుత్వ తీరు సరికాదని సీఎం తెలిపారు.
 
ఎన్నికల ముందు కావాలని జగన్‌ను బయటికి తీసుకువచ్చారన్నారు. వైసీపీని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్‌ రాజకీయాలు చేస్తోందని ఆగ్రహించారు. టీడీపీని దెబ్బతీసేందుకు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, వైసీపీ కుట్ర చేస్తున్నాయని చంద్రబాబునాయుడు ఆరోపించారు.

Friday, 26 June 2015

ఏసీబీ చేతికి ఎఫ్ఎస్ఎల్ నివేదిక

టుకు నోటు కేసులో కీలక మలుపు
ఏసీబీ చేతికి ఎఫ్ఎస్ఎల్ నివేదిక

హైదరాబాద్, జూన్ 26: ఓటుకు నోటు కేసు మరో కీలక ఘట్టానికి చేరుకుంది. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలపై ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్(ఎఫ్ఎస్ఎల్) ఇచ్చిన నివేదిక ఏసీబీ చేతికి అందింది. ముందుగా ఎఫ్ఎస్ఎల్ అధికారులు తమ నివేదికను హైకోర్టులో సమర్పించారు. అయితే ఏసీబీ అధికారులు ఎఫ్ఎస్ఎల్ నివేదికను తమకు ఇవ్వాలని కోరుతూ దీనికి సంబంధించి ఎఫ్ఎస్ఎల్ అనుమతి లేఖతో కోర్టులో మెమో దాఖలు చేశారు. ఈ మేరకు హైకోర్ట ధర్మాసనం ఎఫ్ఎస్ఎల్ నివేదికతో పాటుగా మూడు హార్డ్ డిస్కులు, ఒక సీడీని ఏసీబీ అధికారులకు ఇచ్చింది. కాగా, ఈ నివేదిక ఆధారంగా ఓటుకు నోటు కేసులో ఏసీబీకి తదుపరి చర్యలకు రంగం సిద్ధం చేసింది

Thursday, 25 June 2015

బాబుగారి కథలు చెల్లవిక

http://www.sakshi.com/news/andhra-pradesh/forensic-report-reveals-about-note-for-vote-case-audio-video-tapes-251671?pfrom=home-top-story

విజయవాడకు రాజధాని కళ!

విజయవాడకు రాజధాని కళ!

 చురుగ్గా సీఎం క్యాంపు కార్యాలయం పనులు
 లింగమనేని అతిథిగృహంలోనే బస?
విజయవాడ, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): ఏపీ వాణిజ్య రాజధాని విజయవాడ త్వరలో తాత్కాలిక రాజధాని కళను సంతరించుకోనుంది. వారానికి మూడు రోజులు విజయవాడ నుంచే అధికారిక కార్యకలాపాలు నిర్వహిస్తానని ప్రకటించిన ఏపీ సీఎం చంద్రబాబు దానికి త్వరలో కార్యరూపం ఇవ్వనున్నారు. పలు ఆటంకాలు, వాయిదాల తర్వాత సీఎం విజయవాడ క్యాంప్‌ ఆఫీస్‌ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. మరోవైపు చంద్రబాబు నివాసం ఉండేందుకు కృష్ణానదీ తీరాన గుంటూరు జిల్లా ఉండవల్లి పంచాయతీ పరిధిలో ఉన్న లింగమనేని గ్రూపునకు చెందిన అతిథిగృహాన్ని పలువురు ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. వివాదాస్పదమైన ఈ అతిథిగృహంలో సీఎం బస చేయకపోవచ్చని తొలుత భావించినా, పరిశీలనకు వచ్చే అధికారుల తాకిడి తగ్గకపోవడంతో ఇక్కడే సీఎం బస చేయవచ్చని స్థానిక అధికారులు భావిస్తున్నారు. తాజా పరిణామాలతో సీఎం కొద్ది రోజుల్లోనే ఇక్కడికి తరలి రావడం తథ్యమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీఎం బాటలోనే వివిధ శాఖల మంత్రులు తమ క్యాంపు కార్యాలయాలను ఈ ప్రాంతంలో ఏ ర్పాటు చేసుకుంట ుండడం, పలు వి భాగాల ప్రధాన కా ర్యాలయాలు సైతం ఇక్కడికి వచ్చేందుకు సమాయత్తమవుతుండటంతో విజయవాడ తాత్కాలికంగానైనా రాజధాని కళ సంతరించుకోనుంది. సీఎం, మంత్రులు వారానికి మూడు రోజులు విజయవాడలో బస చేస్తే ఏపీలోని 13 జిల్లాల నుంచి ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌కి రాకపోకలు తగ్గిపోయే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదే సమయంలో విజయవాడలో రద్దీ పెరిగే అవకాశం ఉంది.

TDP Chief Chandrababu Naidu submits a letter to Pranab mukherji


TDP to send Telangana resolution to Pranab panel

PRINT   ·   T  T  
Special Correspondent
HYDERABAD: In a follow-up to the adoption of the resolution on separate Telangana by the TDP’s Polit Bureau, the party is believed to have decided to send it to the UPA’s sub committee headed by Union Minister Pranab Mukherji, which is studying the issue.
Party sources said a copy of the resolution would be sent in a day or two coinciding with the short session of Parliament beginning Saturday. It would put an end to the speculation over whether the party would withdraw its earlier representation favouring a unified State or write a letter on the change in its stand.
Details on stance
After deliberating on the issue, the party has now decided to send the ‘self-explanatory’ resolution. The resolution details the circumstances under which it had to change its stand and favour separate Telangana in deference to the wishes of the people of the region.
Meanwhile, at a press conference on Friday, senior TDP leaders Ummareddy Venkateswarlu and Ravula Chandrasekhara Reddy made it clear that the party was fully behind N. Chandrababu Naidu.

KCR or Naidu: Who called whom?

