Tuesday, 5 November 2013

కోర్కెలు తీర్చండి : కావూరి

కోర్కెలు తీర్చండి : కావూరి

Published at: 06-11-2013 10:00 AM
 New  0  0 
 
 

సీమాంధ్ర కేంద్ర మంత్రుల తీర్మానం
ప్రధాని,సోనియా, రాహుల్ జీీవోఎంని కలవాలని నిర్ణయం
విభజనకు మానసికంగా సిద్ధం
సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు రాష్ట్ర విభజనకు మానసికంగా సిద్ధమయ్యారు! సీమాంధ్ర ప్రయోజనాలపై దృష్టి సారించారు! 'కోర్కెల చిట్టా'ను తయారు చేశారు! విభజన 'అనివార్యమైతే'.. దానిని అమలు చేయాలని అధిష్ఠానాన్ని కోరాలని నిర్ణయించుకున్నారు! కేంద్ర మంత్రి కావూరి కార్యాలయంలో సీమాంధ్ర కేంద్ర మంత్రులు సమావేశమై డిమాండ్ల జాబితా ఖరారు చేశారు.
విభజన అనివార్యమైతే హైదరాబాద్‌ని యూటీ చేయాలి ం రాయల తెలంగాణకూ అభ్యంతరం లేదు ం 20 ఏళ్లపాటు సీమాంధ్రకు నిధుల కేటాయింపులపై నిర్దిష్ట హామీ ఇవ్వాలి ం గుంటూరు, విజయవాడ మధ్య కొత్త రాజధానిని నిర్మించాలి ం రాజధాని నిర్మాణానికి భారీ ప్యాకేజీ ఇవ్వాలి ంసీమాంధ్రకు పన్నుల నుంచి మినహాయింపునివ్వాలి ం హైదరాబాద్ ఆదాయాన్ని జనాభా నిష్పత్తి ప్రకారం పంచాలి ం రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలి ం జల వనరుల పంపిణీ కోసం కేంద్రం పర్యవేక్షణలో ప్రత్యేక బోర్డును ఏర్పాటుచేయాలి ం రాయలసీమకు నికర జలాల్లో వాటా కల్పిస్తూ చట్టబద్ధం చేయాలి ం కృష్ణా, గోదావరి డెల్టాలకు ముందే నీటి కేటాయింపులు ఉండాలి ం పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలి ం పులిచింతలనూ కేంద్రమే నిర్మించాలి ం విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయికి మార్చాలి ం విశాఖ విమానాశ్రయాన్ని మరింతగా అభివృద్ధి చేయాలి.
- See more at: http://www.andhrajyothy.com/node/22071#sthash.URqPUCMc.dpuf

No comments:

Post a Comment