KCR or Naidu: Who called whom?
The report that Telangana Rashtra Samithi president K Chandrasekhar Rao had a telephonic talk with Telugu Desam president N Chandrababu Naidu over a possible pre-poll alliance has generated a lot of interest among the political observers as well as people of Telangana.
Though it is more or less understood that the TD and TRS are seriously planning for an alliance to take on both Congress as well as Devender Goud, the curious question was who called whom: Naidu or KCR to discuss the subject. While both "Sakshi" and "Andhra Jyothy" reported that it was Naidu who called up KCR and broached the subject of alliance. They were trying to impress upon the readers that Naidu got panicky with large scale exodus of party leaders into Chiranjeevi camp in the last couple of days, since it is the more reasonable argument.
Only Eenadu wrote that both had a telephonic conversation and did not mention who called whom.
Inquiries, however, revealed that it was KCR who had called up Naidu and discussed the possibility of a pre-poll alliance between TRS and TD. Prior to that he got a call from TD MP Errabelli Dayakar Rao, who has been brainwashing Naidu over announcing a positive decision on Telangana issue, which would pave way for the alliance. Dayakar asked KCR to call up Naidu and raise the issue, since Naidu appears to be a bit positive about Telangana issue. That's how the conversation took place. It was only a preliminary talk and more such mid-night discussions would take place in near future, sources said.
- See more at: http://www.greatandhra.com/viewnews.php?id=8510&cat=&scat=4#sthash.6H40ikO2.dpuf

TRS joins TDP-led Grand Alliance

Rediff.com  » News » TRS joins TDP-led Grand Alliance in Andhra

TRS joins TDP-led Grand Alliance in Andhra

ShareComment
To get such articles in your inbox
Text size:  A   A   A

January 31, 2009 20:12 IST
 The Telugu Desam Party-led Grand Alliance in Andhra Pradesh got a major boost on Saturday with the Telangana Rashtra Samiti formally announcing its decision to join the alliance.
The TRS had been holding political negotiations with both the Grand Alliance and Chiranjeevi's Praja Rajyam Party.
TRS chief K Chandrasekhara Rao, accompanied by other party leaders, met TDP supremo N Chandrababu Naidu today afternoon and formally joined the alliance.

Though both sides are keeping the number of seats to be shared by them under wraps, sources said that the TDP has agreed to give up 9 Lok Sabha seats in the Telangana region to the TRS.
Though the PRP had agreed to give TRS its desired number of seats, the party decided to join hands with the TDP as many senior leaders felt that only Naidu's party had the strength to defeat the ruling Congress.

After meeting Naidu, Rao told the reporters, "Our alliance is going to sweep the elections in the state. We will win at least 200 seats. The Congress will certainly be defeated".
He added that the details of the seat sharing agreement will be announced at a public meeting.
TDP leader Yerran Naidu said that the main purpose of the alliance was to defeat the Congress in the upcoming state elections. The TDP has recently reversed its stand on the issue and announced its support for the creation of Telangana.

The TRS received another shot in the arm today when the Talli Telangana, led by actress Vijayshanti, deciding to merge with it.
Vijayshanti, who had earlier walked out of the Bharatiya Janata Party and formed her own party, accepted the primary membership of TRS in the presence of Chandrasekhara Rao.

మే 21న గ్రాండ్ సితారలో జగన్‌ ఎవరిని కలిశారు?

మే 21న గ్రాండ్ సితారలో జగన్‌ ఎవరిని కలిశారు?

హైదరాబాద్, జూన్ 24 (ఆంధ్రజ్యోతి):  సెక్షన్‌ 8 అమలుపై ప్రతిపక్ష వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి నోరువిప్పాలని టీడీపీ మంత్రులు, నాయకులు డిమాండ్‌ చేశారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు విలేకరులతో మాట్లాడుతూ సెక్షన్‌ 8పై తాము రాజకీయాలకు అతీతంగా పోరాడుతుంటే జగన్‌ నోరు మెదపడంలేదని విమర్శించారు. జగన్‌ టీఆర్‌ఎస్‌ నేత కేసీఆర్‌తో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. కాగా పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనపడినట్లు అవినీతిలో కూరుకుపోయిన జగన్‌కు అంతా తేడాగా కనబడుతున్నదని హైదరాబాద్‌లో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఆయన కళ్లకు కనపడకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. నేతలంతా సెక్షన్‌ 8పై మాట్లాడుతుంటే జగన్‌ మాత్రం ఈ విషయంపై నోరు మెదపడం లేదని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ వ్యాఖ్యానించారు. కడప జిల్లా కమలాపురంలో ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజల ద్రోహి కేసీఆర్‌కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు ఇస్తారా అని ప్రశ్నించారు. కాగా, మే 21వ తేదీన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 12లో ఉన్న గ్రాండ్‌ సితార హోటల్లో వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఎవరిని కలిశారో బహిర్గతం చేయాలని టీడీపీ ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ డిమాండ్‌ చేశారు. బుధవారం హైదరాబాద్‌లో ఆమె మాట్లాడుతూ ‘అక్కడ ఏం జరిగింది? ఆయన ఎవరిని కలిసి మాట్లాడారు? చెప్పాలి. ఒక పెద్ద కుట్రకు అక్కడ అంకురార్పణ జరిగింది. జగన్‌ తన బెయిల్‌ కోసం అడుగుతారుగాని సెక్షన్‌ 8 గురించి మాత్రం మాట్లాడరు. టీఆర్‌ఎ్‌సకుకి కేసీఆర్‌ అధ్యక్షుడు అయితే జగన్‌ షాడో అధ్యక్షుడు’ అని ఆమె విమర్శించారు.

టీడీపీని దెబ్బతీసేందుకు టీఆర్‌ఎస్‌, వైసీపీ కుమ్మక్కు : టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు
 హైదరాబాద్‌, జూన్‌ 25 : టీడీపీని దెబ్బ తీసేందుకు టీఆర్‌ఎస్‌ వైసీపీతో కుమ్మక్కు అయిందని టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆరోపించారు. హోటల్‌లో జగన్‌, టీఆర్‌ఎస్‌ నేతలు కలిశారని తమకు సమాచారం ఉందన్నారు. సెక్షన్‌ 8ను అమలు చేయాల్సిందేనని ఆయన అన్నారు. గతేడాది చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారని, గవర్నర్‌కు అధికారాలుంటే జేఎన్టీయూలో ప్రొఫెసర్‌పై దాడి జరిగేదా అని ఆయన ప్రశ్నించారు. 

అసలు కేసు ఇదీ!

అసలు కేసు ఇదీ!
‘కేసుల’ పర్యవేక్షణపైనే గవర్నర్‌ దృష్టి


  • దానిపైనే ఏజీ అభిప్రాయం కోసం లేఖ
  • సెక్షన్‌- 8పై ఏడాదిగా సాగుతున్న వివాదం
  • బాబు, కేసీఆర్‌, కేంద్రం మధ్య ఉత్తరాల పర్వం
  • స్పష్టత కావాలని లేఖలు రాసిన రాజ్‌భవన్‌
 
గవర్నర్‌కు గతంలోనే మార్గదర్శకాలిచ్చిన కేంద్రంఅటార్నీ జనరల్‌ ఏం చెప్పారో తెలిసింది! ఇంతకీ గవర్నర్‌ ఏం అడిగారు? నరసింహన్‌ దేని గురించి అడిగితే అటార్నీ జనరల్‌ అలాంటి వివరణ ఇచ్చారు? ఇద్దరి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు మొత్తం సెక్షన్‌- 8 అమలు గురించేనా? లేక తాజాగా తెరపైకి వచ్చిన కేసుల పర్యవేక్షణ గురించా? ఇవీ ఇప్పుడు కుతూహలం కలిగిస్తున్న ప్రశ్నలు. వీటికి సమాధానం కోసం అన్వేషించినపుడు ఆసక్తికర సమాచారం బయటపడింది.
 
హైదరాబాద్‌, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్‌పై గవర్నర్‌ చేతికి అధికారాలు కట్టబెట్టే సెక్షన్‌- 8ను అమలు చేయాల్సిందేనని ఆంధ్రప్రదేశ్‌ నేతలు, వద్దే వద్దని తెలంగాణ నేతలు వాదిస్తున్నారు. విభజన చట్టంలోని ఈ సెక్షన్‌ వ్యవహారం ఇప్పుడే తెరపైకి వచ్చినట్టు హంగామా చేస్తున్నారు. కానీ, అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... రాష్ట్ర విభజన (జూన్‌ 2, 2014) జరిగిన కొన్ని రోజుల నుంచే దీనిపై కీలక పరిణామాలు సంభవించాయి. హైదరాబాద్‌లో సెక్షన్‌ 8 అమలు కోసం తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీ సీఎం చంద్రబాబు సరిగ్గా ఏడాది క్రితం కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గత ఏడాది జూన్‌ 24న ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. ‘‘హైదరాబాద్‌లో నివసిస్తున్న సీమాంధ్రుల భద్రత, మనోభావాలను పరిగణనలోకి తీసుకొని విభజన చట్టంలో సెక్షన్‌ 8 పెట్టారు. ఇందులోని నిబంధనల పరిరక్షణకు అవసరమైతే రాజ్యాంగ సవరణ కూడా చేస్తామని హామీ ఇచ్చారు. తాజాగా తెలంగాణ బిజినెస్‌ రూల్స్‌లో ఈ నిబంధనలు చేరిస్తే సరిపోతుందని కేంద్ర హోం శాఖ ప్రతిపాదించినట్లు నా దృష్టికి వచ్చింది. కానీ ఇది సరిపోదన్నది నా అభిప్రాయం. హైదరాబాద్‌ నగరంలోని పోలీస్‌ బలగాలను, కమిషనర్‌ స్థాయి నుంచి కింది వరకు, ఉభయ రాషా్ట్రల వారితో కూర్పు చేయాలి. శాంతి భద్రతలు, అంతర్గత భదత్ర, ముఖ్యమైన సంస్థల భద్రతకు సంబంధించిన అంశాల్లో హైదరాబాద్‌, సైబరాబాద్‌ కమిషనర్లు గవర్నర్‌కు బాధ్యత వహించేలా చూడాలి. ఉమ్మడి రాజధాని పాలనకు నియమితులైన అధికారులు గవర్నర్‌ సలహాదారుల ద్వారా గవర్నర్‌కు రిపోర్ట్‌ చేసేలా చూడాలి. ఈ దిశగా కేంద్ర హోం శాఖ తక్షణం చర్యలు తీసుకొనేలా చూడండి’’ అని చంద్రబాబు ఆ లేఖలో ప్రధానికి విజ్ఞప్తి చేశారు. 
 
కొద్ది రోజులకే కేంద్రం స్పందన
చంద్రబాబు లేఖపై కేంద్రం స్పందించింది. హోం శాఖ సంయుక్త కార్యదర్శి సురేష్‌ కుమార్‌ ఆగస్టు 6న తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఒక లేఖ రాశారు. సెక్షన్‌ 8 అమలుకు సంబంధించి కొన్ని నిర్దిష్ట చర్యలు తీసుకోవాల్సిందిగా అందులో సూచించారు. ‘‘విభజన చట్టం రూపొందే సమయంలో హైదరాబాద్‌లో ఉంటున్న ఇతర ప్రాంతాల వారి ఆస్తులు, స్వేచ్ఛ, భద్రతకు సంబంధించి కేంద్రానికి అనేక వినతులు అందాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని కేంద్రం గవర్నర్‌కు ప్రత్యేక బాధ్యతలను అప్పగించింది. పార్లమెంటు కూడా ఈ కోణాన్ని అంగీకరించింది. అందువల్ల సెక్షన్‌ 8 కింద రికార్డులు, లేదా సమాచారం లేదా మంత్రివర్గ నిర్ణయాలకు సంబంఽధించిన సమాచారాన్ని కోరే హక్కు గవర్నర్‌కు ఉంటుంది. ఉమ్మడి రాజధాని ప్రాంతానికి సంబంధించి హైదరాబాద్‌, సైబరాబాద్‌ కమిషనర్లు, రంగారెడ్డి ఎస్పీ నియమిత కాల వ్యవధిలో గవర్నర్‌కు శాంతిభద్రతల నివేదికలు ఇవ్వాలి. తీవ్రమైన నేరాలకు సంబంధించి ప్రత్యేక నివేదికలు కూడా సమర్పించాలి. వీటిపై చట్ట పరిధిలో ఆదేశాలు జారీ చేసే హక్కు గవర్నర్‌కు ఉంటుంది. ఇక ప్రత్యేక ప్రాధాన్యం ఉన్న అంశాలను పోలీస్‌ అధికారులు గవర్నర్‌కు నివేదించాలి. వాటిపై గవర్నర్‌ సలహాను పాటించాలి. తెలంగాణ డీజీపీ, ఉభయ కమిషనరేట్ల కమిషనర్లతో ఒక బోర్డు ఏర్పాటు చేసి, దాని ఆధ్వర్యంలోనే ఉమ్మడి రాజధానిలో పోలీస్‌ అధికారుల బదిలీలు, పోస్టింగులపై నిర్ణయం తీసుకోవాలి. వీటిలో మార్పుచేర్పులు చేయడానికి గవర్నర్‌కు అధికారం ఉంటుంది. అధికారులు ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే దానిపై నివేదిక కోరే, విచారణకు ఆదేశించే హక్కు, చర్య తీసుకొనే అధికారం గవర్నర్‌కు ఉంటాయి. బాధితుల హక్కుల రక్షణ కోసం ఆయన అవసరమైన ఆదేశాలు కూడా జారీ చేయవచ్చు’’ అని కేంద్రం ఆ లేఖలో స్పష్టం చేసింది.
 
ససేమిరా అన్న తెలంగాణ ప్రభుత్వం
దీనిపై తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించింది. గవర్నర్‌కు విస్తృత అధికారాలు ఇవ్వాలనడం సరికాదని స్పష్టంచేస్తూ, కేంద్రం లేఖ అందిన మూడు రోజులకే అంటే 2014 ఆగస్టు 9నే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ‘‘గవర్నర్‌కు అధికారాలు ఇవ్వాలనడం రాజ్యాంగం ప్రవచించిన సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. ఒకవేళ గవర్నర్‌ తన అధికారాలను వినియోగించుకోవాల్సి వచ్చినా, తెలంగాణ కేబినెట్‌ సలహా మేరకే నడచుకోవాలి. విభజన చట్టం ప్రకారమైనా కూడా తెలంగాణ మంత్రి మండలి సలహాలను ఆయన పాటించాల్సిందే. అందువల్ల హోంశాఖ పంపిన నోట్‌ను ఉపసంహరించుకోవాలి’’ అని కేసీఆర్‌ తన లేఖలో మోదీని కోరారు. దీంతో ఈ విషయం అలా పెండింగ్‌లో పడిపోయింది. కొన్నాళ్ల తర్వాత కేంద్రం తెలంగాణ ప్రభుత్వానికి మరో లేఖ రాసింది. విభజన చట్టం ప్రకారం సెక్షన్‌-8 అమలుపై తాము ఇప్పటికే మార్గదర్శకాలు సూచించినందున తదనుగుణంగా బిజినెస్‌ రూల్స్‌లో మార్పులు చేసుకోవాలని కేంద్రం అందులో సూచించింది. అయితే ఈ మార్గదర్శకాలు రాజ్యాంగ విరుద్ధమనీ, దీన్ని ఆమోదించడం లేదని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేంద్రానికి లేఖ రాశారు.
 
 రంగంలోకి దిగిన రాజ్‌భవన్‌
విషయం ఇక్కడితో ఆగిపోలేదు. సెక్షన్‌- 8 అమలుకు సంబంధించి తనకు అనేక వినతులు వస్తున్నాయని, ఆపరేషనల్‌ గైడ్‌లైన్స్‌ లేకుండా దాన్ని అమలు చేయలేమని, అందువల్ల ఆపరేషనల్‌ గైడ్‌లైన్స్‌ కోసం రూల్స్‌ తయారు చేయాలని రాజ్‌భవన్‌ పలుమార్లు కేంద్రాన్ని కోరినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తెలంగాణ సర్కారు బిజినెస్‌ రూల్స్‌లో మార్పులు జరగకుండా అధికారులు గవర్నర్‌కు రిపోర్ట్‌ చేయడం కుదరదు కనుక, గైడ్‌లైన్స్‌ అవసరాన్ని నొక్కిచెప్పినట్టు సమాచారం. ఈ మేరకు కేంద్రానికి గవర్నర్‌ లేఖలు కూడా రాసినట్టు ఢిల్లీలోని హోంశాఖ వర్గాలు తెలిపాయి. అయితే విభజన చట్టంలో ‘పవర్‌ టు మేక్‌ రూల్స్‌’ అనే నిబంధన లేనందున, ఆపరేషనల్‌ గైడ్‌లైన్స్‌ జారీ చేసే వెసులుబాటు లేదని కేంద్ర హోంశాఖ పేర్కొంది. అదే సమయంలో ‘‘గవర్నర్‌ విధులు, భాధ్యతలు, అధికారాలు (ఫంక్షనాలిటీస్‌)’’ మీద సవివరమైన నోట్‌ ఒకటి తయారు చేసి, గవర్నర్‌ వ్యక్తిగత అవగాహన కోసం రాజ్‌భవన్‌కు పంపినట్టు తెలిసింది. 2014 ఆగస్టు 6న కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి సురేష్‌ కుమార్‌ రాసిన లేఖకు కొనసాగింపుగా ఇది ఉన్నట్టు సమాచారం. అయితే దీన్ని రాజ్‌భవన్‌ వర్గాలు బయటపెట్టలేదు.
 
కేసుల పర్యవేక్షణే గవర్నర్‌ లక్ష్యం
కేంద్రం పంపిన ఆ నోట్‌ ఆధారంగానే గవర్నర్‌ నరసింహన్‌ తాజా వివాదాలపై అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గీ అభిప్రాయం కోరినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ‘‘ఉమ్మడి రాజధాని ప్రాంతం ఒక రాష్ట్ర పరిధిలో ఉంది. ఇక్కడ మరో రాష్ట్ర ముఖ్యమంత్రి, పోలీసులు కూడా ఉన్నారు. పరస్పరం వివాదాలు సాగుతున్నాయి. ఓటుకు నోటు కేసు రాజకీయ వివాదంగా మారింది. ఈ కేసు దర్యాప్తులో తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇది రెండు ప్రభుత్వాల మధ్య రాజకీయ యుద్ధంగా మారింది. పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పరస్పరం కేసులు పెట్టుకునే పరిస్థితి. ఇది శాంతిభద్రతల సమస్యకు దారితీసే అవకాశం ఉంది. సెక్షన్‌ 8 ప్రకారం హైదరాబాద్‌లో శాంతి భద్రతల పర్యవేక్షణ గవర్నర్‌ చేతిలో ఉండాలి. ఓటుకు నోటు వ్యవహారం శాంతి భద్రతల వివాదానికి దారి తీస్తుంది కాబట్టి, సెక్షన్‌ -8 ప్రకారం ఈ కేసు దర్యాప్తును నేను నేరుగా (తెలంగాణ ప్రభుత్వంతో సంబంధం లేకుండా) పర్యవేక్షించవచ్చా? అందుకోసం నోటిఫికేషన్‌ ఇవ్వవచ్చా? ఆ నోటిఫికేషన్‌ ముసాయిదాను మీరు తయారు చేసి పంపించగలరా?’’ అని గవర్నర్‌ ఏజీని అడిగినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు జూన్‌ 16, 2015న ఏజీకి లేఖ రాశారు. గవర్నర్‌ పేర్కొన్న నోటిఫికేషన్‌ ‘మొత్తం క్లాజ్‌ (సెక్షన్‌-8)’ అమలు కోసం కాదనీ, కేవలం సబ్జెక్ట్‌ (రెండు కేసులపై) క్లారిఫికేషన్‌కు సంబంధించినదనీ నిపుణులు పేర్కొంటున్నారు. అందువల్లే ఏజీ కూడా గవర్నర్‌ తన విచక్షణ మేరకు నోటిషికేషన్‌ జారీ చేయవచ్చని పేర్కొన్నట్టు చెప్పారు. ఏజీ లేఖ మొత్తం కూడా కేసులపై పర్యవేక్షణకు సంబంధించిన వివరణలాగే ఉందని వారు వివరించారు. విభజన చట్టం ప్రకారం సెక్షన్‌ 8 అమల్లో ఉన్నట్టే కేంద్రం, రాజ్‌భవన్‌ భావిస్తున్నదనీ, అందువల్లే దాని కింద అధికారాలు వినియోగించుకునేందుకు ప్రయత్నం జరిగిందని చెబుతున్నారు. అయితే ఒకసారి ఇందుకు అవకాశం ఇస్తే ఇది ఆనవాయితీగా మారుతుందనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని వివరించారు. కాగా రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మారిన సెక్షన్‌-8 వ్యవహారంపై గవర్నర్‌ లేఖలో ఏముందన్నదానిపై అటు రాజ్‌భవన్‌గానీ, ఇటు ఏజీ కార్యాలయంగానీ అధికారికంగా ఎలాంటి వివరణ ఇవ్వకపోవడం పట్ల ఇరు రాష్ట్రాల్లోని రాజకీయ ముఖ్యులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు.

Wednesday, 24 June 2015

బెంగళూర్‌ బయల్దేరిన సీఎం చంద్రబాబు

బెంగళూర్‌ బయల్దేరిన సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌, జూన్‌ 24 : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం ఉదయం బెంగళూరు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా స్వచ్ఛ భారత్‌పై జరుగనున్న ముఖ్యమంత్రుల సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారు.

8 కాదంటే యూటీ కోరతాం: కొల్లు రవీంద్ర

8 కాదంటే యూటీ కోరతాం: కొల్లు రవీంద్ర

సెక్షన్‌-8 అమలు చేయడం కుదరదు అంటే హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని కేంద్రాన్ని కోరతామని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. హైదరాబాద్‌లో పదేళ్లపాటు ఇద్దరికీ అధికారాలు ఉన్నాయని అన్నారు. ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతల విషయంలో గవర్నర్‌కు పూర్తి అధికారం ఉందన్నారు. సెక్షన్‌-8 అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని చెప్పారు

సెక్షన్‌ - 8 ఎందుకు చెల్లదు? - అశోక్‌బాబు

సెక్షన్‌ - 8 ఎందుకు చెల్లదు?
ఏపీపై గవర్నర్‌ది పక్షపాత ధోరణి
విశాఖలో ఏపీఎన్జీవో నేత అశోక్‌బాబు

విశాఖపట్నం, జూన్‌ 24 : తెలంగాణ ప్రభుత్వం సెక్షన్‌-8కు ఒప్పుకోకపోతే విభజననే లేదని ఏపీఎన్జీవో నేత అశోక్‌బాబు అన్నారు. బుధవారం జిల్లాలో ఆంధ్రుల ఆత్మగౌరవం సెక్షన్‌-8 అమలుపై ఏపీ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతూ అన్ని సెక్షన్లు చెల్లినప్పుడు సెక్షన్‌- 8 ఎందుకు చెల్లదని ప్రశ్నించారు.
 
సెక్షన్‌-8ను చూపించి హైదరాబాద్‌పై అధికారం చెలాయించాలన్న ఉద్దేశం తమకు లేదని...హైదరాబాద్‌లో ఉన్న వారి కోసమే సెక్షన్‌-8 కోరుతున్నామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతల సమస్య లేదని అనడం దురదృష్టకరమన్నారు.
 
హైదరాబాద్‌లో ఆంధ్రులు ఎవరూ ఉద్యోగం చేయటానికి వీల్లేదని సీఎం కేసీఆరే చెప్పారని ఆయన గుర్తుచేశారు. జీహెచ్‌ఎంసీలో ఉన్న ఆంధ్రా ఉద్యోగులను రిలీవ్‌ చేయడంతో ఉద్యోగులపై కక్ష సాధింపు మొదలైందన్నారు. హైదరాబాద్‌లో వివిధ విభాగాల్లో ఉన్న ఆంధ్రా ఉద్యోగులను ఏకపక్షంగా రిలీవ్‌ చేశారన్నారని మండిపడ్డారు.
 
విభజన చట్టంలో రాష్ట్రంలోని పలు వ్యవస్థలను 9,10 షెడ్యూల్‌ క్రింద కేంద్రప్రభుత్వం విభజించిందని వీటి పంపిణీ కోసం పలు కమిటీలను కూడా నియమించిందన్నారు. అయితే 9,10 షెడ్యూల్‌ తమవే అంటూ తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా అధికారులను కార్యాలయాల్లోకి రానీయకుండా చేసిందని అశోక్‌బాబు ఆరోపించారు.
 
ఏపీఎన్జీవో కార్యాలయంపై పలుమార్లు దాడులు చేశారన్నారు. హైదరాబాద్‌లో ఆంధ్రా ఉద్యోగులను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారన్నారు. పదేళ్ల వరకు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని అని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో రాజధాని నిర్మాణానికి ఐదేళ్లు పడుతుందన్నారు. పది సంవత్సరాల పాటు ఉమ్మడి విద్యా అవకాశాలు ఇస్తే...గత విద్యా సంవత్సరం నుంచే మా ఎంసెట్‌ మాదే అంటూ విద్యార్థులందరికీ నష్టం కలిగించే విధంగా చేశారన్నారని అశోక్‌బాబు వ్యాఖ్యానించారు.
 
ఏపీపై గవర్నర్‌ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారన్నారు. హైదరాబాద్‌ను వదిలి వచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. హైదరాబాద్‌పై తమకేమీ ప్రత్యేకమైన మమకారం లేదన్నారు. రాజధానిని నిర్మించినా నిర్మించకపోయినా తాము వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేశారు. 9,10 షెడ్యూల్లోని సంస్థలను సరిగ్గా విభజించకపోతే,...ఆంధ్రప్రదేశ్‌కు రూ.25వేల కోట్ల నష్టం కలుగుతుందన్నారు.
 
స్పౌస్‌ కేటగిరీకి తెలంగాణ ఒప్పుకోవడం లేదన్నారు. విభజన వల్ల ఉద్యోగులకే ఎక్కువ నష్టం వాటిల్లుతోందన్నారు. హైదరాబాద్‌ను అగ్నిగుండంలా చేస్తే తెలంగాణానే నష్టమని అశోక్‌ అన్నారు. అగ్నిగుండాల ద్వారా సమస్య పరిష్కారం కాదని...రాజకీయంగా పరిష్కరించుకోవాలని సూచించారు. విభజన వల్ల ఉద్యోగులు, విద్యార్థులు నష్టపోతున్నారని, న్యాయం జరగకపోతే కేంద్రంపై ఒత్తిడి తెస్తామని...అందుకు ప్రజాప్రతినిధులు తమకు అండగా నిలవాలని అశోక్‌బాబు పిలుపునిచ్చారు.

రాష్ర్టాల వివాదాలపై కేంద్రం జోక్యం చేసుకోదు - వెంకయ్యనాయుడు

ఢిల్లీ : రాష్ర్టాల వివాదాలపై కేంద్రం జోక్యం చేసుకోదు - కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు

ఢిల్లీ, జూన్‌ 24 : రాష్ర్టాల వివాదాలపై కేంద్రం జోక్యం చేసుకోదని కేంద్రమంత్రి యం. వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. సెక్షన్‌-8పై రెండు రాష్ర్టాలు కేంద్రాన్ని సంప్రదిస్తే పరిశీలిస్తామన్నారు. వంద స్మార్ట్‌ సిటీలు, 500 అమృత నగరాలను అభివృద్ధి చేస్తామని మంత్రి ప్రకటించారు. 2022 నాటికి అందరికీ ఇళ్లు నిర్మించే కార్యక్రమాలను రేపు ప్రధాని ప్రారంభిస్తారని ఆయన పేర్కొన్నారు. పట్టణ జనాభా ఆధారంగా స్మార్ట్‌ సిటీలను ఎంపిక చేశామన్నారు. పీపీపీ పద్ధతిలో స్మార్ట్‌సిటీల నిర్మాణం చేపడతామని కేంద్రమంత్రి వెంకయ్య వివరించారు.

8ని ఒప్పుకోకుంటే..విభజననూఒప్పుకోం: ఏపీమంత్రులు

8ని ఒప్పుకోకుంటే..విభజననూఒప్పుకోం: ఏపీమంత్రులు
నేరాల్లేవని పోలీస్ స్టేషన్ ఎత్తేస్తారా?: ప్రత్తిపాటి

  • సెక్షన్‌ 8ను అమలు చేయాల్సిందే
  •  నేను చెప్పిందే వేదం అంటే కుదరదు
  •  తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఏపీ మంత్రులు ఫైర్‌
హైదరాబాద్‌, జూన్‌ 23(ఆంధ్రజ్యోతి): ‘హైదరాబాద్‌ నా తాత జాగీరు, నేను చెప్పిందే వేదం అని కేసీఆర్‌ అంటే కుదరదు. విభజన చట్టాన్ని ఆమోదించినవారు.. అందులోని సెక్షన్‌ 8ను ఆమోదించాల్సిందే. సెక్షన్‌ 8కి వారు అంగీకరించకపోతే... మేము విభజన చట్టాన్నే అంగీకరించం’ అని ఏపీ మంత్రులు తేల్చి చెప్పారు. మంగళవారం సచివాలయంలో పలువురు మంత్రులు విలేకరులతో మాట్లాడారు. సెక్షన్‌ 8ని అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. కేసీఆర్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్షన్‌ 8ని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రం, గవర్నర్‌లదేనని స్పష్టం చేశారు. సెక్షన్‌ 8ని సీఎం కేసీఆర్‌ చాక్లెట్‌ అనుకుంటున్నారని రావెల కిశోర్‌బాబు ఎద్దేవా చేశారు. తెలివి, జ్ఞానం, పునర్విభజన చట్టంపై నమ్మకం ఉన్నవారికి మాత్రమే దాని ఉద్దేశం అర్ధమవుతుందన్నారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో రెండు ప్రభుత్వాల మధ్య విభేదాలు ఏర్పడే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్తగా సెక్షన్‌ 8 ద్వారా గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు కల్పించారని చెప్పారు. ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకోవడం కోసమే ఏపీ ప్రభుత్వం సెక్షన్‌ 8 కోసం పట్టుపడుతున్నదనే ఆరోపణలను రావెల కొట్టిపారేశారు. ‘ఈ ఏడాదిలో ఏమీ జరగలేదని మీరు చెబుతున్నారు. ఎంసెట్‌తోపాటు ఎన్ని విషయాల్లో కోర్టు తెలంగాణ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిందో అందరికీ తెలిసిందే’ అని అన్నారు. విద్యుత్‌ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోమని హైకోర్టు ఆదేశించినా తెలంగాణ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
 
కాగా, ఒక పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఏడాది కాలంలో ఏమీ నేరాలు జరగకపోతే ఆ స్టేషన్‌నే ఎత్తేస్తారా అని ప్రత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. హైదరాబాద్‌లో సమస్యలు లేవని చెబుతూ సెక్షన్‌ 8ను అమలు చేయం అనడం కూడా అంతేనని అన్నారు. 

అది చెల్లని సెక్షన్: టి-అధికారుల వాదన

అది చెల్లని సెక్షన్: టి-అధికారుల వాదన
అటార్నీ జనరల్‌ చెప్పాక తిరుగే లేదు: ఏపీ అధికారులు

  • విభజన చట్టంలోనే మెలిక ఉంది..
  • కేంద్ర కేబినెట్‌ ఆమోదంతోనే గవర్నర్‌కు అధికారాలు
  • అటార్నీ జనరల్‌ చెప్పగానే సరిపోదు
  •  తెలంగాణ అధికారుల వాదన
  • ఆపరేషనల్‌ గైడ్‌లైన్స్‌ అక్కర్లేదు
  • సెక్షన్‌-8 అమలు తథ్యం.. ఏపీ సర్కారు ధీమా 
 
హైదరాబాద్‌, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): ‘సెక్షన్‌-8 అమలుకు అంగీకరించేది లేదు. జాతీయ స్థాయిలో పోరాడేందుకు కూడా సిద్ధం. న్యాయ పోరాటం కూడా చేస్తాం’ అని తెలంగాణ సర్కారు ప్రకటిస్తున్నప్పటికీ... అంతర్గతంగా మాత్రం సెక్షన్‌ 8 అమలు అసాధ్యమని ధీమాగా ఉంది. ఇప్పుడు జరుగుతున్నందంతా ఉత్తుత్తి హడావుడేనని చెబుతోంది. అటార్నీ జనరల్‌ తన అభిప్రాయం చెప్పినంత మాత్రాన, గవర్నర్‌కు దానంతట అవే అధికారాలు రావని టీ-సర్కారు పేర్కొంటోంది. ‘‘గవర్నర్‌కు అటార్నీ జనరల్‌ తన అభిప్రాయం చెప్పడం పరిపాలనా ప్ర క్రియలో భాగంగా జరిగిన తతంగమే! సెక్షన్‌-8పై పడిన తొలి అడుగు మాత్రమే. అయితే, కేవలం అటార్నీ జనరల్‌ లేఖ ఆధారంగా గవర్నర్‌కు అధికారాలు వచ్చేయవు’’ అని తెలంగాణకు చెందిన ఉన్నతస్థాయి వర్గాలు చెబుతున్నాయి. ‘సెక్షన్‌-8కు సంబంధించి రాష్ట్ర విభజన చట్టంలోనే లోపం ఉంది. అదే మాకు రక్షణ కల్పిస్తుంది’ అని టీ-అధికారులు చెబుతున్నారు. ఏ చట్టంలోనైనా ఆయా అంశాలకు సంబంధించి సంక్షిప్తమైన ప్రస్తావన మాత్రమే ఉంటుంది. వీటికి వివరణ ఇస్తూ, అమలుకు సంబంధించిన మార్గదర్శకాలు రూపొందించే అధికారాన్ని కల్పిస్తూ ‘పవర్‌ టు మేక్‌ రూల్స్‌’ అనే క్లాజ్‌ను చట్టంలో తప్పనిసరిగా పెట్టాలి. కానీ, విభజన చట్టంలో ఈ విషయం లేదు. ‘‘సెక్షన్‌ 8పైనా కేంద్రం మార్గదర్శక సూత్రాలు జారీ చేయాలి. అదికూడా... కేంద్ర కేబినెట్‌ ఆమోదంతోనే జరగాలి. దీని మేరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నోటిఫికేషన్‌ను, గవర్నర్‌ రీ-నోటీఫై చేయాల్సి ఉంది. అంతేతప్ప, గవర్నర్‌ తనంతట తాను నోటిఫికేషన్‌ ఇవ్వలేరు’’ అని తెలంగాణ అధికారులు చెబుతున్నారు. పైగా... అటార్నీ జనరల్‌ సూచనలను గవర్నర్‌ పట్టించుకోవాల్సిన అవసరంలేదని చెబుతున్నారు.‘‘పరిపాలనాపరమైన చర్యలకు సంబంధించి కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు గవర్నర్‌ నడుచుకోవాల్సి ఉంటుంది. అంతేతప్ప, అటార్నీ జనరల్‌ చెప్పగానే గవర్నర్‌కు అధికారాలు వచ్చేయవు’’ అని పేర్కొంటున్నారు. పైగా, ఉమ్మడి గవర్నర్‌కు ‘ప్రత్యేకమైన అధికారాలు ఉండవు’ అని కేంద్ర హోంశాఖ పార్లమెంటుకు లిఖితపూర్వకంగా తెలిపిందని చెబుతున్నారు. ‘‘గవర్నర్‌కు ప్రత్యేక బాధ్యతలు మాత్రమే ఉంటాయి. విశేషమైన (ఎక్స్‌క్లూజివ్‌) బాధ్యతలు ఉండవు... అని హోంశాఖ తెలిపింది. నిజానికి రెండు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌గా రెండు రాష్ట్రాల అధికారులను నరసింహన్‌ పిలిపించుకోవచ్చు. అన్ని రాష్ట్రాల గవర్నర్లకు ఉన్న అధికారాలే నరసింహన్‌కూ ఉన్నాయి’’ అని తెలంగాణ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇటీవల కేంద్ర హోంశాఖ కూడా సెక్షన్‌-8పై రాష్ట్రానికి సంబంధించిన రూల్స్‌ను సవరించుకోవాలని తెలంగాణ సర్కారును కోరింది. ఇందుకు టీ-సర్కారు ససేమిరా అంది. ‘‘ఒక రాష్ట్ర పరిధిలో మరో రాష్ట్ర పోలీసులకు అధికార పరిధి ఉండదు. రూల్స్‌ ఫ్రేమ్‌ చేయాలని విభజన చట్టంలో లేదు. రాజ్యాంగం ప్రకారం గవర్నర్‌ రాష్ట్ర కేబినెట్‌ సిఫారసుల మేరకే చర్యలు తీసుకోవాలి’’ అని కేంద్రానికి లేఖ పంపింది. దీంతో, కేంద్రం కూడా ఈ విషయాన్ని అంతటితో వదిలేసింది. వీటన్నింటి నేపథ్యంలో... ప్రస్తుతం సెక్షన్‌ 8పై జరుగుతున్నది తాత్కాలిక రగడేనని, అది అమలులోకి వచ్చే అవకాశమే లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ... ఈ విషయంలో అప్రమత్తంగానే ఉన్నారు.
 
విభజన చట్టమే ఫైనల్‌!
‘‘సెక్షన్‌ 8కు లైన్‌ క్లియర్‌ అయ్యింది. ఇందులో శషభిషలేవీ లేవు. దీనిని అమలు చేసి తీరాల్సిందే’’ అని ఆంధ్రప్రదేశ్‌ సర్కారు గట్టిగా చెబుతోంది. ఈ విషయంలో తెలంగాణ అధికారులు చేస్తున్న వాదనలను తిప్పి కొడుతున్నారు. ‘‘చట్టంలో ఉన్న ప్రతి అంశానికీ ఆపరేషనల్‌ గైడ్‌లైన్స్‌ జారీ చేయాల్సిన అవసరం లేదు. ఉమ్మడి రాజధానిలో గవర్నర్‌కు ఉన్న అధికారాలపై సెక్షన్‌-8లో కావాల్సినంత స్పష్టత ఉంది. దానిని గవర్నర్‌ నేరుగా అమలు చేయవచ్చు’’ అని పేర్కొంటున్నారు. ఏపీ వర్గాల వాదన ప్రకారం... రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న తాజా పరిణామాలు, సెక్షన్‌-8 అమలుకు ఏపీ డిమాండ్‌ నేపథ్యంలో గవర్నర్‌ నరసింహన్‌ తనంతట తాను నేరుగా దీనిపై అటార్నీ జనరల్‌ అభిప్రాయం కోరారు. సెక్షన్‌-8ను క్షుణ్నంగా పరిశీలించిన అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గీ గవర్నర్‌కే తన అభిప్రాయం చెప్పారు. ‘‘గవర్నర్‌ రాజ్యాంగ హోదాలో ఉన్న వ్యక్తి. సెక్షన్‌ 8 అమలుకు సంబంధించి సందేహాలు వస్తే న్యాయ నిపుణుల సలహా తీసుకుని తనంతట తాను చర్యలు తీసుకోవచ్చు. చట్టం ప్రకారం ఈ దేశ అత్యున్నత న్యాయ నిపుణుడు అటార్నీ జనరల్‌. గవర్నర్‌కు ప్రత్యేక, విశేష అధికారాలు ఉంటాయని ఆయనే తేల్చి చెప్పారు. ఇక సెక్షన్‌ -8కు లైన్‌ క్లియర్‌ అయినట్లే’’ అని ఏపీ సర్కారు పేర్కొంటుంది. పైగా... గవర్నర్‌ నేరుగా అటార్నీ జనరల్‌ అభిప్రాయం కోరారని, అటార్నీ జనరల్‌ కూడా గవర్నర్‌కు తన అభిప్రాయం చెప్పారని గుర్తు చేస్తున్నారు. ‘‘వారు ఏమంటున్నారు, వీరు ఏమంటున్నారన్నది ముఖ్యం కాదు. చట్టంలో ఏమున్నదన్నదే కీలకం. ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతలపై గవర్నర్‌కు ప్రత్యేక బాధ్యతలున్నాయని సెక్షన్‌ 8 చెబుతోంది. గవర్నర్‌ తెలంగాణ కేబినెట్‌ను సంప్రదించినప్పటికీ, ఆయన సొంత విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవచ్చునని, దీనిని ఎవరూ ప్రశ్నించలేరని స్పష్టంగా ఉంది. ఈ సెక్షన్‌ చెల్లదంటే, రాష్ట్ర విభజన చట్టం కూడా చెల్లదు’’ అని గట్టిగా వాదిస్తున్నారు. అటార్నీ జనరల్‌ అభిప్రాయం మేరకు గవర్నర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయడం తథ్యమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.